శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రన్నాయుడి లోటును భర్తీ చేసేదెవరు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerrannaidu
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతి నేపథ్యంలో ఆయన లోటును భర్తీ చేసే వారిపై ఇప్పుడు జిల్లాలో చర్చ జరుగుతోందట. శ్రీకాకుళం జిల్లా టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రన్న మృతి మృతి అందర్నీ కలిచి వేసింది. నిత్యం జిల్లా ప్రజల్లో మమేకమైన, కార్యకర్తలకు అండగా ఉన్న ఎర్రన్నాయుడి వంటి వ్యక్తి దొరకడం కష్టమేనని అంటున్నారు.

నోటిమాటతో జిల్లా పార్టీ శ్రేణుల్ని సమన్వయపరిచే ఎర్రన్న మృతి టిడిపికి తీరని లేటే. కొంతలో కొంత అయినా ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగే వారిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎర్రన్నాయుడు స్థానాన్ని ఆయన సతీమణి విజయ లేదా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడుతో భర్తీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. రాజకీయాల్లోకి కొడుకులు, కూతుళ్లు రావడం సాధారణమై పోయింది.

అయితే ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాలపై ఆసక్తితో తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చి, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నిలబెడతారా అనేది చూడాలి. రామ్మోహన్ నాయుడుకి కాకున్నా ఆయన సతీమణి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్న వెంట నడిచిన తెలుగు తమ్ముళ్లను నడిపిస్తారా అనే చర్చ సాగుతోంది.

అయితే ఎవరు వచ్చినా జిల్లాలో తన క్యాడర్‌కు మాత్రమే న్యాయం చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఎర్రన్నాయుడు పోషించిన పాత్రను పోషించడం మాత్రం ఎవరి వల్ల అయ్యే పని కాదు. జిల్లాలో ఎర్రన్నాయుడు లేని కొరతను తనయుడు, భార్యనో లేక మరో నేత ఎవరు కొంతలో కొంత తీర్చనా.. పార్టీలో మాత్రం ఆయన లేని లోటును పూడ్చలేదనిదే అని అంటున్నారు.

English summary
Telugudesam Party lost very important leaders from Uttarandhra with Errannaidu's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X