వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న కసబ్ నేడు అఫ్జల్: ముందస్తు వ్యూహమేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Afzal - Ajmal Amir Kasab
కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే దాదాపు మూడు నెలల క్రితం అజ్మల్ కసబ్‌ను ఇప్పుడు అఫ్జల్ గురును ఉరి తీసిందని అంటున్నారు. ఎక్కువ మంది హిందూ ఓటర్లు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ వైపు మరలుతుండటంతో ఆ పార్టీకి చెక్ చెప్పడంతో పాటు ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే.. అంటే రాజకీయ లబ్ధి కోసమే ఉరి తీసినట్లుగా అనుమానిస్తున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను ఆరు నెలల ముందే ఎదుర్కొనే సన్నాహాల్లో యూపిఏ ఉన్నదని చెబుతున్నారు. ఇటీవలి పరిణామాలు ఈ సందేహాలను నిర్ధారిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. గత నవంబర్ 21న కసబ్‌ను, శనివారం అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని బట్టి పలువురు ముందస్తు ఎన్నికల అంచనా వేస్తున్నారు. అఫ్జల్ గురుపై శుక్రవారం రాత్రి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.

బిజెపి హిందుత్వ అజెండాను బలంగా లేవనెత్తుతున్న తరుణంలో, పార్లమెంటు బడ్జెట్ భేటీకి ముందు తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికలను ముందుకు జరిపే సూచనగా పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు బిజెపి అగ్ర నేత వెంకయ్యనాయుడు చెప్పారు కూడా. శనివారం చెన్నైలో, ఆదివారం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు అవకాశముందన్నారు.

కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి మాత్రం ముందస్తు ఎన్నికలను కొట్టి పారేస్తున్నారు. అయితే, గతంలో స్వయంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు లేవంటూనే కాంగ్రెసు ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురుల ఉరి శిక్ష అమలు అందులో భాగమే అంటున్నారు.

English summary
The hanging of Mohammed Ajmal Amir Kasab for the 2008 terrorist attack on Mumbai has robbed the Bharatiya Janata Party (BJP) of an issue in the Gujarat elections and in the winter session of Parliament, but it is unlikely to be of much electoral advantage to the Congress either, say analysts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X