వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం: సీమలో షర్మిల, సిటీలో వీరు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అనంతపురం/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర నాలుగో రోజైన గురువారం అనంతపురం, కర్నూలు జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల పైన నిప్పులు చెరిగారు.

టిడిపి కాంగ్రెసుతో కుమ్మక్కైందని, దానిని కప్పి పుచ్చుకునేందుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. తామే కుమ్మక్కైతే జగన్‌ను అన్యాయంగా జైల్లో ఎందుకు పెడతారని, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలా కేంద్రమంత్రో, ముఖ్యమంత్రో అయ్యుండేవారన్నారు.

ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెసు పార్టీ విభజనకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాగా అనంతపురంలోని పామిడిలో షర్మిలను సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఆమె మరో దారిలో కర్నూలుకు వెళ్లారు. మరోవైపు సీమాంధ్రలో విభజన నిర్ణయంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాదులో ఎపిఎన్జీవోలు సభకు సిద్ధం అవుతున్నారు.

పామిడిలో...

పామిడిలో...


వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖరావానికి అనంతపురం జిల్లా పామిడిలో తరలి వచ్చిన జన సందోహం.

మాట్లాడుతున్న షర్మిల

మాట్లాడుతున్న షర్మిల

అనంతపురం జిల్లాలోని పామిడిలో తన సమైక్య శంఖారావ యాత్రకు తరలి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

అభివాదం

అభివాదం

అనంతపురం జిల్లాలోని పామిడిలో తన సమైక్య శంఖారావ యాత్రకు తరలి వచ్చిన వారికి నమస్కరిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

మందకృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎల్పీ స్టేడియంలో ఎపిఎన్జీవో సభ సరికాదని, ఆ సభ తెలంగాణ ప్రజల పైన, దళితుల పైన దాడిగా తాము భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం చెప్పారు.

సోనియా సమన్యాయం

సోనియా సమన్యాయం

సీమాంధ్రకు తెలిసిన సమన్యాయం అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే. ఎన్ని లక్షల కోట్లైనా సమైక్యాంధ్ర ముందు బలాదూర్.. అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు.

టిక్కెట్

టిక్కెట్

ఈ నెల 7వ తేదిన జరగనున్న ఎపిఎన్జీవో సభకు గురువారం టిక్కెట్స్ అమ్మారు. డబ్బుల పెట్టెలో పది రూపాయలు వేస్తున్న ఓ సీమాంధ్ర ఉద్యోగి.

టిక్కెట్

టిక్కెట్

ఈ నెల 7వ తేదిన జరగనున్న ఎపిఎన్జీవో సభకు గురువారం టిక్కెట్స్ అమ్మారు. డబ్బుల పెట్టెలో పది రూపాయలు వేస్తున్న ఓ సీమాంధ్ర ఉద్యోగులు.

డబ్బులు వేస్తూ ప్రమాణం!

డబ్బులు వేస్తూ ప్రమాణం!

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవో సభకు వచ్చిన డబ్బులను సీమాంధ్ర ఉద్యమానికి ఖర్చు పెడతామని చెబుతూ డబ్బాలో డబ్బులు వేస్తూ చెబుతున్న సీమాంధ్ర ఉద్యోగులు.

English summary

 The Samikyandhra agitators of non-political JAC stopped YSR Congress leader Sharimila’s Samikya Sankharavam bus yatra from entering Pamidi mandal headquarters on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X