వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: సిబిఐ జెడి బదలీపై వీడని సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులు దర్యాఫ్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ బదలీపై ఇంకా సస్పెన్స్ వీడినట్లుగా కనిపించడం లేదు. డిప్యుటేషన్ పైన సిబిఐ హైదరాబాద్ బ్రాంచ్‌కు వచ్చిన లక్ష్మీ నారాయణ సొంత క్యాడర్ మహారాష్ట్రకు వెళ్లనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన మహారాష్ట్రకు తిరిగి వెళ్తారా? ఇక్కడే కొనసాగుతారా? అనే విషయమై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ 2006 జూన్‌లో సిబిఐ డిఐజి హోదాలో హైదరాబాద్ బ్రాంచ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 10వ తేదితో ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. సిబిఐలో ఐదేళ్ల సర్వీసు పూర్తయ్యాక 2011లో ఆయన తిరిగి మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉండింది.

అప్పుడే అత్యంత కీలకమైన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఆ వెంటనే జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తును సిబిఐ చేపట్టింది. దీంతో సిబిఐలో లక్ష్మీ నారాయణ సర్వీసును ఏడాది పొడిగించారు. ఆ గడువు గత ఏడాదితో ముగిసింది. జగన్ అరెస్టు అయిన వెంటనే జెడిని బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించడంతో లక్ష్మీ నారాయణ సర్వీసును మరో ఏడాది పొడిగించారు.

ఈ గడువు ఈ నెల 10తో ముగియనుంది. కేంద్ర సర్వీసుల్లో గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగించే అవకాశం లేకపోవడంతో... జూన్ 11లోగా రిలీవ్ కావాలని జెడికి ఆదేశాలు అందినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సమాచారం మేరకు.. మరో ఏడాది కూడా జెడిని పొడిగించే అవకాశాలు ఉన్నాయట. మరోవైపు లక్ష్మీ నారాయణ కొనసాగడానికి లేదా వెళ్లిపోవడానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. సిబిఐ ప్రధాన కార్యాలయం నుండి ఆయనకు రిలీవింగ్ ఆదేశాలు కూడా రాలేదు. మరో ఏడాది అవకాశముండటం, ఉత్తర్వులు ఇప్పటి వరకు రాకపోవడంతో ఆయన బదలీపై వెళతారా? లేక రాష్ట్రంలోనే కొనసాగుతారా? అనే అంశం చర్చనీయాంశమైంది.

English summary

 Suspense over CBI JD Laxmi Narayana transfer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X