చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమర్‌నాథ్‌రెడ్డికి బాబు ప్రశంసలు: టిడిపి ప్లాన్‌తో ప్రత్యర్థులకు షాక్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

అమర్‌నాథ్‌రెడ్డికి బాబు ప్రశంసలు: ప్రత్యర్థులకు షాక్ | Oneindia Telugu

చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది. ఇటీవల కాలంలో పార్టీ జిల్లా నాయకులు తీసుకొంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని పార్టీ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేస్తోంది.అదే సమయంలో ప్రత్యర్థుల నుండి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో టిడిపి నేతల మధ్య సమన్వయలోపం కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది.

చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం మెజారిటీ సీట్లను కైవసం చేసుకోనేలా టిడిపి నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

సంస్థాగత ఎన్నికలు పూర్తైన తర్వాత నుండి పార్టీ నాయకత్వం తీసుకొంటున్న చర్యలు పార్టీని గాడిలో పెట్టేందుకు దోహదపడ్డాయని పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

చిత్తూరులో టిడిపి బలోపేతం కోసం చర్యలు

చిత్తూరులో టిడిపి బలోపేతం కోసం చర్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు తెలుగుదేశంపార్టీలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. నేతల మధ్య మొన్నటి వరకు ఉన్న విభేదాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2014 ఎన్నికలకు ముందు పరిస్థితులను పక్కన పెడితే... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ నేతలు కలిసికట్టుగా లేరు. జిల్లా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకొంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

అసంతృప్త నేతలతో చర్చలు

అసంతృప్త నేతలతో చర్చలు

అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిలు కలిసి పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇలా గొడవలు ఉన్న నియోజకవర్గాలను గుర్తించి .. బాధ్యులైన నేతలను జిల్లా పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చిస్తున్నారు ఇద్దరు. విభేదాలు విడనాడాలని గట్టిగా చెబుతున్నారు. తప్పు చేసిన నేతలను హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే నేతలకు భరోసా కల్పిస్తున్నారు. నామినేటేడ్ పదవుల విషయంలో నాయకత్వానికి సిఫారసు చేస్తున్నారు.

పార్టీ కోసం పనిచేసే నేతలకు గుర్తింపు

పార్టీ కోసం పనిచేసే నేతలకు గుర్తింపు

సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవారికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రాధాన్యత కల్పించేందుకు మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాని ప్రయత్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులను సైతం వీలైనంత త్వరగా భర్తీ చేయాలనుకుంటున్నారు. ప్రతి రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు జిల్లా పార్టీ కార్యాలయంలోనే అధ్యక్షుడు అందుబాటులో ఉంటున్నారు. నేతల సమస్యలను ఓపిగ్గా వింటున్నారు. వాటికి పరిష్కారం చూపుతున్నారు.బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత అమర్‌నాథ్‌రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

బలమైన ప్రత్యర్థిపార్టీల నేతలకు గాలం

బలమైన ప్రత్యర్థిపార్టీల నేతలకు గాలం

జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను టిడిపి నాయకత్వం చిత్తూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో బలమైన నాయకులకు వల వేస్తోంది. గ్రామ.. మండల.. నియోజకవర్గ స్థాయిలలో ప్రజాదరణ కలిగిన ఇతర పార్టీల నేతలను గుర్తించి వారిని టీడీపీలో చేర్పించే ప్రక్రియ చేపట్టారు. ఈ ఇద్దరు నేతలు అనుసరిస్తున్న వ్యూహం ఫలితాలను ఇస్తోందని టిడిపి రాష్ట్ర నాయకత్వం అభిప్రాయంతో ఉంది.గతంలో ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా పోటీచేసినవారు, మాజీ ఎమ్మెల్యేలపై కూడ టిడిపి నాయకత్వం కేంద్రీకరించింది. త్వరలోనే టిడిపిలోకి వలసలు ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు.

English summary
Ap minister Amarnath Reddy plannig for strengthen party in Chittoor district.minister Amarnath Reddy stratagy for win majority assembly seats in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X