ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అనకాపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా యలమంచిలి మండల పరిధిలోని ఒక గ్రామం, మునగపాక మండలం ప రిధిలో 11 గ్రామాలు యలమంచిలి నియోజకవర్గంలోకి వెళ్లాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణను ఓడించారు. గంటా ఇంత కుముందు చోడవరం లో టిడిపి నుండి ఎన్నికయ్యారు. అనకాపల్లిలో 1983 నుండి 1999 వరకు వరుసగా టిడిపి గెలిచింది. టిడిపి నేత దాడి వీరభద్రరావు నాలుగు సార్లు విజయం సాధించారు. సిపిఐ ప్రముఖ నేత గోవిందారావు నాలుగు సార్లు గెలి చారు. 2004 లో ఇక్కడ గెలిచిన కొణతాల రామకృష్ణ మంత్రిగా పని చేసారు. గతంలో రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యా రు. ఒకసారి ఆయన కేవలం తొమ్మది ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడి నుండి గెలిచిన దాడి వీరభద్రరావు ఎన్టీఆర్ క్యాబి నెట్లో మంత్రిగా ఉన్నారు.
14 సార్లు ఎన్నికలు..
14 సార్లు ఎన్నికలు జరిగితే..ఇక్కడ టిడిపి ఆరు సార్లు, సిపిఐ నాలుగు సార్లు, కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది. కెఎల్పి ఒక సారి గెలుపొందింది. 2009 ఎన్నికల తరువాత టిడిపి -కాంగ్రెస్ లో కీలక నేతలు గా ఉన్న కొణతాల రామకృష్ణ, దాడి వీరహ ద్రరావు ఇద్దరూ వైసిపి లోకి వెళ్లారు. ఇక్కడి నుండి కొణతాల సోదరుడు వైసిపి నుండి 2014 ఎన్నికల్లో పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 189895 ఓట్లు ఉండగా, అందులో 149063 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన పీలా గోవింద సత్యనారాయణ కు 79911 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన కొణతాల రఘునాధ్ కు 57570 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన పీలా గోవింద సత్యనారాయణ 22341 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల తరువాత దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఇద్దరూ వైసిపి కి దూరంగా ఉంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!