వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ప్రత్యేక హోదా: బాబు రెండు నాల్కల ధోరణి.. హస్తిన సాక్షిగా తెలుగు ఆత్మగౌరవం గంగపాలు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని నానుడి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మహత్తరమైన వ్యూహాత్మక రాజకీయ ఘట్టం సాగుతోంది. పరిస్థితులు చేజారుతుండటంతో రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడం ఆనవాయితీగా మారింది. 2014 ఎన్నికలు జరిగింది మొదలు ఇప్పటివరకు ప్రత్యేక హోదా కోసం నిరంతరాయంగా ఆందోళనకు దిగిన నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అఫ్ కోర్స్ వారి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉన్నాయి. అది వేరే సంగతి.
ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రచారోద్యమంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అందునా చంద్రబాబు నాయుడు తీరే వేరని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

జాతీయ నేతలందరితోనూ విభజన వ్యతిరేక వాణి వినిపించిన బాబు

జాతీయ నేతలందరితోనూ విభజన వ్యతిరేక వాణి వినిపించిన బాబు

సరిగ్గా నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిలిపివేయాలని నినదిస్తూ హైదరాబాద్ నుంచి దేశంలోని నలు మూలలకు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుసుకుని ప్రాధేయపడిన నేపథ్యం ప్రస్తుత ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుది. చివరకు ప్రస్తుత ప్రధాని, నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని గాంధీనగర్, ఢిల్లీ, పంజాబ్‌లో పలుసార్లు అభ్యర్థించినా ప్రయోజనం లేకపోయింది.

ఏపీకి ఐదేళ్లపాటు హోదాతోపాటు రెవెన్యూలోటు భర్తీ చేస్తామని హామీ

ఏపీకి ఐదేళ్లపాటు హోదాతోపాటు రెవెన్యూలోటు భర్తీ చేస్తామని హామీ

ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ.. ఏపీకి ప్రత్యామ్నాయం చూపాలన్న ముందుచూపుతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని రాజ్యసభ సాక్షిగా హామీలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో ఖంగు తిన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడు తదితరులు పదేళ్ల ప్రత్యేక హోదా డిమాండ్ ముందుకు తెచ్చినా నిష్ప్రయోజనమైంది.

తిరుమల సాక్షిగా 15 ఏళ్ల ప్రత్యేక హోదాకు హామీ

తిరుమల సాక్షిగా 15 ఏళ్ల ప్రత్యేక హోదాకు హామీ

చివరకు వెంకయ్యనాయుడు వల్లే టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ రెండు పార్టీలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోడయ్యారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగిన బహిరంగ సభలో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ వరకు అంతా పదేళ్ల నుంచి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వారే. తాము అధికారంలోకి వస్తే ఆ పని చేస్తామని ఆంధ్రులకు హామీ ఇచ్చారు.

అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఏపీని విభజించారని ఆరోపణలు

అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఏపీని విభజించారని ఆరోపణలు

అధికారం హస్తగతమైన తర్వాత ఇరు పార్టీలు కేంద్ర, రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. నాటి నుంచి మొన్నమొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు మొదలు కేంద్ర మాజీ మంత్రులు వై సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు నుంచి రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారే. ‘పార్లమెంట్ తలుపులు మూసి, అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, విద్యుత్ సరఫరా నిలిపివేసి విభజన బిల్లును ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు' అని వాదించిన వారే. కాంగ్రెస్ పార్టీ అందుకు మూల్యం చెల్లిస్తోందని పేర్కొన్న వారే.

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్ అన్న చంద్రబాబు

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెస్ట్ అన్న చంద్రబాబు

15 ఏళ్ల ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన చంద్రబాబు.. 2015లో ఓటుకు నోటు కేసు బయటపడ్డ తర్వాత స్వరం మార్చారని విమర్శకులు అభిప్రాయ పడుతుంటారు. క్రమంగా ప్రత్యేక హోదా సంజీవిని కాదు అనే వాదం ముందుకు తెచ్చారు. ప్రత్యేక ప్యాకేజీతోనే లాభాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారు జైలుకెళ్లాల్సిందేనని బెదిరింపు రాజకీయాలకు దిగారు.

పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ల పేరిట అవినీతి

పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ల పేరిట అవినీతి

రైతుల నుంచి వేల ఎకరాల భూమి రాజధాని పేరిట స్వాధీనం చేసుకుని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో అద్యంతం రాజకీయాలు చేస్తూ.. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాల పేరిట విన్యాసాలతో కాలం గడిపిన నేపథ్యం అధికార టీడీపీ, ఏపీ సీఎం చంద్రబాబులది. తీరా ఎన్నికలు దగ్గరపడినా కొద్దీ స్వరం మారుతూ వచ్చింది. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ఏపీలో ఎదగాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నా.. విభజన హామీలు అమలు చేయలేదన్న విమర్శ.. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేదు.

చంద్రబాబు బలహీనపడితే.. ప్రజలకు నష్టమని బాబు నిష్ఠూరాలు

చంద్రబాబు బలహీనపడితే.. ప్రజలకు నష్టమని బాబు నిష్ఠూరాలు

ఏపీ సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ‘ఈ రోజు నేను బలహీనపడితే.. ఆంధ్రప్రదేశ్‌ బలహీనపడుతుంది. ప్రజలకు నష్టం జరుగుతుంది. నాయకత్వాలను బలహీనపర్చడం, ప్రశ్నించిన వాళ్లపై ఎదురుదాడి చేయడం, చేయించడం వంటి చర్యలకు కేంద్రం పాల్పడుతోంది. తెలుగుజాతి ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టేది లేదు. నాకు ప్రజల సహకారం కావాలి. రాష్ట్రానికి న్యాయ సమ్మతంగా రావాల్సిన వాటన్నింటి కోసం విద్యార్థులు, కళాకారులు, ప్రజలు అందరం కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిది. హోదా సహా ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని కాంగ్రెస్‌ తాజాగా పేర్కొంటోంది. వాళ్లు చేస్తామంటున్నవి.. ఇప్పుడున్నవాళ్లు ఎందుకు చేయలేమంటున్నారో చెప్పాలి' అని ఆదివారం ‘విళంబి' నామ సంవత్సర ఉగాది ఉత్సవాల్లో వ్యాఖ్యలు చేశారు.

ఫ్లెక్సీలో ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు

ఫ్లెక్సీలో ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు

‘బ్రదర్! నమ్మించి మోదీ నట్టేట ముంచాడు.. గుండె పగిలి ఆత్మగౌరవ జాతి నీ వెంట ఉన్నాది. నడి సంద్రాన ప్రగతి నావ నడిపించాలి. కుట్ర, కుతంత్రాలకు ఎదురొడ్డి పోరాడి నావ దరి చేర్చు మొనగాడా. చంద్రబాబు' అని ఒక టీడీపీ నేత బెజవాడ వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోకముందు అదే నేత మోదీని ఉద్దేశించి మరోరూపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

స్ఫూర్తిదాయక పోరాటం చేయాలని సవాళ్లు

స్ఫూర్తిదాయక పోరాటం చేయాలని సవాళ్లు

సోమవారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ‘ఇతర పార్టీలతో బీజేపీయే గలాభా సృష్టించి, సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల కదలికల్ని బట్టి మన స్పందన ఉండాలి. ఏపీకి జరిగిన అన్యాయంపై దేశం మొత్తం సానుభూతితో ఉంది. పలు పార్టీల నుంచి వస్తున్న మద్దతే అందుకు నిదర్శనం. మంగళవారం కూడా ఇదే స్ఫూర్తితో పోరాడండి. ఐదు కోట్ల ప్రజలు మీ వెనుక ఉన్నారు. మీ వైపే రాష్ట్రం, దేశం యావత్తూ చూస్తోంది' అని వ్యాఖ్యానించారు.

తన వ్యతిరేకులంతా ఏపీ ద్రోహులని వితండ వాదం

తన వ్యతిరేకులంతా ఏపీ ద్రోహులని వితండ వాదం

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంవోలో తిష్టవేయడం.. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని పదే పదే కలవడం కంటే లాలూచీ రాజకీయాలకు రుజువులేం కావాలి? నాలుగేళ్లుగా విమర్శలు చేయని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇప్పుడే ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో అందరికీ తెలుసు. ద్రోహులు ఎవరికీ డిపాజిట్లు కూడా రావు' అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిష్ఠూరంగా మాట్లాడారు.

రిజర్వేషన్ల పెంపు కోసం టీఆర్ఎస్ నిరసన

రిజర్వేషన్ల పెంపు కోసం టీఆర్ఎస్ నిరసన

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతునిస్తామని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ చెబుతూనే.. మరోవైపు లోక్‌సభలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టకుండా పరోక్షంగా బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి సహకరిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఒకే దేశం.. ఒకే చట్టం' కావాలనే నినాదంతో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వెల్‌లో ప్రవేశించడంతో సభ ఆర్డర్‌లో లేదనే సాకుతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారానికి వాయిదా వేశారు. అన్నాడీఎంకే సభ్యులు కూడా ప్రధాని మోదీ, బీజేపీ సూచన మేరకే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
AP CM Chandrababu played double standard on Special Status. In 2014 tooth and nail he has against bifurcate united Andhra Pradesh. Then he demanded 15 years special status while mainly he has permitted to special package. Other side YSR Congress party agitated for Special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X