వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్‌కు ఆజంఖాన్ ఝలక్: సమావేశానికి డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Azam Khan ‘upset’, skips SP national meet
ఆగ్రా: మత ఘర్షణ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆంజఖాన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఝలక్ ఇచ్చారు. బుధవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పార్టీకి సంబంధించి ముస్లింలకు ప్రతినిధిగా భావించే ఆజంఖాన్ గైర్హాజర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆజంఖాన్ గైర్హాజరీ పార్టీని ఇరకాటంలో పడేసింది. అనారోగ్యం కారణంగా ఆజంఖాన్ రెండు రోజుల మేధోమథన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారని ఎస్పీ వర్గాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముజఫర్ నగర్ అల్లర్ల నియంత్రణలో అఖిలేష్ యాదవ్ విఫలమయ్యారనే ఆసంతృప్తితోనే ఆయన సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

2012 ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆజంఖాన్ అంటూ వస్తున్నారు. ముజఫర్ అల్లర్ల విషయంలో అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అల్లర్లు విస్తరించకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కొన్ని ముస్లిం గ్రూపులు కూడా అంటున్నాయి. అల్లర్లలో ఇప్పటి వరకు 38 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ సమావేశానికి హాజరు కాకపోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అల్లర్లను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని జమైత్ ఉలామా -ఐ - హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా ముస్లిం మజ్లీస్ - ఎ - ముషావరత్, జమాత్ - ఎ - ఇస్లామీ హింద్, జమైత్ ఆహ్లే హదీస్ హింద్ వంటి ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. ఆజంఖాన్ అసంతృప్తి అఖిలేష్ యాదవ్ ప్రత్యర్థులను పెంచిందని చెప్పవచ్చు.

ఆజంఖాన్ గైర్హాజర్ కారణంగా నష్టం కలగకుండా చూసే బాధ్యతను ఎస్పీ నాయకత్వం సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్‌కు అప్పగించింది. ఆజం కోపంగా లేరని, ముఖ్యమంత్రితో పాటు ఆయన కనిపిస్తారని, ఆజం ఖాన్‌ గైర్హాజరీపై ఎక్కువగా ఊహించుకోవద్దని రామ్ గోపాల్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్‌ను నియమించడంపై మొదటి నుంచి ఆజం ఖాన్ అసంతృప్తితోనే ఉన్నారు.

English summary
As the Samajwadi Party national executive met here on Wednesday in the backdrop of the bloodiest riots in Uttar Pradesh in over two decades, eyebrows were raised when senior leader and minister Azam Khan, the party's most prominent Muslim face, gave it a miss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X