వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార ‘సైంధవ’పాత్ర: కన్నడ నేలపై కమలానికే సపోర్ట్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశమంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతుంటే మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమని జేడీ (ఎస్) కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి సంకేతాలిచ్చారు.
ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీకే మద్దతునిస్తామని పేర్కొన్నారు. వారం క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక సీనియర్ మంత్రితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాంకేతిక లోపాలతో రెండోసారి ఓటేసేందుకు అనుమతించడంపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని దేవెగౌడ వ్యంగ్యం

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని దేవెగౌడ వ్యంగ్యం

తాను బీజేపీతో కలిసి పని చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని సీఎం సిద్దరామయ్యను కుమారస్వామి హెచ్చరించారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. బీజేపీకి బీ టీంగా జనతాదళ్ (ఎస్) మారిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ వ్యంగ్యాస్త్రం సంధించారు. ముందు తమకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుందో చెబితే, తామెన్ని సీట్లు ఇస్తామో తర్వాత చెబుతామనడంతోనే దేవెగౌడ మనోగతం అర్థమవుతూనే ఉంది.

కింగ్ మేకర్ పాత్ర కోసం కుమారస్వామి ఇలా తహతహ

కింగ్ మేకర్ పాత్ర కోసం కుమారస్వామి ఇలా తహతహ

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జేడీఎస్ చేసిన అభ్యర్థనను సీఎం సిద్దరామయ్య వెటకారం చేయడం మాజీ సీఎం కుమారస్వామి ఆగ్రహానికి కారణమైంది. తనకు, తన జేడీఎస్‌కు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పాత్ర లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు ఉన్నదని కుమారస్వామి మండిపడ్డారు. ఒకవేళ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ తహతహలాడుతోంది.

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరిన కుమారస్వామి

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరిన కుమారస్వామి

ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీతో గానీ, బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని జేడీఎస్ సంకేతాలిచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బీఎం ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, అందుకు ప్రతిగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతునిస్తామని ప్రతిపాదించామని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి గుర్తు చేశారు. గతేడాది జరిగిన గుండ్లుపేట, నంజన్‌గుడ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ, 2015లో బీబీఎంపీ కౌన్సిల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.

రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కుమారస్వామి

రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కుమారస్వామి

అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే 2018 ఎన్నికల ఫలితాల తర్వాత జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయాల్సి ఉంటుందని అన్నారు. బీజేపీకి జేడీఎస్ బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నదన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే.. జేడీఎస్‌కు బీ టీం అని ఎద్దేవా చేశారు. సిద్దరామయ్య పూర్వాశ్రమంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు.

2006 - 08 మధ్య బీజేపీతో కలిసి 20:20 నిష్పత్తిలో పొత్తు

2006 - 08 మధ్య బీజేపీతో కలిసి 20:20 నిష్పత్తిలో పొత్తు

2004 నుంచి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కానీ 2006లో కాంగ్రెస్ పార్టీతో స్నేహానికి చెల్లుచీటి ఇచ్చింది జేడీఎస్. బీజేపీతో కలిసి 20:20 నిష్పత్తి ప్రకారం అధికారం పంచుకునేందుకు సిద్ధమైంది. తొలుత 20 నెలల పాటు జేడీఎస్ అధికారాన్ని అనుభవించింది. తర్వాత బీఎస్ యెడ్యూరప్ప సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు కుమారస్వామి నిరాకరించడంతో కొద్దికాలం రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి 2008 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి.

ఏడు రాష్ట్రాల నుంచి 280 మంది బీజేపీ నేతల ప్రచారం

ఏడు రాష్ట్రాల నుంచి 280 మంది బీజేపీ నేతల ప్రచారం

గతేడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, చివరిలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే వచ్చేనెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుసరించాలని కమలనాథులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గెలుపొందడానికి ఏడు రాష్ట్రాల నుంచి సుమారు 280 మంది సీనియర్, చురుకైన నేతలను ప్రచార బరిలోకి దించింది బీజేపీ. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అసెంబ్లీ స్థానంలో ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తారు. అలాగే పోలింగ్ బూత్ కమిటీల పనితీరును ఆరుగురు సభ్యుల టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది.

వచ్చేనెల 10 లోగా ఓటర్ల మనోగతంపై నివేదికకు అమిత్ షా ఆదేశం

వచ్చేనెల 10 లోగా ఓటర్ల మనోగతంపై నివేదికకు అమిత్ షా ఆదేశం

మహారాష్ట్ర నుంచి 25 శాతం మంది నాయకులు రంగంలోకి దిగితే.. గోవా, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నేతలు కూడా కన్నడ నేలపై బీజేపీ ప్రచార బరిలో భాగస్వాములయ్యారు. అంతటితో ఆగలేదు కమలనాథుల వ్యూహం. వచ్చేనెల 10 నాటికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు ప్రతి ఓటరుకు సంబంధించిన సమాచారంపై సవివరమైన నివేదిక తనకు సమర్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ పునాది పెంపుపైనే బీజేపీ ఫోకస్

పార్టీ పునాది పెంపుపైనే బీజేపీ ఫోకస్

కొల్హాపూర్ జిల్లా పరిషత్ సభ్యుడు ప్రసాద్ ఖొబారె మాట్లాడుతూ తన టీం హవేరీ జిల్లాలోని హనగల్ అసెంబ్లీ స్థాన పరిధిలో 60 శాతం ఓటర్ల వివరాలను సేకరించిందని తెలిపారు. తాను బూత్ స్థాయి కమిటీల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఇంటింటి పరిస్థితిపై సమాచారం సేకరించామన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో ప్రముఖుల ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. సామాన్యులతో అనుబంధం పెంచుకునేందుకు... తద్వారా తమ పార్టీ పునాది బలోపేతం చేసేందుకు పని చేస్తున్నట్లు ఖొబారె తెలిపారు.

English summary
BENGALURU: A thoroughly miffed H D Kumaraswamy, state president of the JD(S), dropped broad hints that his party could join hands with the BJP to oust the ruling Congress in the event of a hung assembly. The former chief minister’s comments came after two Congress MLAs — including a senior minister — were allowed to vote for a second time after they committed technical errors in their first ballot papers during the Rajya Sabha elections at the Vidhana Soudha in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X