వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిర్చి మంటలు: బీజేపీ సెల్ఫ్ గోల్, పవన్ సహా దాడి

రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే కేవలం క్వింటాల్ మిర్చి ధర రూ.5000గా నిర్ణయించడం వల్ల అన్నదాతకు ఎలా గిట్టుబాటవుతుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: మిర్చి రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) కింద కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసన వ్యక్తమవుతున్నది. రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే కేవలం క్వింటాల్ మిర్చి ధర రూ.5000గా నిర్ణయించడం వల్ల అన్నదాతకు ఎలా గిట్టుబాటవుతుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కేవలం మొక్కుబడిగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ మార్కెట్ యార్డుల్లో మేలురకం మిర్చి ధర రూ.6,500 నుంచి రూ.7000 వరకు పలుకుతోంది.
మామూలు రకం మిర్చికి రూ.3,500 వరకు ధర లభిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ రూ.1,500తో కలిపి రూ.5000కి లభిస్తుంటే.. కేంద్ర మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీం అమలు సాధ్యమయ్యేదెలా? అని ప్రశ్నిస్తున్నారు.

మార్కెట్ సెలవుల్లో ఇంటర్వెన్షన్ స్కీం అమలంటే ఎలా

మార్కెట్ సెలవుల్లో ఇంటర్వెన్షన్ స్కీం అమలంటే ఎలా

క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా అవగాహన ఉన్నదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకారం ఈ నెలాఖరు వరకు మాత్రమే కొనుగోళ్లు చేయాలి. కానీ ఈ నెల ఆరో తేదీ నుంచి మార్కెట్లకు వేసవి సెలవులు అమలు చేస్తే ఈ స్కీం అమలు సంగతేమిటన్న ప్రశ్న ఉదయిస్తున్నది. ఇక తెలంగాణలోని వరంగల్ - ఎనుమాముల మార్కెట్ యార్డులో ఇంకా కేంద్రం గైడ్ లైన్స్ జీవో తమకు అందలేదని అప్పటివరకు సాధారణంగానే కొనుగోళ్లు జరుపుతామని మార్కెట్ యార్డు అధికారులు అంటున్నారు.

కోల్డ్ స్టోరేజీలు లేక తెగనమ్ముకోవాల్సిందేనా?

కోల్డ్ స్టోరేజీలు లేక తెగనమ్ముకోవాల్సిందేనా?

ఇదిలా ఉంటే మిర్చి రైతు కడుపు రగిలిపోతోంది. ఏ రైతును కదిలించినా ఒకటే ఆవేదన.. సాయం చేస్తుందనుకున్న సర్కారే.. వ్యాపారులను మించిన లెక్కలు వేస్తోంది. నిల్వ చేసేందుకు కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో లేక అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిర్చి యార్డులో ఖాళీ లేక, ఆరుబయట నిల్వ ఉంచితే అకాల వర్ష భయం అన్నదాత గుండెను తొలిచేస్తోంది.

 చుక్కలు చూపిస్తున్న మార్కెటింగ్ పాలక వర్గం

చుక్కలు చూపిస్తున్న మార్కెటింగ్ పాలక వర్గం

సరుకును ఇంట్లో ఉంచుకోలేక, మార్కెట్‌ యార్డుకు తెచ్చి వ్యాపారులు అడిగిన ధరకు అమ్మలేక మిర్చి రైతులు అయోమయంతో తల్లడిల్లిపోతున్నారు. మిర్చిని ఇంట్లో ఉంచితే వేడికి రంగు మారుతుందని, కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసి పోతుందనే బెంగ వారిని పట్టిపీడిస్తోంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు మార్కెట్‌ యార్డుకు సరుకు తీసుకొస్తే.. వ్యాపారులు, మార్కెటింగ్‌ పాలక వర్గం చుక్కలు చూపుతోంది. సరుకు అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘కాయలు పాడైపోతున్నాయయ్యా.. ఇంట్లో ఉంచితే రంగు మారుతున్నాయి.. కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసిపోతాయి.. తేజ మేలు రకం కాయలు మొదటి కోతయ్యా.. ఇంతకు మునుపు క్వింటాలు రూ.6000 కు అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వ బోనస్‌ వస్తుందని ఇక్కడకు తెస్తే, ఇక్కడ క్వింటా రూ.3500 - 4000కు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

సరుకు నిల్వ ఉన్నదని సాకు చూపుతున్న వ్యాపారులు

సరుకు నిల్వ ఉన్నదని సాకు చూపుతున్న వ్యాపారులు

రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న రైతుకు 20 క్వింటాలు, క్వింటాకు రూ.1500 బోనస్‌ ప«థకమే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.5000 గురించి ఆలోచించడం లేదు. సరుకు నిల్వ అధికంగా ఉందనే సాకు చూపి వ్యాపారులు ధరలు పడిపోయేలా చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామ మాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటోంది. కొన్న సరుకును ఇక్కడే ఉంచి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు వ్యాపారులు, మార్కెటింగ్‌ సిబ్బంది కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో శుక్రవారం వచ్చిన 3.5 లక్షల టిక్కీలు, బయట 3.5 లక్షల టిక్కీలు.. మొత్తం 7 లక్షల టిక్కీల సరుకు ఉన్నట్లు సమాచారం. యార్డు మిర్చి బస్తాలతో నిండిపోయింది. సోమవారం మళ్లీ సరుకు అదనంగా వస్తే తిప్పలు తప్పవు.

రైతులను బెదిరిస్తున్న వ్యాపారులు

రైతులను బెదిరిస్తున్న వ్యాపారులు

‘రాయితీ పథకం కింద వద్దు.. మామూలుగా సరుకు అమ్ముకొని పోవాలని, లేదంటే రెండు నెలల వరకు డబ్బులు రావు' అని వ్యాపారులు చెబుతున్నారు. ‘తేజ' రెండో కోత కాయలు క్వింటాలు రూ.3000కు కూడా అడగటం లేదని, ఇలాగైతే తమ పరిస్థితేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించకముందు క్వింటాల్ పై రూ.4000 - రూ.5000 పలికిన మిర్చి ఇప్పడు రూ.1500 - 2000కు కూడా అడగటం లేదని, తమ పరిస్థితి దారుణంగా మారిందని, ఆదుకునే నాథుడే లేరని, కోత కూలీల మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులూ వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?

రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా?

కనీస మద్దతు ధర ప్రకటించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎగతాళిగా, ఆషామాషీగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఎంత మందికి, ఎన్ని క్వింటాళ్లకు రూ.1500 బోనస్ పథకం అమలు చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన సీలింగ్ వల్ల రైతులకు లభించే ప్రయోజనమేమిటని నిలదీశారు. ధర తగ్గిపోతుందేమోనన్న భయంతో రైతులు ఆగమేఘాలపై మిర్చి యార్డులకు 10 లక్షల క్వింటాళ్లు తరలించారని, వారి పరిస్థితి ఏమిటని ఉమ్మారెడ్డి నిలదీశారు. మిర్చి రైతులు ఆందోళనతో సతమతం అవుతుంటూ మంత్రులు విదేశీ పర్యటనలా? అని ప్రశ్నించారు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించారన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు.

నచ్చజెప్పాలే గానీ రాజకీయం చేయొద్దు

నచ్చజెప్పాలే గానీ రాజకీయం చేయొద్దు

సమస్యల్లో చిక్కుకున్న రైతులకు నచ్చచెప్పాలే గానీ రాజకీయం చేయొద్దని, రైతులను రెచ్చగొట్టొద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారికి మద్దతుగా నిలబడాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన గైడ్ లైన్స్ వల్ల ప్రయోజనం లేదని తేల్చేశారు. కనీస మద్దతు ధర రూ.8000 ప్రకటిస్తే మెరుగ్గా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలు ఉన్న మాట నిజమేనని, వాటిని సర్దుబాటు చేసుకుని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలపై కిషన్ రెడ్డి ఇలా

రాష్ట్ర ప్రభుత్వాలపై కిషన్ రెడ్డి ఇలా

అసలే రైతులు తమకు గిట్టుబాటు ధర రాలేదని మార్కెట్ యార్డుల వద్ద ఆందోళన చెందుతుంటే పుండుపై కారం రాసిన చందంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవని తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం మొక్కుబడిగా రూ.5000 సీలింగ్‌తో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించిందని రెండు రాష్ట్రాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తుంటే.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించడానికి వెళ్లిన కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి తరుణంలో విపక్షాల పట్ల ప్రభుత్వ తీరును ప్రశ్నించడానికి బదులు రైతు కోసం సీఎం కేసీఆర్ ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు.

రాజకీయ విమర్శలు సరే.. కేంద్రం సంగతేమిటి?

రాజకీయ విమర్శలు సరే.. కేంద్రం సంగతేమిటి?

ఇటువంటప్పుడు అందరికీ పెద్దన్న వంటి కేంద్ర ప్రభుత్వం మొక్కుబడిగా ప్రకటన చేసిందన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారో కిషన్ రెడ్డి చెప్పగలరా? అని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అవేవీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ విమర్శలతో కాలం గడుపాలని భావిస్తే ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయని చెప్తున్నారు. అందునా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రెండు రాష్ట్రాల్లోనూ బలపడాలని తలపోస్తున్న తరుణమని గుర్తు చేస్తున్నారు.

మరోసారి మద్దతు ధర పెంచాలన్న హరీశ్

మరోసారి మద్దతు ధర పెంచాలన్న హరీశ్

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతునిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కేంద్రం వివక్షను ప్రదర్శించారు. తెలంగాణలోనూ ఏపీతో సమానంగా మిర్చి కొనుగోళ్లు జరుపాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు మరోసారి కనీస మద్దతు ధరను మరింత పెంచాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు.

English summary
Two Telugu State governments has feels that union government has unilatteral in market intervention shceeme while first class mirchi already Rs.6500 - 7500.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X