వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 సమరం: ప్రాంతీయ పార్టీలే కీలకం.. ఇది పక్కా !!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉండబోతున్నాయా? 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత క్రమంగా దేశమంతటా విస్తరించిన కమలనాథుల దూకుడుకు.. ప్రధాని నరేంద్రమోదీ హవాకు అడ్డుకట్ట పడనున్నదా? నాలుగేళ్లుగా విడివిడిగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు మోదీ సర్కార్‌కు కలిసికట్టుగా సెగ పెడుతాయా? దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, పునరేకీకృతమవుతున్న ప్రాంతీయ పార్టీలు, ముందుకొస్తున్న కొత్త కూటమి ఏర్పాటు ప్రయత్నాలు కలిసి వస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎన్డీయే కూటమికి రోజురోజుకు దూరమవుతున్న భాగస్వామ్యపక్షాలు, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో బీజేపీకి కలవరం కలిగించిన పరిణామాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎన్డీయే భవిష్యత్ అగమ్యగోచరం కానున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పార్లమెంటు సీట్లు మాత్రమే గల త్రిపురలో సాధించిన విజయాన్ని గొప్పగా చెప్పుకొని, తమ అప్రతిహత యాత్రలో ఇదొక భాగమని భావించిన బీజేపీకి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో ఎస్పీ-బీఎస్పీ ప్రయోగాత్మక ఐక్యత కోలుకోలేని షాక్ ఇచ్చింది.

 త్రిపుర సంబురాలను తుడిచిపెట్టేసిన ఎస్పీ - బీఎస్పీ ఐక్యత

త్రిపుర సంబురాలను తుడిచిపెట్టేసిన ఎస్పీ - బీఎస్పీ ఐక్యత

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. దానికితోడు బీహార్‌లోని అవారియా లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్జేడీ గెలుపు బీజేపీకి మింగుడు పడటంలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా త్రిపురలో గెలుపు తెచ్చిన సంబురాన్ని గోరఖ్ పూర్ ప్లస్ మరో రెండు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తుడిచిపెట్టేశాయి.

కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరుల మద్దతు

కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరుల మద్దతు

మరోవైపు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయిలో బలమైన ప్రజాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, అందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ వంటి ముఖ్యనేతలు మద్దతు పలుకడంతో జాతీయ రాజకీయాల్లో కీలకమైన మలుపు మొదలైందని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ అభివృద్ధి తీరుతెన్నులను వివిధ రాష్ర్టాలకు, కేంద్ర ప్రభుత్వానికి అధ్యయనాంశంగా మార్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ తరహా ప్రయోగాన్ని జాతీయ స్థాయిలో చేసేందుకు సిద్ధపడుతుండటంతో రాజకీయ చర్చ మొదలైంది.

అవిశ్వాసంతో షాక్ ఇచ్చిన టీడీపీ

అవిశ్వాసంతో షాక్ ఇచ్చిన టీడీపీ

మరోవైపు వరుసగా ఒకొక్క భాగస్వామ్య పక్షాన్ని కోల్పోతున్న ఎన్డీయేకు తాజాగా టీడీపీ షాక్ ఇచ్చింది. తాను ఎన్డీయే కూటమినుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం, ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, దానికి కాంగ్రెస్, వామపక్షాలతోపాటు మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌కాంగ్రెస్, ఇతర ఎన్డీయేయేతర పక్షాలు మద్దతు పలుకడంతో ఎన్డీయేకు బీటలు వారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 ఎస్పీ - బీఎస్పీ ఐక్యత ఫలిస్తే కూటమికి 57 ఖాయం?

ఎస్పీ - బీఎస్పీ ఐక్యత ఫలిస్తే కూటమికి 57 ఖాయం?

గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి తన మిత్రపక్షాలతో కలిపి 73 స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. కానీ.. గోరఖ్‌ఫూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి దిగ్భ్రాంతి కల్గించాయి. ఎస్పీ-బీఎస్పీ ఐక్యతాప్రయోగం ఇక్కడ సత్ఫలితాన్నిచ్చింది. ఇదే పరంపర కొనసాగితే ఈ రెండు పార్టీలు యూపీలో 57 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఇక్కట్లు ఈ రాష్ట్రంతోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీపై 2015లో మహా కూటమి విజయం

బీజేపీపై 2015లో మహా కూటమి విజయం

ఇక బీహార్‌లో లాలూ తనయుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.. అధికార జేడీయూ బీజేపీ కూటమిని గట్టిగా ఢీకొట్టి అరారియా లోక్‌సభ స్థానంతోపాటు మరో అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి పని చేసిన మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఈ ఉప ఎన్నికల్లో ఆర్జేడీకి మద్దతు పలికారు. ఇది కూడా రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది.

టీడీపీ దూరం బీజేపీకి షాక్ వంటిదే

టీడీపీ దూరం బీజేపీకి షాక్ వంటిదే

మరోవైపు 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మహారాష్ట్రలో ఎన్డీయే మిత్రపక్షం శివసేన ప్రకటించింది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారానికి దూరమైన అకాలీదళ్.. బీజేపీతో అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నదన్నది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉన్నది. జమ్ముకశ్మీర్‌లోని పీడీపీ, బీజేపీ ప్రతి అంశంలోనూ పరస్పరం విభేదిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా బీజేపీకి దూరం కావడం ఆ కూటమికి కోలుకోలేని దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ అవిశ్వాసానికి ఎన్డీయేతర పక్షాల మద్దతు

టీడీపీ అవిశ్వాసానికి ఎన్డీయేతర పక్షాల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించనందుకు అసంతృప్తితో శుక్రవారం అధికార ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతకుముందు ఢిల్లీలోని ఎంపీలు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో అత్యధికులు విడిపోవాలని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతికి తెలియజేయాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేత తోట నరసింహం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గురువారం వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు ప్రకటించింది. ఏపీలో అధికార, విపక్షాలుగా ఉన్న టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించాయి.

ఏపీకి న్యాయం జరుగాల్సి ఉన్నదన్న మల్లిఖార్జున ఖర్గే

ఏపీకి న్యాయం జరుగాల్సి ఉన్నదన్న మల్లిఖార్జున ఖర్గే

టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కానీ దీనిపై టీడీపీ, వైసీపీ రాజకీయం చేయొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగాల్సి ఉన్నదని చెప్పారు. సభ ఆర్డర్‌లో లేకుండా అవిశ్వాస తీర్మానాలను చేపట్టలేనన్న స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.

 మోదీ సర్కార్‌కు ఇది తొలి అవిశ్వాస పరీక్ష

మోదీ సర్కార్‌కు ఇది తొలి అవిశ్వాస పరీక్ష

ఏపీలో అధికార టీడీపీ రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షం బీహార్ సీఎం నితీశ్ కుమార్ (జేడీయూ) కూడా తమకూ ప్రత్యేక హోదా కల్పించాలని ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఒక పార్టీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుండటం ఇదే తొలిసారి.

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఉద్యమించాలి

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఉద్యమించాలి

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించనందుకు ఎన్డీయే నుంచి వైదొలుగాలని టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ స్వాగతించారు. రాజకీయ అస్థిరత, అకృత్యాలకు, ఆర్థిక విపత్తులకు వ్యతిరేకంగా విపక్షాలు ఉమ్మడిగా కలిసి పని చేయాల్సి ఉంది అని మమత పేర్కొన్నారు. మంచి సమస్య కోసం ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీ పని చేస్తున్నదని చెప్పారు.

టీడీపీకి బాసటగా నిలుస్తామన్న సీపీఐ

టీడీపీకి బాసటగా నిలుస్తామన్న సీపీఐ

మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏపీ రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటు సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ చేసిన విధాన ప్రకటన అమలు చేసేందుకు నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. నాడు యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందే తప్ప, కాంగ్రెస్ పార్టీ కాదన్నారు.

టీడీపీకి అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ఇలా

టీడీపీకి అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ఇలా

ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం క్షమార్హం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం వారిని మోసగించడమేనన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ పలు కారణాలతో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు గానీ, ఏపీకి ప్రత్యేక హోదా గానీ అమలు చేయలేదని ఆరోపించారు.

అవిశ్వాసం వీగిపోయినా ఏపీలో దోషిగా బీజేపీ

అవిశ్వాసం వీగిపోయినా ఏపీలో దోషిగా బీజేపీ

కానీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాలపై అధికార బీజేపీ ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. ప్రధాని మోదీ పట్ల లోక్‌సభకు పూర్తి విశ్వాసం ఉన్నదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. 536 స్థానాలు గల లోక్‌సభలో బీజేపీకి సొంతంగా 274 మంది సభ్యుల బలం ఉన్నది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ దోషిగా నిలబడే పరిస్థితి నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న సీఎం రమేశ్

బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న సీఎం రమేశ్

మావి సూత్రబద్ధ రాజకీయాలు. ఎన్డీయేలో మిత్రపక్షంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనైతికం అని మా అధినేత చంద్రబాబు భావించారు. మేం ఎన్డీయే నుంచి వైదొలిగినట్లు ప్రకటించగానే ఉదయం 9.30 గంటలకు స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు అవిశ్వాస తీర్మానం అందజేశా అని మీడియాతో టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నరసింహం చెప్పారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మాట్లాడుతూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

 శరద్ పవార్ తదితరులతో తల్లీ కొడుకుల సంప్రదింపులు

శరద్ పవార్ తదితరులతో తల్లీ కొడుకుల సంప్రదింపులు

మరోవైపు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీయేతర పార్టీలతో చర్చలు వేగవంతం చేశారు. ఇక ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ పట్ల ప్రజల వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నదనే అభిప్రాయాలున్నాయి. దాదాపు రెం డు దశాబ్దాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కార్ మునుగుతున్న నావ అనడం పరిస్థితుల్లో మార్పును తెలియజేస్తున్నది.

 ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కీలకం

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కీలకం

ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిరంతరం ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రత్యేకించి 2014 మే తర్వాత రాజస్థాన్ లో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాటలో పయనిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ఆరు రోజుల పాటు 50 వేల మంది రైతులు నిర్వహించిన మహా పాదయాత్ర.. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హడలెత్తించింది. 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు.. ఇక ప్రతి దానికీ ఆధార్ అనుసంధానం చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమన్న కేశవరావు

అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమన్న కేశవరావు

కేంద్రంపై వివిధ పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపైఎలా స్పందించాలన్న అంశంపై టీఆర్‌ఎస్ ఇంకా నిర్ణ యం తీసుకోలేదని తెలుస్తున్నది. ఇటీవల జరిగిన పార్లమెంటరీపార్టీ సమావేశంలో దీనిపై చర్చించలేదు. తాజాగా కేంద్రంపై కొన్ని పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ బీ వినోద్‌కుమార్ స్పందిస్తూ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు.

English summary
If the beginning of March had the BJP triumphantly declaring the death of the Left, mid-March has the BJP’s opponents happy that nothing much needs to be done except smart coalitions. In reality, the famous Shakespearean dictum, “Beware, the ides of March”, should alert both the BJP and its opponents to the dangers of over-reading signals from either Tripura or Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X