వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కింగ్‌మేకర్ ‘బాబు’ పలుకుబడి తగ్గిందా?: కేంద్రంలో సుజనా చౌదరి పట్టు సాధించారా?

కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలుకుబడి తగ్గిందా? అన్న సందేహాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థ మార్పిడిపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాయబారం చేపట్టడమే దీనికి నిదర్శనం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కింగ్ మేకర్ పాత్ర పోషించారన్న ప్రచారం సాగింది. 1996 - 98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలోనూ, 1998 - 2004 మధ్య కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Recommended Video

జగన్‌ను టార్గెట్ చేయాలని బాబు ఆర్డర్స్ | Oneindia Telugu

కానీ 2004లో ఓటమి తర్వాత కేంద్రంలో ఆయన పలుకుబడి క్రమంగా తగ్గుముఖం పట్టిందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ 2014లో కేంద్రంలో బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

 ఎన్నికల కోసమే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా వ్యూహం?

ఎన్నికల కోసమే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా వ్యూహం?

2009 - 14 మధ్య ‘తెలంగాణ' ఏర్పాటు విషయమై గానీ, 2014 తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా.. ఏపీ ప్రయోజనాలే ప్రామాణికంగా ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల విలీనంలో గానీ.. తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో కుట్రదారుగా నిజానిజాలు బయటకు రావడంతో కేంద్రంలోని మోదీ సర్కార్ ఆయనను తేలిగ్గా కొట్టి పారేస్తున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర ప్రదాయినిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మూడున్నరేళ్ల పాటు ప్రేక్షక పాత్ర పోషించి.. తాజాగా కాపర్ డ్యామ్ నిర్మాణం ద్వారా గ్రావిటీపై సాగు నీరు సరఫరా చేయాలని సంకల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు.

 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ససేమిరా

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ససేమిరా

అందుకోసం ప్రస్తుతం పోలవరం కాంట్రాక్టు సంస్థ, నరసరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్ టాయ్ పక్కకు తప్పించి ఇతర సంస్థలకు కాంట్రాక్టు అప్పగించాలని ఆయన తలపెట్టారు. అందుకోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పదేపదే సంప్రదింపులు జరిపారు. కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందుకు నిరాకరించారు. ఐదేళ్ల క్రితం నాటి అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నర్సరావు పేట ఎంపీ, టీడీపీ నాయకుడు రాయపాటి సాంబశివరావునే కేంద్రం వెనకేసుకు వస్తున్నది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మనస్సు మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు. మహారాష్ట్రలోని ఆయన సొంతూరు నాగ్‌పూర్ పట్టణానికి కూడా వెళ్లారు. నితిన్ గడ్కరీతో సంప్రదించాకే చంద్రబాబు తన విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

 వ్యతిరేకించే అంశాలను తిప్పికొట్టేందుకు శత విధాల ప్రయత్నాలు?

వ్యతిరేకించే అంశాలను తిప్పికొట్టేందుకు శత విధాల ప్రయత్నాలు?

చంద్రబాబు నాయుడు విషయంలో ఒక సంగతి గుర్తుకు వస్తున్నది. తనకు ఇష్టం లేని పనైతే.. దాన్ని చివరి క్షణం వరకు అడ్డుకునేందుకు ప్రయత్నించారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో రుజువైంది. 2013లో తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, అధికార యునైటెడ్ ఫ్రంట్ కూటమి తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీతోపాటు ఇతర విపక్ష పార్టీల నాయకులందరినీ కలుసుకున్నారు. ప్రస్తుత ప్రధాని, నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని పదేపదే కలుసుకునేందుకు వెనుకాడలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తదితరుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

 పోలవరంపై అధికారులనే తప్పుబట్టిన బాబు

పోలవరంపై అధికారులనే తప్పుబట్టిన బాబు

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దన్నుతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు పాలనా ప్రక్రియలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారే గానీ.. ప్రజాకాంక్షలకు అనుగుణంగా సాగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తొలి దశలో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు భేష్షుగ్గా పని చేస్తున్నారని అధికారులు, ఇంజినీరింగ్ అధికారులనే మందలించిన చంద్రబాబు సొంత పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావును వెనుకేసుకు వచ్చారు. కానీ మరో ఏడాదిన్నరలో జరిగే ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా మళ్లీ వ్యూహాలు రూపొందిస్తున్నారు చంద్రబాబు నాయుడు.

 ఇలా నితిన్ గడ్కరీతో రాయపాటి సాంబశివరావు స్నేహం

ఇలా నితిన్ గడ్కరీతో రాయపాటి సాంబశివరావు స్నేహం

అందుకే ఇప్పుడు తాజాగా కాపర్ డ్యామ్ వ్యూహాన్ని ముందుకు తెచ్చి క్రుష్ణా డెల్టాతోపాటు గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను ఊహల్లోకి నెట్టి మళ్లీ విజయం సాధించాలని ఆశిస్తున్నారు. కానీ ఆయన వ్యూహాలన్నీ తెలిసిన కేంద్రం పట్టించుకోవడం లేదు. పాత అంచనాలకు మించి వ్యయం భరించాలంటే రాష్ట్రానిదే బాధ్యత అని కుండ బద్దలు కొట్టేసింది కేంద్రం. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు పలుసార్లు మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై స్నేహం పెంచుకున్నారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు తన సంస్థకే కొనసాగించేలా చూసుకున్నారు.

 సుజనా చౌదరితో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాయబారం

సుజనా చౌదరితో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాయబారం


కానీ చంద్రబాబు వ్యూహ రచనలో ఇతరులెవ్వరూ సాటి రారన్న నానుడి ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడి కోల్పోయానని గుర్తించిన చంద్రబాబు ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి రంగంలోకి తీసుకొచ్చారు. 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ‘హస్తిన'లో కేంద్ర మంత్రిగా సుజనా చౌదరి కీలకమైన అంశాల్లో పావులు కదుపుతూ వచ్చారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి సుజనా చౌదరి.. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

 వారంలో కేంద్, రాష్ట్ర ప్రభుత్వాధికారులతో భేటీకి ఆదేశాలు

వారంలో కేంద్, రాష్ట్ర ప్రభుత్వాధికారులతో భేటీకి ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థను మార్చాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి కారణాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సుజనా చౌదరి సవివరంగా వివరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతున్న వైనం.. పునరావాసం, సహాయ పథకాల అమలు, ఇతర ప్యాకేజీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులు తదితర వివరాలు సవివరంగా చెప్పారు. కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన సహచర మంత్రి సుజనా చౌదరి ఎలా నచ్చజెప్పారన్న విషయం మూడో కంటికి తెలియదు.కానీ వారం లోగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ జల వనరుల శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారని సుజనాచౌదరి మీడియాకు వివరించారు.

English summary
Telugu Desam Party president and Andhra Pradesh chief minister N Chandrababu Naidu, who had once steered the wheel in the Centre both during the UDF and NDA governments between 1996 and 2004, has now realised that he does not have any say in the Centre and nobody is taking him seriously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X