అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లో నిప్పు, నిజాయితీపరుడైతే ఓటుకు నోటు కేసు ఏంటీ? బాబుపై దగ్గుబాటీ వంగ్యాస్త్రాలు

ఓటుకు నోటు కేసు మాటేంటీ? ఈ కేసు తర్వాతే కదా హైద్రాబాద్ నుండి చంద్రబాబునాయుడు పారిపోయిందంటూ సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు చెప్పారు. రాజకీయాల్లో తన కంటే నిజాయితీపరుడు,

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటుకు నోటు కేసు మాటేంటీ? ఈ కేసు తర్వాతే కదా హైద్రాబాద్ నుండి చంద్రబాబునాయుడు పారిపోయిందంటూ సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు చెప్పారు. రాజకీయాల్లో తన కంటే నిజాయితీపరుడు, నిప్పు అని చెప్పుకొనే చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసు విషయమై ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

సాక్షిటీవిలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మనసులో మాట పేరుతో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయనాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుతో ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.టిడిపి ఏర్పాటుపై బాబు చేబుతున్న విషయాలను ఆయన ప్రస్తావించారు.

టిడిపి ఏర్పాటు తర్వాత ఏ రకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టి ఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఎవరెవరున్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తే బాబు ఏమన్నారనే విషయాలను ఆయన ప్రస్తావించారు.

అయితే రాజకీయాల్లో నీతి, నిజాయితీగా ఉన్నానని పేరుతో సంతృప్తిగా ఉన్నానని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు చెబుతున్నారు.అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నా సంతృప్తిగానే కొనసాగుతున్నట్టుగా ఆయన చెప్పారు.

ఓటుకు నోటు కేసుపై బాబు ఏం చెబుతారు?

ఓటుకు నోటు కేసుపై బాబు ఏం చెబుతారు?

రాజకీయాల్లో తాను నిజాయితీపరుడిగా చంద్రబాబునాయుడు చెప్పుకొంటారని అయితే ఓటుకు నోటు కేసు విషయమై ఆయన ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసు తర్వాతే ఆయన హైద్రాబాద్ ను వదిలి విజయవాడకు వెళ్ళారని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు గుర్తుచేశారు.రాజకీయాల్లో నీతి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హతపై బాబుకు మాట్లాడే అర్హత లేదన్నారు.

ఎన్ టి ఆర్ ను గద్దెదించడమే బాధ పెట్టింది

ఎన్ టి ఆర్ ను గద్దెదించడమే బాధ పెట్టింది

1995 లో పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ ను గద్దెదించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు చెప్పారు.అయితే ఎన్టీఆర్ ను పదవి నుండి దించేసిన తర్వాత ఎలా ఉన్నా తాను చేసిన ఈ పని సరికాదనే భావన ఇంకా వెంటాడుతూనే ఉందని దగ్గుబాటి చెప్పారు. ఎన్టీఆర్ ఓ ఉన్నతమైన శక్తి. జాతికి ప్రతీక, ఆయన ఎన్ని రకాలుగా ఆయన తప్పు చేసి ఉన్నా తనకు అవి ఇష్టం ఉన్నా లేకపోయినా, తాను అటువంటి దానిలో భాగస్వామ్యం కావడం అనేది తన జీవితంలో అసహ్యాకరమైన విషయంగా దగ్గుబాటి చెప్పారు.

ఎన్టీఆర్ కు పార్టీ పెట్టాలని ఏనాడూ సలహా ఇవ్వలేదు

ఎన్టీఆర్ కు పార్టీ పెట్టాలని ఏనాడూ సలహా ఇవ్వలేదు

ఎన్టీఆర్ ను పార్టీ పెట్టాలని తాను సలహా ఇచ్చానని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్దాలన్నారు బాబు. 1982 మార్చి 29న, హైద్రాబాద్ రామకృష్ణా స్టూడియోలో తాను పార్టీ పెడుతున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 11న, తొలి మహానాడును నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహానాడు పూర్తయ్యాకే తానే స్వయంగా చంద్రబాబును కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించాను.పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసుకోవాలని, మంచి భవిష్యత్ ఉంటుందని కోరాను.అయితే ఈ ప్రతిపాదనకు బాబు తిరస్కరించారని చెప్పారు.ఎన్టీఆర్ కు పార్టీ పెట్టాలని ఎవరన్నా చెప్పడమంటే అంతకంటే హాస్యస్పదమైన అంశం మరోటి ఉండదన్నారు దగ్గుబాటి.

పార్టీ నడిపేందుకు ఖర్చులు ఎక్కడినుండి వస్తాయన్న బాబు

పార్టీ నడిపేందుకు ఖర్చులు ఎక్కడినుండి వస్తాయన్న బాబు

పార్టీ పెట్టేంత ఇది ఉందా అని తనతో చంద్రబాబు అన్నారని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు గుర్తుచేసుకొన్నారు.ఎన్టీఆర్ డబ్బులు తీయరు. రామారావు ఖర్చు చేయరనే అభిప్రాయంతో చంద్రబాబునాయుడు ఉండేవారని దగ్గుబాటి గుర్తు చేసుకొన్నారు.తాను చంద్రబాబుతో ఈ విషయాలను ప్రస్తావించిన సమయంలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేం అనేది చంద్రబాబునాయుడు విశ్వాసమన్నారు దగ్గుబాటి.

లేటుగా పార్టీలోకి వచ్చి బాబు ఎలా దూసుకు పోయారంటే?

లేటుగా పార్టీలోకి వచ్చి బాబు ఎలా దూసుకు పోయారంటే?

చంద్రబాబునాయుడు పార్టీలోకి ఎలా వచ్చారో అందరికీ తెలుసునని చెప్పారు దగ్గుబాటి. కాంగ్రెైస్ పార్టీ ఓటమిపాలై అక్కడ ఉండలేక టీడీపీలో చేరిపోయాడని చెప్పారు. రాజకీయాల్లోకి మాది ఒకరకమైన ఎంట్రీ బాబుది మరోక రకమైన ఎంట్రీ. తనకు అప్పటికే అధికారం ఏమిటో తెలుసునని చెప్పారు. తామేమో వ్యవస్థను బాగు చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో భాగమై డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా రాజకీయాలు చేయవచ్చని నమ్మినవాళ్ళమన్నారు. కానీ, బాబుకు రాజకీయమే జీవనం. దాని కోసం ఏదైనా చేయగలడు. ఎలాంటి సాహసానికైనా పూనుకోగలడని చెప్పారు దగ్గుబాటి.

మహానాడు నిర్వహించడమంటే డబ్బు దండగే

మహానాడు నిర్వహించడమంటే డబ్బు దండగే

మహానాడు, మినీ మహానాడు అంటూ రకరకాలుగా సభలు పెట్టేవాడు చంద్రబాబునాయుడు. ప్రతి ఏడాది మహానాడు పెట్టడమంటేనే డబ్బు దండగ అనే అభిప్రాయంతో తాము ఉండేవారని దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు చెప్పారు. కాంగ్రెస్ లో ఓ సంస్కృతి ఉండేది. మీటింగ్ ల పేరుతో జనం మీద పడి డబ్బులు వసూలు చేసేవారన్నారు.1987 లో విజయవాడలో నిర్వహించిన మహానాడు కోసం వసూలు చేసిన చందాలను తన ముందున్న హుండీలో వేయాలని ఎన్టీఆర్ చెప్పారు. అందరూ హుండీలో వేశారు. అయితే మహానాడు ఖర్చులకు పోను 60 లక్షలు మిగిలాయన్నారు.అయితే అంతకుముందు నిర్వహించిన మహానాడు డబ్బులకు జమా, ఖర్చు లేదన్నారు. అయితే ఈ 60 లక్షలు పెట్టి గండిపేటలో పార్టీ ఆపీసును కొనుగోలు చేసినట్టు చెప్పారు.1989లో తాను మహానాడును హైద్రాబాద్ లో నిర్వహించి రూ.35 లక్షలను ఎన్టీఆర్ కు ఇచ్చానని చెప్పారు. మహానాడుకు తాను 15 లక్షలు ఖర్చుచేసినట్టు చెప్పారు.

అందరికీ ఒకే న్యాయం ఉండాలి

అందరికీ ఒకే న్యాయం ఉండాలి

లోకేష్ కు మంత్రిపదవి, ఎమ్మెల్సీ ఇవ్వడం స్వంత వ్యవహరంగా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ దగ్గర నుండి తాము తీసేసుకోవచ్చు. కానీ, మా దగ్గర నుండి ఇంకొకరు తీసేసుకోకూడదనే తరహాలో ఉందన్నా బాబు వ్యవహారశైలి ఉందన్నారు దగ్గుబాటి. ఎన్టీఆర్ పుత్రులకు పదవులు ఇవ్వడమనేది వారసత్వమైతే ,లోకేష్ కు పదవులు ఇవ్వడం కూడ అదే తరహా కిందకు వస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పోలవరంపై బాబుకు చిత్తశుద్ది లేదు

పోలవరంపై బాబుకు చిత్తశుద్ది లేదు

పోలవరానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఓ సమావేశం నిర్వహించారు. వడ్డే వీరభద్రరావు అనే టిడిపి ఎమ్మెల్యే ఆ సమావేశానికి హాజరయ్యారు. జలవనరుల శాఖ మంత్రి మధు దండావతే, ఎర్రన్నాయుడు ఇంకా ప్లానింగ్, ఫైనాన్స్ శాఖ కార్యదర్శులతో ప్రధానమంత్రి సమావేశం నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు, మార్పుల గురించి పంపాలని ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం నుండి స్పందన రాలేదని దగ్గుబాటి చెప్పారు.ఈ సమావేశం జరిగిన తర్వాత కూడ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాజకీయాలకు దూరమైనా సంతోషంగానే

రాజకీయాలకు దూరమైనా సంతోషంగానే

రాజకీయాలకు దూరంగా ఉండటం ఏదో గొప్ప అని తాను భావించడం లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ బాగానే అనిపించింది. లేనప్పుడూ కూడ బాగానే అనిపిస్తోందన్నారు దగ్గుబాటి. రాజకీయాల్లో నుండి సంతృప్తిగా ఏ మచ్చా లేకుండా అన్ని పనులు నిర్వహించి మంచి అనిపించుకొని బయటకు వచ్చానని చెప్పారు.

English summary
Former minister, senior politician Daggubati Venkateshwar Rao slams Andharapradesh chief minister Nara Chandrababu Naidu. Senior journalist Kommineni Srinivasa Rao interviewed Daggubati Venkateshwar Rao in Sakshi Tv.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X