వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాదల్: అచ్చం తెలుగుదేశం పార్టీ మాదిరే...

కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల పార్టీ అని దాని ప్రత్యర్థి బిజెపి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. దాని మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట చెప్తుంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల పార్టీ అని దాని ప్రత్యర్థి బిజెపి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. దాని మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట చెప్తుంది. కానీ తమదాకా వచ్చేసరికి మాట మార్చేస్తుంటాయి. స్వచ్ఛమైన పార్టీగా చెప్పుకునే బిజెపి తన సీనియర్ నేతల కుమారులు, కూతుళ్లు, బంధువులకు తప్పనిసరిగా టిక్కెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.

పంజాబ్ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి సంకీర్ణ భాగస్వామ్య పక్షం శిరోమణి అకాలీదళ్ పార్టీ (ఎస్ఎడి)లోనైతే దాదాపు నాలుగోవంతు ఒకే కుటుంబం వారే. అదే సీఎం, అకాలీదళ్ సీనియర్ ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబంలో ప్రముఖులే పోటీలో ఉన్నారంటే అతిశేయోక్తి కాదు.

ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగే ఎన్నికల్లో మొత్తం 94 స్థానాలకు అకాలీలు పోటీ చేస్తున్నారు. వారిలో 26 మంది బాదల్ కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో కంటే ఇద్దరు తక్కువ.

బాదల్ ఇది అంగీకరిస్తారు...

బాదల్ ఇది అంగీకరిస్తారు...

తమ వారసులకు చోటు కల్పించక తప్పదని, తప్పించలేమని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ అంగీకరిస్తారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రముఖుడు, సీఎం, తన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సంస్థాగతంచేయడం ద్వారా ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుఖ్ బీర్ ఈ వారసత్వ రాజకీయాల్లో ప్రధాన లబ్దిదారు అనడంలో సందేహం లేదు. నిజానికి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయ తీరాలకు చేరడానికి అత్యధిక స్థాయిలో అకాలీదళ్ నాయకత్వ స్థానంలోని కుటుంబ సభ్యులు విజయం సాధించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు.

రికార్డు స్థాయిలో 28 మంది బాదల్ కుటుంబ సభ్యులు పోటీచేసతే 15 మంది అసెంబ్లీలో అడుగు పెట్టడం కూడా శిరోమణి అకాలీదళ్ - బిజెపి సంకీర్ణ కూటమి తిరిగి రెండోసారి అధికారాన్ని చేపట్టడంలో కీలకంగా వ్యవహరించిందంటారు. ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో ప్రజలు ఒక కుటుంబం విశ్వాసం ఉంచుతారని, కానీ రాజకీయ నాయకులందరి కొడుకులు విజయవంతం కాలేరని సుఖ్ బీర్ సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ‘ఒకవేళ మీరు ఒక గుర్రాన్ని కొనుగోలుచేసేందుకు వెళితే దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటారు కదా' అని సుఖ్ బీర్ చమత్కరించారు.

అకాలీలో అల్లుళ్లదే హవా

అకాలీలో అల్లుళ్లదే హవా

పంజాబ్ రాజకీయాల్లో తన పలుకుబడి పెంచుకునేందుకు అందరినీ సంత్రుప్తి పరిచే విధానానికి సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రాధాన్యం ఇచ్చారు. బాదల్ కుటుంబంలో పలు అధికార కేంద్రాలు ఉన్నాయి. కేవలం కొడుకులే కాదు నలుగురు అల్లుళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారంటే అతిశేయోక్తి కాదు. మొహలీ నుంచి పోటీలో ఉన్న కెప్టెన్ తేజిందర్ పాల్ సిద్ధూ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు - ఎస్ఎడి ప్రముఖ నేత సుఖ్ దేవ్ సింగ్ ధిండ్సా అల్లుడు. భోలాథ్ ఎమ్మెల్యే బీబీ జాగీర్ కౌర్ కూడా తన వారసత్వాన్ని అల్లుడు యువరాజ్ భూపీందర్ సింగ్ కే అప్పగించాలని నిర్ణయించుకున్నారు. బాదల్ కుటుంబానికి బయటి నుంచి రాజకీయాల్లో క్రియాశీల పోషిస్తున్న జస్టిస్ నిర్మల్ సింగ్ (రిటైర్డ్) రెండోసారి చాంకౌర్
సాహిబ్ స్థానం నుంచి విజయానికి తహతహలాడుతున్నారు. ఒక హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ నిర్మల్ సింగ్.. అకాలీలో మాల్వా ప్రాంత ఎస్సీ నేత ధన్నా సింగ్ గుల్షాన్ అల్లుడు. ఫరీద్ కోట్ లోక్‍సభ ఎంపిగా జస్టిస్ సింగ్ భార్య పరంజిత్ కౌర్ గుల్షాన్ ప్రాతినిధ్యం వహించడంతోపాటు కేంద్రమంత్రిగానూ పనిచేశారు.

బాదల్ కుటుంబ సభ్యులు ఇలా..

బాదల్ కుటుంబ సభ్యులు ఇలా..

పట్టి స్థానం నుంచి రెండోసారి పోటీచేస్తున్న ఆదాయిష్ ప్రతాప్ సింగ్ ఖైరోన్.. సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అల్లుడు రాష్ట్ర మంత్రి కూడా. సుఖ్ బీర్ సింగ్ బాదల్ తండ్రికి డిప్యూటీగా వ్యవహరిస్తూ పార్టీ అధ్యక్షుడిగా సంస్థాగత వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. ఆయన సతీమణి హర్ సిమ్రత్ సింగ్ కేంద్రమంత్రిగా పనిచేస్తుండగా, సుఖ్ బీర్ బావ బిక్రం సింగ్ మాజిథియా కూడా రాష్ట్ర మంత్రే కావడం గమనార్హం. మరో క్యాబినెట్ మంత్రి జన్మీజా సింగ్ సెఖాన్ కూడా మౌర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాదల్ మరో బంధువు. సుల్తాన్ పూర్ లోధీ నుంచి చూస్తే డాక్టర్ ఉపిందర్ జిత్ కౌర్ మాజీ మంత్రి. అకాలీదళ్ నాయకుల కూతుళ్లలో 2007 - 12 మధ్య కాలంలో వెలుగొందారు. ఆమె తండ్రి ఆత్మాసింగ్ కూడా ప్రముఖ అకాలీ నేతే.

తనయులు ఇలా..

తనయులు ఇలా..

ధరంకోట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తోతా సింగ్.. మోగా నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బార్జిందర్ సింగ్ బ్రార్ కుమారుడు.

ఆనంద్ పూర్ సాహిబ్ ఎంపీ తనయుడు..

ఆనంద్ పూర్ సాహిబ్ ఎంపీ తనయుడు..

బాదల్ కుటుంబానికి అత్యంత విధేయుడు, లోక్ సభ సభ్యుడు రంజిత్ సింగ్ దత్తపుత్రుడు రవిందర్ సింగ్ బ్రహ్ముంపురా కూడా ఖాదూర్ సాహిబ్ ఎమ్మెల్యే. ఆనందపూర్ సాహిబ్ ఎంపి ప్రేమ్ సింగ్ చంద్ మర్జా తనయుడు హరిందర్ పాల్ సింగ్ ఈ దఫా సానౌర్ స్థానం నుంచి తన అద్రుష్టాన్ని పరీక్షిస్తున్నారు. బాదల్ కుటుంబానికి ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు బల్విందర్ సింగ్ భుందర్ తన కుమారుడు దిల్రాజ్ సింగ్ భుందర్ కోసం సార్దులాగఢ్ స్థానం నుంచి టిక్కెట్ పొందారు.

కొడుకు కోసం త్యాగం

కొడుకు కోసం త్యాగం

ప్రస్తుతం రద్దు కానున్న అసెంబ్లీ స్పీకర్ చరణ్ జిత్ సింగ్ అత్వాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాయికోట్ అసెంబ్లీ స్థానంలో పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు ఇందర్ పాల్ ఇక్బాల్ సింగ్ అత్వాల్‌కు అవకాశం కల్పించారు.

లెహ్రా నుంచి అతను..

లెహ్రా నుంచి అతను..

పాతతరం అకాలీ నేత ఎస్ఎస్ ధిండ్సా తన కొడుకు, ఆర్థిక మంత్రి పర్మిందర్ సింగ్ ధిండ్సాకు సురక్షితమైన సీటు లెహ్రా అసెంబ్లీ స్థానాన్ని పొందారు.మిలిటెంట్ల చేతిలో కాల్చివేతకు గురైన సీనియర్ అకాలీ నేత సేవాసింగ్ సెఖ్వాన్ స్థానే రాజకీయాల్లో ప్రవేశించిన గుల్జార్ సింగ్ రానికే (అట్టారీ) బాదల్ క్యాబినెట్‌లో మరో క్యాబినెట్ మంత్రి కావడం గమనార్హం. 89 ఏళ్ల ప్రకాశ్ సింగ్ బాదల్ పార్టీలో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తన కుటుంబ సభ్యులందరికి రాజకీయ వారసత్వం కల్పించే స్థాయికి ఎదిగారు.

English summary
Pedigree holds the key in the Shiromani Akali Dal (SAD) to climb the slippery pole of electoral politics.To turn the tide in its favour, the 96-year-old party that contests 94 seats has fielded 26 candidates from the clans of Akali stalwarts for the February 4 assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X