• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రత్యేకం: ఢిల్లీ బిజెపి సిఎం అభ్యర్థి హర్షవర్ధన్ ఇంటర్వ్యూ

By Pratap
|

న్యూఢిల్లీ: గత 15 ఏళ్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న షిలా దీక్షిత్ పట్ల ఆ రాష్ట్ర ప్రజలు కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పాలనాకాలంలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ సమస్యలు, అవినీతి వంటివి ఇందుకు కారణంగా తెలుస్తున్నాయి. కాగా కొత్తగా అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీ పీఠాన్ని రానున్న ఎన్నికల్లో కైవసం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రంలో మంచి పేరున్న డాక్టర్ హర్ష వర్ధన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే కాంగ్రెస్, బిజెపి పార్టీల ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చే అవకాశం ఉంది.

బిజెపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న డాక్టర్ హర్షవర్ధన్‌తో వన్ ఇండియా సబ్ ఎడిటర్ భవిత ఝా ప్రత్యేక ఇంటర్వ్యూను నిర్వహించారు. వన్ ఇండియా ప్రతినిధితో హర్షవర్ధన్ చెప్పిన విశేషాలు..

Dr Harshvardhan

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రివాల్‌పై హర్షవర్ధన్:

తూర్పు ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రివాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, బిజెపి, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఆయన అన్నారు. కేజ్రివాల్ మొదట కాంగ్రెస్‌లోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడారని, ప్రస్తుతం అతను ఓట్ సప్లయర్‌గా మారారని అన్నారు. బిజెపిపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉండబోదని, ఉంటే అది కాంగ్రెస్ పైనే ఉంటుందని ఆయన తెలిపారు.

ఒకవేళ ఎన్నికల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ రాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. అది ఊహాజనితమైదని ప్రశ్న అని హర్షవర్ధన్ అన్నారు. అయితే ఇప్పటికే అరవింద్ కేజ్రివాల్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రకటించారు కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండదని అన్నారు. బిజెపి సున్నా పర్సంట్ కూడా ఓటమి పాలయ్యే అవకాశం లేదని, తామే అధికార పీఠాన్ని చేజిక్కించుకుటామని ధీమా వ్యక్తం చేశారు.

సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కేజ్రివాల్‌కు తలెత్తిన విభేదాలను ప్రస్తావిస్తూ.. అన్నా హజారేను, దేశ ప్రజలను కేజ్రివాల్ మోసగిస్తున్నారని హర్షవర్ధన్ ఆరోపించారు. అయితే వారి విభేదాలను ఆసరా చేసుకోవాలని చూడడం లేదని ఆయన అన్నారు. నైతిక విలువలతో బిజెపి ఎన్నికల బరిలో దిగుతోందని ఆయన చెప్పారు.

ఇతర ప్రత్యర్థి పార్టీలపై:

బిజెపి ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించట్లేదనే కారణంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చిందని పలువురు భావిస్తున్నారని, దీనిపై మీ సమాధానమేమిటని ప్రశ్నించగా.. కాంగ్రెస్ చేపట్టిన ప్రతీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని బిజెపి వ్యతిరేకించిందని, తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించామని ఆయన చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్ వైఫల్యాలపై:

కాంగ్రెస్ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్ వైఫల్యాలు చాలా ఉన్నాయని, ఆమె అభివృద్ధి మంత్రం మెట్రో రైలు, ఫ్లై ఓవర్ల వరకే పరిమితమైందని ఆరోపించారు. ప్రతీ విషయంలోనూ షిలా దీక్షిత్ విఫలమయ్యారని హర్షవర్ధన్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయి సంస్కరణలు చేపడతామని, పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఓపినియన్ పోల్స్ గురించి ప్రశ్నించగా.. బిజెపికి పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బిజెపి అంతర్గత విభేదాలపై:

ఢిల్లీ రాష్ట్ర బిజెపి శ్రేణుల్లో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఢిల్లీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గోయల్, పార్టీ శ్రేణుల మధ్య విభేదాలున్నాయనే ఆరోపణలు అర్థ రహితమని ఆయన అన్నారు. రాష్ట్ర బిజెపి శ్రేణులు ఐకమత్యంగా ఉన్నాయని, ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు. సీట్ల పంపిణీలో వచ్చిన చిన్న చిన్న విభేదాలను పార్టీ పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

బిజెపి భవిష్యత్ ప్రణాళికలు

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల ముందే రాష్ట్రంలో ఆరు ర్యాలీలు చేపడతారని ఆయన చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పాయి హయాంలో దేశంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలు, గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ఢిల్లీలో కూడా జరగాలంటే బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అదే విధంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని, నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With Chief Minister's Sheila Dikshit's 15-year-old rule that has been full of adversaries for common man on issues like price rise, water, electricity, corruption among other issues, the newly-formed Aam Aadmi Party (AAP) or BJP may be having a chance of coming in power in the national capital, but for the BJP's Delhi CM candidate Dr Harshvardhan, AAP is only a "vote, killer"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more