• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆగస్టా కుంభకోణం రచ్చ: ఎవరీ సుబ్రమణ్య స్వామి?

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: సుబ్రమణ్య స్వామి.... రాజ్యసభ్యుడిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలి మూడు రోజుల్లోనే వార్తల్లోకి ఎక్కారు. అంతేనా... ఆగస్టా కుంభకోణాన్ని రాజ్యసభలో ప్రస్తావించి నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనే విమర్శలు చేసి మూడు రోజుల పాటు నానా హంగామా సృష్టించారు.

అసలు ఎవరీ సుబ్రమణ్య స్వామి. ఎక్కడ నుంచి వచ్చారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సుబ్రమణ్య స్వామి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. అయితే ఆర్ధికవేత్తగా కన్నా... వివాదాస్పదుడైన రాజకీయ నేతగానే సుప్రసిద్ధుడు. సంచలన ఆరోపణలతో, సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

ప్రస్తుతం బీజేపీ తరుపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరును రాజ్యసభలో ప్రస్తావించి డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహానికి గురయ్యారు. రాజ్యసభలో లోక్‌సభ సభ్యుల ప్రస్తావన తేవొద్దని, మరోసారి అలా చేస్తే తీవ్ర చర్యలుంటాయని కురియన్ హెచ్చరించారు.

1974 నుంచి 1999 మధ్య కాలంలో ఐదు సార్లు ఎంపీగా పనిచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రముఖ అడ్వకేట్లలో సుబ్రమణ్య స్వామి ఒకరు. స్వామి భార్య రోక్సానా స్వామి కూడా లాయర్. వీరికి ఇద్దరు సంతానం. గతంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయిని తాగుబోతు అన్నా, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్‌ను అవినీతిపరుడని ఆరోపణలు చేయడం ఈయనకే చెల్లించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ మూలాలను పదేపదే ప్రస్తావిస్తూ ఆమెను స్మగ్లర్ అంటూ ఆరోపణలు సైతం చేశారు.

How Subramanian Swamy is giving BJP MPs sleepless nights

ఆగస్టా కుంభకోణంలో రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం తప్పంటూ ట్వీటర్‌లో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సుబ్రమణ్య స్వామి చేసే ఆరోపణలు సంచలనాత్మకంగా ఉంటాయి. అయితే ఆ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఉండవని రాజకీయ వర్గాల విశ్లేషణ.

సుబ్రమణ్య స్వామి మొదటి నుంచి బీజేపీకి మిత్రుడేం కాదు. అలాగే కాంగ్రెస్‌కు శత్రువు కూడా కాదు. గతంలో ఆయన సోనియాకూ ఆత్మీయుడుగా ఉన్నారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను, సోనియాను ఒక్కటి చేసిన ఘనత స్వామిదే.

లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణమైన స్పెక్ట్రం కుంభకోణాన్ని బయటపెట్టింది కాగ్ అయినా, ఆ స్కాంకు ఆ స్థాయి ప్రాచుర్యం కల్పించి, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలా చేసింది మాత్రం స్వామినే.

English summary
Very rarely in Parliament do you see the kind of debut, which Rajya Sabha MP Subramanian Swamy has made. Controversial, centre-stage, right in your face and pandering to his core constituency, Swamy has literally set the Rajya Sabha ablaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X