వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహంకారానికి నిలయం ఆప్.. క్రమంగా పట్టుకోల్పోతున్న కేజ్రీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక సెంటిమెంటే ఢిల్లీవాసులు 2015లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓట్లేసి గెలిపించారు. కానీ రెండేళ్ల తర్వాత పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆప్‌ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు ఆ పార్టీని, ఆయన ప్రతిష్ఠను పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ పాలన అందిస్తామని ఇచ్చిన హామీని నమ్మి హస్తిన వాసులు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌ను గెలిపించారు.

2015 అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవసభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ 70 అసెంబ్లీ స్థానాలకు 67 స్థానాల్లో ఢిల్లీ వాసులు గెలిపించడానికి ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న అహంకార పూరిత వైఖరి వల్ల అనుసరించినందువల్లే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. అవినీతి రహిత రాజకీయాలను అనుసరిస్తామని ఢిల్లీ వాసులకు ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు గర్వపడేలా ఢిల్లీని తీర్చి దిద్దుతానని హామీలు గుప్పించారు.

అవినీతిపై ఆప్ ఇలా

అవినీతిపై ఆప్ ఇలా

2015 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత అహంకారం, అవినీతి అనే పదాలు ఢిల్లీ సీఎం - ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆయన సారథ్యంలోని ఆప్‌లకు నిర్వచనాలుగా మారాయంటే అతిశేయోక్తి కాదు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్ల నగదు అరవింద్ కేజ్రీవాల్‌కు అందజేశారని కపిల్ మిశ్రా ఆరోపణలు గుప్పించారు. హవాలా లావాదేవీలు జరుపుతున్నందుకు ఐటీ దాడులు నిర్వహించకుండా సత్యేంద్ర జైన్ ఈ ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు వచ్చాయి.
ఐటి అధికారుల కథనం ప్రకారం కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న 56 షెల్ కంపెనీల నుంచి ముగ్గురు హవాలా ఆపరేటర్లు జీవేంద్ర మిశ్రా, అభిషేక్ చొఖ్కానీ, రాజేంద్ర బన్సాల్ నుంచి సత్యేంద్ర జైన్ రూ.16.39 కోట్ల మేరకు ముడుపులు అందుకున్నారు.

కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆప్ ఆరోపణ

కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆప్ ఆరోపణ

విదేశీ భాగస్వామ్య నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్ఎ) - 2010ను ఉల్లంఘించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు వచ్చిన విదేశీ రాజకీయ విరాళాల వివరాలు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ పంపిన లేఖ రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆప్ నేతలంతా ఆరోపించారు. అవామ్ (ఆప్ వలంటీర్స్ యాక్షన్ మంచ్) 2013లో ఆప్ గా రూపాంతరం చెందక ముందు నాలుగు కంపెనీల నుంచి రూ. 2 కోట్ల విరాళం పొందడం అనుమానాస్పదంగా ఉన్నదని హోంశాఖ పేర్కొంటే తమ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు జరిగిన కుట్ర అని ఆప్ ప్రత్యారోపణలకు దిగింది. కానీ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని చేసిన ఆరోపణలతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. గమ్మత్తేమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్‌సైట్‌లో విరాళాల జాబితా విభాగం నిర్మాణంలో ఉన్నదని వివరణ ఇవ్వడం గమనార్హం.

కేజ్రీ, సిసోడియాలపై పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత

కేజ్రీ, సిసోడియాలపై పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత

అహకారం వల్లే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా అదే పని చేస్తున్నారు. రెండేళ్ల గడువులోగా ఆప్ అదే అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనోశ్ సిసోడియా వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ఢిల్లీల్లో ప్రజల మద్దతు కోల్పోవడానికి వారిద్దరి వ్యవహార శైలే కారణమని చెప్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమి పాలయ్యామన్న కేజ్రీవాల్ వాదనను కుమార్ విశ్వాస్ సహా పార్టీ సీనియర్లంతా వ్యతిరేకించడంతో పరిస్థితి బయటకు వచ్చింది. ఆప్ నాయకత్వం తీరు, కేజ్రీవాల్ వ్యవహారశైలిపై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినా.. తాత్కాలికంగా రాజీ కుదిరింది. కానీ తాజాగా కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు సంచలనాలకు దారి తీసింది.

తమకు ఎటువంటి సంబంధం లేదన్న షీలా

తమకు ఎటువంటి సంబంధం లేదన్న షీలా

మూడుసార్లు సీఎంగా పనిచేసిన షీలాదీక్షిత్‌పై 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా అరవింద్ కేజ్రీవాల్ భారీ మెజారిటీతో విజయం సాధించి జెయింట్ కిల్లర్ అవతారం ఎత్తారు. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం సహా పలు కుంభకోణాల్లో చిక్కుకున్నారని కాగ్ అక్షింతలు వేసింది. 2010లో జరిగిన ఈ క్రీడా వేడుకల్లో ప్రైవేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చిందని కాగ్ పేర్కొన్నది. కానీ జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా క్రీడోత్సవాల నిర్వహించడానికి ప్రాధాన్యం ఇచ్చామే తప్ప, తానెటువంటి తప్పిదాలకు పాల్పడ లేదని షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు.

పార్టీ శ్రేణులకు దూరమైన కేజ్రీవాల్

పార్టీ శ్రేణులకు దూరమైన కేజ్రీవాల్

2017లోకి వచ్చేనాటికి పరిస్థితులు మారిపోయాయి. కేజ్రీవాల్ పార్టీ శ్రేణులతో సంబంధాలు పాటించకపోగా, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో నిత్యం ఘర్షణలు పెట్టుకోవడం విమర్శలు కొని తెచ్చింది. కేజ్రీవాల్ తనకు తాను ఎప్పటికప్పుడు అవినీతి వ్యతిరేకపోరాట యోధుడిగా ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయి ప్రాధాన్యం సంతరించుకున్నారు. అదే అంశం పార్టీ పతనం దిశగా అడుగులేస్తున్నది.

English summary
The anti-corruption sentiment saw people of Delhi voting for Arvind Kejriwal and the Aam Aadmi Party in 2015. A little over two years later, corruption charges threaten to cut short AAP's political flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X