వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ప్లాన్: భుజం కలిపినవారికి అగ్రతాంబూలం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి ఉన్నవారికి పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీ క్యాడర్ లో మంచి సంకేతాలు పంపుతున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్. ఏడాది తర్వాత సుమారు 9 కార్పోరేషన్లకు చైర్మెన్ పదవులను సిఎం ప్రకటించారు.

నామినేటేడ్ పదవులను వరించిన వారు మంచి రోజులు చూసుకొని భాద్యతలను స్వీకరించారు.తొలి నుండి తనను అంటిపెట్టుకొని ఉన్నవారికి కెసిఆర్ పదవులను కట్టబెట్టేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు.

పార్టీ అవసరాల రీత్యా ఇతర పార్టీలకు చెందిన బలమన నాయకులను ఆకర్షించి టిఆర్ఎస్ లో చేరేలా కెసిఆర్ చేసిన కృషి ఫలించింది.ఈ పరిణామం తొలినాళ్ళనుండి పార్టీలో ఉన్నవారికి కొంత నచ్చలేదు. కొత్తగా పార్టీలో చేరిన వారి పెత్తనమే పార్టీలో పెరుగుతోందనే ఆందోళన కూడ ఉంది.అయితే పాల..కొత్త కలయికతో పార్టీ లో నూతనోత్తేజం తీసుకురావాలని సిఎం భావిస్తున్నారు.ఈ మేరకు ఉద్యమంలో తనతో భజం కలిపి నడిచిన వారికి పదవులు కట్టబెడుతున్నారు.

KCR gives priority to those leaders in nominated posts

ఉద్యమ కాలంలో తనతో కలిసి ఉన్న బొంతు రామ్మోహాన్ కు జిహెచ్ ఎం సి మేయర్ పదవి కట్టబెట్టడం ద్వారా పార్టీ శ్రేణులకు మంచి సంకేతాలను పంపారు.ఇదే తరహాలో వారం రోజుల క్రితం 9 కార్పోరేషన్లకు చైర్మెన్ పదవులకు ప్రకటించిన అభ్యర్థులు కూడ ఉద్యమంలో పనిచేసిన వారే ..

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు....క్రిష్ణారెడ్డి ఆది నుండి కెసిఆర్ వెంట నడిచారు. ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారుతారనే ఊహగానాలు కూడ వచ్చాయి.

KCR gives priority to those leaders in nominated posts

అయితే రెండు రోజుల క్రితం యాదాద్రి పర్యటనకు వెళ్ళిన సిఎం కెసిఆర్ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి ఇంటికి వెళ్ళారు. ఉద్యమ కాలం నాటి సంగతులను నెమరువేసుకొన్నారు.వీలు చూసుకొని హైద్రాబాద్ రావాలని సిఎం సూచించారు.దీంతో హైద్రాబాద్ క్యాంపు కార్యాలయంలో సిఎం కెసిఆర్ ను కలిశారు క్రిష్నారెడ్డి. సిఎంతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. జిల్లా రాజకీయాల గురించి చర్చించారు.

నామినేటేడ్ పదవుల గురించి క్రిష్ణారెడ్డిని సిఎం ప్రశ్నించారు. ఏ పదవి కావాలని సిఎం ఆయనను అడిగారు. అయితే ఉద్యమంలో వెన్నంటి ఉన్న క్రిష్నారెడ్డి .....ఏ పదవిని ఇచ్చినా తీసుకొంటానని సిఎం కు చెప్పారు.దీంతో త్వరలో క్రిష్ణారెడ్డికి నామినేటేడ్ పదవి దక్కే అవకాశం కన్పిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఉద్యమ కాలం నుండి పనిచేసిన వారికి కూడ మంచి రోజులు వచ్చినట్టేనని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

English summary
Trs workers happy that the cm kcr decision filling the nominated posts strong workers from the party.Cm assured to Trs senior leader Aliminate krishna reddy for nominated post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X