వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కళ్యాణ్ వ్యాఖ్య, ప్రశ్నలెన్నో: ప్లేటు ఫిరాయిస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ రంగ ప్రవేశంపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సినిమా, రాజకీయ రంగాల్లోను రాణించే సత్తా తన తమ్ముడికి ఉందని చెప్పారు.

దానిపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అన్నయ్య అంటే తనకు ఇష్టమని, ఆయనకు అవసరమైనప్పుడు, కావాలనుకున్నప్పుడు ఎలా అండగా నిలబడతానో కూడా చూపిస్తానని చెప్పారు.

'అన్నయ్యకు అవసరమైనప్పుడు అండగా నిలబడతానని' పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయని అంటున్నారు. ఇది ప్రధానంగా బిజెపిలోను చర్చకు దారి తీసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

ఇప్పటికే, చిరంజీవి బిజెపిలో చేరవచ్చునని, ఆయనను కమలం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడితే పవన్ కళ్యాణ్ అన్నింటా ముందుంటారనే ఊహాగానాలు ఇటీవల వచ్చాయి. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు బిజెపితో పాటు ఇతర పార్టీల్లోను చర్చనీయాంశంగా మారాయి.

ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్

చిరంజీవిని పవన్ కళ్యాణ్ బిజెపిలోకి తీసుకు వస్తారా? తన అన్నయ్యను కమలం పార్టీ వైపు తీసుకు వచ్చి 2019 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింప చేస్తారా? అనే చర్చ సాగుతోంది. బిజెపి కూడా అందుకు సిద్ధంగానే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీని వదిలే సమస్య లేదని చిరంజీవి చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే, 2019 నాటికి ఆ పార్టీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ పార్టీ అంటే పడదు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, తన అన్నయ్య కోసం ఆయన అటువైపు మరలుతారా అనే చర్చ సాగుతోంది.

మొత్తానికి, పవన్ కళ్యాణ్ చేసిన 'అన్నయ్యకు అవసరమైనప్పుడు అండగా నిలబడతానని' వ్యాఖ్యపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతోందట. చిరంజీవిని తన వైపు తీసుకు వస్తారా? లేదా అన్నయ్య కోసం పవన్ కళ్యాణే మనసు మార్చుకుంటారా? తెలియాల్సి ఉందని చెబుతున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

 సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

చాలా కాలం తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆడియో వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. చిత్ర రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దని, ఈ సందర్భంగా తాను పవన్‌కు ఒక సలహా ఇస్తున్నానని చిరంజీవి చెప్పారు. పవన్‌కు నచ్చిన మరో రంగంలో కూడా కొనసాగాలని ఉన్నప్పటికీ, ఈ రంగాన్ని మాత్రం వదిలివేయవద్దన్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

హీరో అంటే చిరంజీవి గారు తప్ప, మరెవ్వరూ తనకు లేరని కళ్యాణ్ అన్నారు. తాను ఇంతటి వాడినయ్యానంటే దానికి కారణం తన అన్నావదినలేనన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.

 సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక

మా బంధం వేరు, రాజకీయాలు వేరు అని చెప్పారు. అన్నయ్య తన గుండెల్లోనే ఎప్పుడూ ఉంటారని, ఆ విషయాన్ని నేను పదేపదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మా తల్లిదండ్రుల తర్వాత అంతటివారు నాకు అన్నయ్యా వదినే అన్నారు.

English summary
Pawan Kalyan comment on Chiranjeevi, viral in political circle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X