వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రిపూట జెపి అటాక్, మహిళ ప్రశ్న (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటన బాధితులకు సహాయం అందించక పోవడాన్ని నిరసిస్తూ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో శనివారం లక్డీకాపూల్‌లోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ముట్టడించారు.

రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జెపి, ఇతర నేతలు దాని ఎదుట బైఠాయించారు. నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు బలవంతంగా తీసుకు వెళ్లారు.

పోలీసు స్టేషన్ వద్ద జెపి మాట్లాడుతూ... ప్రమాదం జరిగి నెలలు అవుతున్నా ప్రభుత్వం, రవాణా శాఖ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. రవాణా శాఖ మంత్రి బొత్స లక్ష రూపాయలు ఇస్తామనడంపై ఆయన మండిపడ్డారు. బాధితుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జబ్బార్ ట్రావెల్స్‌ను తిరగనివ్వమని హెచ్చరించారు.

డిసిఎంలోకి బలవంతంగా...

డిసిఎంలోకి బలవంతంగా...

జబ్బార్ ట్రావెల్స్ ముందు శనివారం రాత్రి లోక్‌సత్తా పార్టీ ఆందోళన నిర్వహించింది. పాలెం బస్సు దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

విలేకరులతో జెపి

విలేకరులతో జెపి

ట్రావెల్స్ వద్దకు వస్తుండగానే దాదాపు 70మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటికి పార్టీ జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

జెపి

జెపి

జయప్రకాశ్ నారాయణ స్టేషన్లోనే బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు పరిహారం అందే వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

కార్యకర్తలు

కార్యకర్తలు

ప్రభుత్వం దిగిరాకపోతే జబ్బార్ ట్రావెల్స్‌పై దాడి చేస్తామని లోక్‌సత్తా హెచ్చరించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ట్రావెల్స్ మాఫియాతో కుమ్మక్కు కావడం వల్లే పాలెం ప్రమాదం జరిగిందని జెపి ఆరోపించారు.

జెపి, కార్యకర్తల నినాదాలు

జెపి, కార్యకర్తల నినాదాలు

ఆర్‌టిసి బస్సులను పక్కన పెట్టేసి ప్రైవేటు బస్సులకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని జయప్రకాశ్ నారాయణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెనుగులాట

పెనుగులాట

మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటన బాధితులకు సహాయం అందించక పోవడాన్ని నిరసిస్తూ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో శనివారం లక్డీకాపూల్‌లోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ముట్టడించారు.

పోలీసులు బలవంతంగా..

పోలీసులు బలవంతంగా..

రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జెపి, ఇతర నేతలు దాని ఎదుట బైఠాయించారు. నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు బలవంతంగా తీసుకు వెళ్లారు.

ట్రావెల్ మాఫియా నశించాలి

ట్రావెల్ మాఫియా నశించాలి

ట్రావెల్ మాఫియా నశించాలంటూ లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు జబ్బార్ ట్రావెల్స్ ఎదుట ఆందోళన.

జెపి

జెపి

ట్రావెల్స్ వద్దకు వస్తుండగానే దాదాపు 70మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటికి పార్టీ జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అక్కడకు చేరుకున్నారు.

పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

నిలదీత

నిలదీత

జబ్బార్ ట్రావెల్స్ ముందు శనివారం రాత్రి లోక్‌సత్తా పార్టీ ఆందోళన నిర్వహించింది. పాలెం బస్సు దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్

చేసింది. పోలీసులను ప్రశ్నిస్తున్న మహిళా నాయకురాలు.

పోలీసుతో జెపి

పోలీసుతో జెపి

పోలీసు స్టేషన్ వద్ద జెపి మాట్లాడుతూ... ప్రమాదం జరిగి నెలలు అవుతున్నా ప్రభుత్వం, రవాణా శాఖ పట్టించుకోక పోవడం దారుణమన్నారు.

English summary

 Loksatta party chief Jayaprakash Narayana and party activists stage dharna at Jabbar Travels at Lakdi Ka Pool on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X