వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ భేటీల బిజీ: రాజకీయం, అభివృద్ధి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారంనాడు సచివాలయంలో భేటీలతో బిజీగా గడిపారు. ఓ వైపు రాజకీయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు తెలంగాణలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఖమ్మం జిల్లా శాసనసభ్యులతో భేటీ కావడం వెనక రాజకీయం ఉండగా, వివిధ సంస్థల ప్రతినిధులను కలుసుకోవడం ద్వారా అభివృద్ధిపై దృష్టి సారించారు.

6వేల మెగావాట్ల విద్యుత్‌ ఉప్పత్తికి సంబంధించి బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని జెన్‌కోను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. కొత్తగూడెం వద్ద 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరు వద్ద 1080 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌ అంగీకరించింది.

మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కెసిఆర్ చర్చలు జరిపారు. కాగా, రాష్ట్రంలో వైమానిక దళం కార్యకలాపాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని కెసిఆర్ ఎయిర్ మార్షల్ రమేష్ రాయ్, ఎయిర్ కమాండర్ సురేష్ బద్వాల్‌కు హామీ ఇచ్చారు.

బిహెచ్ఈఎల్ సిఎండికి స్వాగతం

బిహెచ్ఈఎల్ సిఎండికి స్వాగతం

సచివాలయంలో తన వద్దకు వచ్చిన బిహెచ్ఈఎల్ సిఎండి బిపి రావు, ఇతర అధికారులకు ఆహ్వానం పలుకుతూ కెసిఆర్ ఇలా..

బిహెచ్ఈఎల్‌తో ఒప్పందం

బిహెచ్ఈఎల్‌తో ఒప్పందం

సచివాలయంలో కేసీఆర్‌ను కలిసిన బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ బీపీరావు, ఇతర అధికారులు నూతన ఒప్పందాల గురించి చర్చించారు. కొత్తగూడెం, మణిగూరు ప్లాంట్ల నిర్మాణాలను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు.

అసదుద్దీన్‌తో భేటీ

అసదుద్దీన్‌తో భేటీ

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కెసిఆర్ సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న తురణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఉంది.

ఎయిర్ మార్షల్ రమేష్ రాయ్ భేటీ

ఎయిర్ మార్షల్ రమేష్ రాయ్ భేటీ

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఎయిర్ మార్షల్ రమేష్ రాయ్, ఎయిర్ కమాండర్ సురేష్ బద్వాల్ మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు.

ఖమ్మం ఎమ్మెల్యేతో భేటీ

ఖమ్మం ఎమ్మెల్యేతో భేటీ

ఖమ్మం జిల్లా శాసనసభ్యులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లుపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

బెయిలర్ ఆస్పత్రి ప్రతినిధులతో..

బెయిలర్ ఆస్పత్రి ప్రతినిధులతో..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో అమెరికాకు చెందిన బెయిలర్‌ ఆస్పత్రి ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. రూ. 500 కోట్ల పెట్టుబడులతో బెయిలర్‌ ఆస్పత్రిని నిర్మించడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు.

బెయిలర్ ఆస్పత్రి ప్రతినిధులతో..

బెయిలర్ ఆస్పత్రి ప్రతినిధులతో..

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రి నిర్మిస్తామని బెయిల్‌ సంస్థ ప్రతినిధులు కేసీఆర్‌కు తెలిపారు. దీనిపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని బెయిలర్‌ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

కెసిఆర్‌తో శైలజా రామియార్...

కెసిఆర్‌తో శైలజా రామియార్...

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామియార్ భేటీ ఆయ్యారు.

కెసిఆర్‌తో కేశవ రావు తదితరులు..

కెసిఆర్‌తో కేశవ రావు తదితరులు..

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సెక్రటరీ జనరల్ కె. కేశవ రావు తదితరులు సమావేశమయ్యారు.

కెసిఆర్‌తో యెండల సౌందర్య

కెసిఆర్‌తో యెండల సౌందర్య

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య కలిశారు. భారత హాీకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించి పలు విజయాలు సాధించి పెట్టినా తనను గత ప్రభుత్వాలు గుర్తించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సౌందర్యకు 25 లక్షల నగదు

సౌందర్యకు 25 లక్షల నగదు

హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్యకు కెసిఆర్ 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దానికితోడు ఆమె సొంత పట్టణం నిజామాబాద్‌లో 250 - 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని కెసిఆర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఎమ్మెల్యేతో కలిసి సౌందర్య

ఎమ్మెల్యేతో కలిసి సౌందర్య

నిజామాబాద్ శాసనసభ్యుడు గణేశ్ గుప్తాతో కలిసి యెండల సౌందర్య ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఆమెకు కేటాయించిన స్థలంలో రూ.15 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao met several political and apolitical deligates including hockey player Yendala Soundarya at secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X