వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా వర్సెస్ నందమూరి: తగ్గని దూరాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ కుటుంబాల మధ్య దూరాలు తరగలేదని మరోసారి తెలిసి వస్తోంది. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీ రామారావుకు ఇరు కుటుంబాల సభ్యులు శనివారం నివాళులు అర్పించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌తో వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులు అర్పించారు.

ఎన్టీ రామారావు కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తన ఇతర సోదరులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు హీరో కళ్యాణ్ రామ్ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు నివాళులు అర్పించారు. ఆయన దర్శకుడు కొరటాల శివతో కలిసి వచ్చి నివాళులు అర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటనలు చేశారు. తెలుగదేశం పార్టీ నాయకులు కూడా ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నా..

జూనియర్ ఎన్టీఆర్ చెబుతున్నా..

తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కానీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనను దగ్గరికి తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు.

రాజకీయాలు ఇప్పుడే కాదు..

రాజకీయాలు ఇప్పుడే కాదు..

తాను రాజకీయాల్లోకి రావడానికి చాలా సమయం ఉందని, తాను సినిమాల్లో చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

హీరో కళ్యాణ్ రామ్ నివాళులు

హీరో కళ్యాణ్ రామ్ నివాళులు

ఎన్టీ రామారావుకు హీరో కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. నారా, నందమూరి కుటుంబాల మధ్య సయోధ్యకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటారు.

హరికృష్ణ ఇలా...

హరికృష్ణ ఇలా...

తన సోదరులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన నందమూరి హరికృష్ణ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

సోదరులతో హరికృష్ణ..

సోదరులతో హరికృష్ణ..

తన సోదరులు నివాళులు అర్పిస్తుండగా పక్కన హరికృష్ణ నిలబడ్డారు. బాలకృష్ణ మినహా మిగతా సోదరులంతా హరికృష్ణ పక్కన ఉన్నారనే అభిప్రాయాన్ని కలుగజేస్తోంది.

రామకృష్ణ నివాళులు..

రామకృష్ణ నివాళులు..

తండ్రి ఎన్టీ రామారావుకు రామకృష్ణ నివాళులు అర్పించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణను చూడవచ్చు.

కళ్యాణ్ రామ్ ఇలా.

కళ్యాణ్ రామ్ ఇలా.

ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ తన కుటుంబ సభ్యులతో ఇలా...

హరికృష్ణపై ఎర్రబెల్లి ఫైర్

హరికృష్ణపై ఎర్రబెల్లి ఫైర్

ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణపై హరికృష్ణ వైఖరిని తప్పు పట్టారు.

టిడిపి సీమాంధ్ర నేతలు..

టిడిపి సీమాంధ్ర నేతలు..

తెలుగదేశం పార్టీ సీమాంధ్ర నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి తదితరులు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

పురంధేశ్వరి కుటుంబ సభ్యులు..

పురంధేశ్వరి కుటుంబ సభ్యులు..

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు తమ పిల్లలతో కలిసి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి వచ్చారు.

పాత మిత్రుడితో దగ్గుబాటి...

పాత మిత్రుడితో దగ్గుబాటి...

ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి వచ్చిన కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనకు ఎదురైన తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావుతో కరచాలనం చేశారు.

నివాళులు అర్పిస్తూ..

నివాళులు అర్పిస్తూ..

కేంద్ర మంత్రి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతులు పిల్లలతో కలిసి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. చంద్రబాబుకు ఈ దంపతులకు మధ్య చాలా కాలంగా వైరం సాగుతోంది.

పరిటాల సునీత నివాళి

పరిటాల సునీత నివాళి

ఎన్టీ రామారావుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత నివాళి అర్పించారు. ఆమె భర్త పరిటాల రవికి రాజకీయాల్లో స్థానం కల్పించింది ఎన్టీ రామారావే.

చంద్రబాబు నివాళులు..

చంద్రబాబు నివాళులు..

తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లతో వచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.

భార్యతో చంద్రబాబు..

భార్యతో చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. ఆయన రాజకీయ ప్రకటనేది చేయలేదు.

నారా లోకేష్ నివాళి..

నారా లోకేష్ నివాళి..

రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న నారా లోకేష్ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. తాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

భార్యాకుమారులతో చంద్రబాబు..

భార్యాకుమారులతో చంద్రబాబు..

ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌లతో కలిసి ఇలా..

భువనేశ్వరితో పరిటాల సునీత..

భువనేశ్వరితో పరిటాల సునీత..

ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన సందర్బంగా ఆయన కూతురు, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరితో పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత ఇలా..

English summary
It seems the differences between Nara and Nandamuri families are continuing, as they payed homage to NT Rama Rao seperately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X