వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వి'చిత్రాలు': శివప్రసాద్ 'సమైక్య' వేషాలు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించారు. విచిత్ర వేషధారణల ద్వారా తన నటనాకౌశల్యంతో సమైక్యాంధ్ర కోసం ఆయన ఉద్యమించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడానికి, అందుకు కారణమైన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్సించడానికి ఆయన విచిత్ర వేషాలతో తనదైన శైలిని వాడుకున్నారు.

తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఆయన ఉద్యమానికి కళాసౌందర్యాన్ని అద్దడానికి పనికి వచ్చింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధుల ముందుకు ఆయన తన సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి విచిత్ర వేషధారణలతో, పౌరాణిక పాత్రల వేషాల్లో వచ్చి వినోదాన్ని అందించడమే కాకుండా తన వాదనను వినిపించారు.

రాష్ట్ర విభజనను తన కళాదృష్టితో వ్యతిరేకిస్తూ ప్రదర్శన ఇచ్చిన తర్వాత మిగతా తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తమ వాదనలను వినిపించే సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఆయన పార్లమెంటు సమావేశాలకు కూడా విచిత్ర వేషాల్లో హాజరయ్యారు.

కొరడాతో కొట్టుకున్నారు..

కొరడాతో కొట్టుకున్నారు..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తమ సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తూ శివప్రసాద్ కొరడాతో కొట్టుకున్నారు. కొరడాతో కొట్టుకునే జానపద కళారూపంలో తెలుగు సమాజంలో ఆచరణలో ఉంది.

చెక్కభజన చేశారు..

చెక్కభజన చేశారు..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సహచర సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో కలిసి శివప్రసాద్ పార్లమెంటు ధర్నా చేస్తూ చెక్కభజన చేశారు.

మా తెలుగుతల్లికి మల్లెపూవు దండ..

మా తెలుగుతల్లికి మల్లెపూవు దండ..

శంకరంబాడి సుందరాచార్య రాసిన మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాట తెలుగులో చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఎన్టీఆర్ హయంలో తెలుగు గీతంగా మలిచారు. దాన్ని పేరడీ చేసి విభజన వల్ల సీమాంధ్రకు ఎలా అన్యాయం జరుగుతుందో వివరిస్తూ శివప్రసాద్ పాట పాడారు.

నారదుడి వేషంలో..

నారదుడి వేషంలో..

శివప్రసాద్ ఇటీవల నారదుడి వేషంలో పార్లమెంటుకు వచ్చి తనదైన శైలిలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గానం చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి శాపనార్థాలు కూడా పెట్టారు.

బుడబుక్కల వేషంలో..

బుడబుక్కల వేషంలో..


తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ బుడబుక్కల వేషంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన ఇచ్చారు.

చిత్రగుప్తుడి వేషంలో...

చిత్రగుప్తుడి వేషంలో...

సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై వంద రోజులైన సందర్భంగా ఉద్యమంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ చిత్రగుప్తుడి వేషం ధరించారు. విభజన విషయంలో యుపిఎ ప్రభుత్వ తప్పులను లెక్క కట్టే పనిచేశారు.

English summary
Telugudesam Seemandhra MP Sivaprasad used his cultural ability and acting skills in united Andhra, opposing the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X