వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కళావతిని దొరకబుచ్చుకున్న రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
భోపాల్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో మరో 'కళావతి'ని తెర పైకి తీసుకు వచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్షి గ్రామంలో బుధవారం రాహుల్ పర్యటించి ప్రచారం చేశారు.

కుక్షీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పదిహేను నిమిషాలు ప్రసంగించాక ఉన్నట్టుండి వేదికపై నుంచి దిగి అక్కడున్న గిరిజన మహిళ లలితా బాయిని పలుకరించారు. ఆమె కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద పని దొరుకుతోందా? అని ప్రశ్నించారు.

ఆమె తనకు కొద్ది రోజులుగా పని లేదని చెప్పారు. దీంతో రాహుల్... కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే మీ కష్టాలు తీరుస్తామని చెప్పారు. ఆ తర్వాత లలిత కూతురు పూజను పాఠశాలకు వెళ్తున్నావా అని అడిగారు. ఐదో తరగతి చదువుతున్నానని ఆ బాలిక చెప్పింది. లలితా కుటుంబం కుక్షీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోని గిర్వానియాలో ఓ పూరింట్లో నివసిస్తోంది.

కాగా, మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కళావతిని తెర పైకి తీసుకు వచ్చారు. తన సభకు వచ్చిన కళావతిని పరామర్శించిన రాహుల్.. ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికలలో లలితా బాయిని తెర పైకి తీసుకు వచ్చారు.

English summary
AICC vice president Rahul Gandhi managed to find a 'Kalavati' in Lalita Bai in Madhya Pradesh at an election rally in Kukshi, about 380 kms from Bhopal on Wednesday. It was in Maharashtra first, when Rahul had talked to a tribal woman named Kalavati and had promised to help her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X