వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో రేవంత్ మంతనాలు

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన భవిష్యత్ రాజకీయ కెరీర్‌పై ద్రుష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని టీడీపీ సంకేతాలివ్వడంతో రేవంత్ భవితవ్యం ప్రశ్న

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ విషయమై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు స్వయంగా ప్రకటించారు. కానీ పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగమేఘాలపై తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించారు. పొత్తుపై తేల్చకపోవడంతో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తన భవితవ్యంపై ద్రుష్టి సారించారు.
తన సామాజిక వర్గం నేతలతో ముందుకు వెళ్లాలా? వద్దా? అన్న విషయమై సందిగ్ధత నుంచి బయటపడాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తన సన్నిహితులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్దం అయ్యారు.

టీఆర్ఎస్‌తో పొత్తును ధ్రువీకరించిన టీటీడీపీ నేతలు

టీఆర్ఎస్‌తో పొత్తును ధ్రువీకరించిన టీటీడీపీ నేతలు

అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌తో సమావేశ వివరాలను ఆంధ్రజ్యోతి సీఎండీ వేమూరి రాదాక్రుష్ణ బయటపెట్టడంతో అసలు సంగతి బయటపడింది. తెలంగాణ టీడీపీ నాయకుల్లో కొందరు.. టీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణ టీడీపీ నేత ఒకరు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని తెలిపారు. పొత్తులో భాగంగా టీటీడీపీ అధ్యక్షుడు రమణ కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌.. అసెంబ్లీలో టీడీపీకి 10 నుంచి 15 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ అంగీకరిస్తే టీడీపీతో సంప్రదిస్తానన్న తుమ్మల

సీఎం కేసీఆర్ అంగీకరిస్తే టీడీపీతో సంప్రదిస్తానన్న తుమ్మల

టీడీపీతో పొత్తు విషయమై మీడియాలో వార్తలు వస్తున్నా వాటిని టీఆర్‌ఎస్‌ నేతలు ఖండించలేదు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో చర్చిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తప్ప టీఆర్‌ఎస్‌తో వెళతామా, వెళ్లబోం అని మాత్రం సృష్టత ఇవ్వలేదు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కలిసి పోటీ చేసే విషయమై టీడీపీతో రాయబారం జరిపేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. అయితే దీనికి సీఎం కేసీఆర్ అంగీకరించాల్సి ఉంటుందని షరతు విధించారు. వాస్తవంగా తెలంగాణలో పార్టీ మనుగడ కాపాడుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని సంకల్పించారని వార్తలొచ్చాయి. దీనికి తోడు తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ప్రజలు గణనీయ స్థాయిలో ఉన్నారు. రాజకీయంగా టీఆర్ఎస్‌కు వీరి మద్దతు ఎంతో కీలకం. పరస్పరం ప్రయోజనకారిగా ఉంటుందని ఇరు పార్టీలు భావిస్తున్నారు.

టీడీపీ పొత్తుకు టీఆర్ఎస్ నేతలే ప్రతిపాదనలు

టీడీపీ పొత్తుకు టీఆర్ఎస్ నేతలే ప్రతిపాదనలు

గత ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైనప్పుడు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చంద్రబాబు ఇంటివైపు కాన్వాయ్ వెళ్లడం కూడా ఇందులో భాగమేనని ప్రచారం జరుగుతున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కువ సీట్లు గెలవడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో టీడీపీ నేతలను కేసీఆర్‌ తమవైపు తిప్పుకోవడం వల్లే గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారని అంటున్నారు. టీడీపీతో పొత్తు ఉండాలన్న అంశాన్ని ఆ పార్టీ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు కేసీఆర్‌కు సూచించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి అధికార టీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో తన భవితవ్యాన్ని నిర్దేశించుకునే దిశగా అడుగులేస్తున్నారు

English summary
There is rumours that TDP and TRS will alliance next assembly elections. This is revealed rift in TTDP leadership. TTDP leaders also divided Two groups. TTDP president L Ramana and others leads one group, another group leads with A Revant Reddy. He has fighting with TRS leadership from the 2014. If alliance with Two parties then Revant Reddy future will in dilema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X