వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు నాలుగేళ్లు పట్టిందా: బలహీనపరిచిందే ఆయన

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే మాట 14వ ఆర్థిక సంఘం చెప్పలేదనే విషయం తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పట్టిందా అనేది ప్రశ్న. ఇదే ప్రశ్నను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా వేస్తూ ఓ భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది.

Recommended Video

Pawan Kalyan Dramas Over 'No Confidence Motion'

ప్రత్యేక హోదా కుదరదని, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదని 14వ ఆర్థిక సంఘం చెప్పింది కాబట్టి మనకు హోదా ఇవ్వలేకపోతున్నట్లు కేంద్రం చెప్పిందని, అయితే ఆ రాష్ట్రాలకు ఇంకా హోదా కొనసాగుతున్నప్పుడు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో అన్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ ఉద్దేశ్యమేమిటంటూ...

ఆ ఉద్దేశ్యమేమిటంటూ...

చంద్రబాబు మాటలను ప్రస్తావిస్తూ ఆయన ఉద్దేశ్యమేమిటో చెప్పడానికి సాక్షి మీడియా ప్రయత్నింంచింది. చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం కలిగించడమే ఉద్దేశ్యమని వ్యాఖ్యానించింది. ప్రత్యేక హోదాను ఆర్థిక సంఘం వద్దని చెప్పలేదని కనుక్కోవడానికి చంద్రబాబుకు నాలుగేళ్లు పట్టిందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారంటూ వ్యాఖ్యానించింది.

చంద్రబాబుకు ప్రశ్నల వర్షం

చంద్రబాబుకు ప్రశ్నల వర్షం

చంద్రబాబు వైఖరిపై సాక్షి మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదాకు అడ్డం పడిందెవరు, ప్రత్యేక హోదా శుద్ధ దండుగ అని వాదించిందెవరు, ప్రత్యేక హోదాతో ఏం వస్తుందీ అదేమన్నా సంజీవనా అని ప్రశ్నించెందవరు, హోదా కన్నా ప్యాకేజీ మెరుగైందని ప్రచారం చేసిందెవరంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలు గుర్తు చేస్తున్నారని రాసింది.

స్పష్టమైన వైఖరి చెప్పకుండా...

స్పష్టమైన వైఖరి చెప్పకుండా...

ప్రత్యేక హోదాపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి చెప్పకుండా లీకులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సాక్షి రాసింది. ప్రజల్లో తనపై పెరుగుతున్న వ్యతిరేక భావనను తప్పించుకునేందుకు ముఖ్యమంంత్రి ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధితో కాదనే విమర్శలున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేయకపోవడాన్ని సాక్షి తప్పు పట్టింది.

హోదాను బలహీనపరిచిందెవరు...

హోదాను బలహీనపరిచిందెవరు...

కలిసి పోటీ చేసి కేంద్ర ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకుంటూ ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి పోరాడేవాళ్లను అడ్డుకుంటూ కమిషన్ల కోసం ప్యాకేజీని స్వాగతించడం పట్ల అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని సాక్షి తన వార్తాకథనంలో గుర్తు చేసింది. ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్ిసన చంద్రబాబు ఆ పని చేయకపోగా వాస్తవానికి మన వాదన బలహీనపడడానికి కావాల్సిందంతా చేశారని విమర్శించింది.

తప్పుడు గణాంకాలతో అడ్డుకున్నారు...

తప్పుడు గణాంకాలతో అడ్డుకున్నారు...

దేశమంతా జిడీపి 6.7 శాతం వృద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్‌డిపి 12 శాతానికి పైగా వృద్ది ఉందని చంద్రబాబు ప్రచారం చేశారని, రెండు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి రూ.15 లక్షల కోట్లక పైగా పెట్టుబడులు వచ్చేశాయని ప్రచారం చేశారని, ఇలా పెంచి ప్రచారం చేసుకున్న గణాంకాలు ఎడాపెడా అప్పులు చేయడానికి ఉపయోగపడ్డాయని సాక్షి మీడియా వార్తాకథనం వివరి్తూ ఈ తప్పుడు గణాంకాలతో ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నాననే స్పృహ ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని విశ్లేషకులు అంటున్నట్లు రాసింది. అనేక రకాల వ్యాఖ్యానాలు చేసి ప్రత్యేక హోదా వాదనను బలహీనపరిచారని తప్పు పట్టింది.

ఆర్థిక సంఘానికి సంబంధం లేదని...

ఆర్థిక సంఘానికి సంబంధం లేదని...

ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదదని ఆర్థిక సంఘం చెప్పలేదనే విషయాన్ని సాక్షి మీడియా సమర్థిస్తూ కొన్ని ప్రస్తావనలు చేసింది. 14వ ఆర్థిక సంఘానికి ఏ విధమైన సంబంధం లేదని, తాము అలాంటి సిఫార్సులేవీ చేయలేదని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి స్పష్టం చేశారని తెలిపింది. ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా వివరించినట్లు తెలిపింది. 14వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేసిన విషషయాన్ని గుర్తు చేస్తూ ఆర్థిక సంఘం అడ్డు చెప్పిందనే వాదన తప్పు అని వ్యాఖ్యానించింది.

English summary
The YSR Congress party president YS jagan's Sakshi media questioned Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu's stand special category status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X