వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23 వరకూ సస్పెన్స్ థ్రిల్లర్: సేఫ్టీ సర్టిఫికెట్ జారీతోనే హెద్రాబాద్ మెట్రో ముహూర్తం?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగు ప్రజలు ప్రత్యేకించి తెలంగాణకు కీర్తి కిరీటం.. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నది. చివరి క్షణం వరకూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూడాల్సి వస్తోంది. మెట్రో రైలు పరుగులు పెట్టే సంగతేమిటో గానీ.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయంటే అతి శయోక్తి కాదు.

ఈనెల 28వ తేదీన ప్రారంభం అయ్యే మెట్రో రైలు సర్వీసులకు10 కిలోమీటర్ల దూరానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) నుంచి అనుమతి రాకపోవడమే ఇందుకు కారణం. ఈ అనుమతి ఈనెల 23వ తేదీన గానీ జారీ అయ్యే అవకాశాలు లేవు మరి. అలా మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ నుంచి సేఫ్టీ సర్టిఫికెట్ జారీ అయిన తర్వాత ఐదు రోజుల్లోనే మిగిలిన ఏర్పాట్లను హడావుడిగా చేసుకోవాల్సి ఉంటుంది.

 నాలుగైదు రోజుల్లోనే ఏర్పాట్లు చేసుకోవాలి మరి

నాలుగైదు రోజుల్లోనే ఏర్పాట్లు చేసుకోవాలి మరి

ప్రారంభోత్సవంలో అతి ముఖ్యమైన ఆహ్వాన పత్రిక ఎలా ఉండాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిని ముద్రించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ప్రధాని నరేంద్రమోదీ రాకతోపాటు షెడ్యూలు ఖరారు లేఖ కోసం హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు వేచి చూస్తున్నారు. అది వస్తేనే సమయంతోపాటు వివరాలను ఆహ్వాన పత్రికలో ముద్రించాల్సి ఉంటుంది. పీఎంవో నుంచి షెడ్యూలు రావాలంటే సీఎంఆర్‌ఎస్‌ నుంచి అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 30 కి.మీ. మేర మెట్రో రైలును పరుగులు పెట్టించాలని భావించిన సంగతి తెలిసిందే.

 ఎస్సార్ నగర్ - మెట్టుగూడ మధ్య సేఫ్టీపై ధ్రువీకరణ కావాల్సిందే

ఎస్సార్ నగర్ - మెట్టుగూడ మధ్య సేఫ్టీపై ధ్రువీకరణ కావాల్సిందే

ఇందులో ఇప్పటికే నాగోల్ ‌- మెట్టుగూడ ఎనిమిది కిలోమీటర్లు మియాపూర్‌-ఎస్సార్‌నగర్‌ 12 కిలోమీటర్ల మార్గానికి సీఎంఆర్‌ఎస్‌ నుంచి భద్రతాపరమైన సర్టిఫికెట్‌ వచ్చింది. ఇక మిగిలిన 10 కిలోమీటర్ల మెట్టుగూడ-ఎస్సార్‌నగర్‌ మార్గంలో ఇటీవలే పనులు పూర్తి చేసి టెస్ట్‌ రన్‌, ట్రయల్‌ రన్స్‌ను నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా సీఎంఆర్‌ఎస్‌ అధికారి రామ్‌ కిర్‌పాల్‌ నేతృత్వంలో పలు రకాల భద్రతా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా పరీక్షలుచేశారు. మరో రెండు, మూడు రోజులపాటు పరీక్షలు చేపట్టిన తర్వాత, పూర్తిగా సంతృప్తి చెందితే గానీ ‘సీఎంఆర్ఎస్' నుంచి సేఫ్టీ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

 23 వరకూ ఇదే ఉత్కంఠ తప్పదా?

23 వరకూ ఇదే ఉత్కంఠ తప్పదా?

సీఎంఆర్ఎస్ అధికారి రామ్ కిర్ పాల్ సారథ్యంలో జరిగే పరీక్షలు పూర్తి కావడానికి ఈనెల 23 నుంచి 24 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఢిల్లీలోని సీఎంఆర్‌ఎస్‌ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్‌ ఆధారంగానే మెట్రో ప్రారంభానికి పీఎంవో నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన షెడ్యూలు ఖరారయ్యే అవకాశం ఉంది. పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి మెట్రో అధికారులకు సమాచారం వస్తుంది. ఆ తర్వాతే ఆహ్వాన పత్రిక వంటి మిగిలిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ప్రారంభోత్సవంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

 ఒక్కో స్టేషన్‌లో ఒకటే మరుగుదొడ్డి!

ఒక్కో స్టేషన్‌లో ఒకటే మరుగుదొడ్డి!

ఎంతో అట్టహాసంగా.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపాలు ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రయాణికులు లఘుశంక తీర్చుకున్నాకే మెట్రో రైలెక్కాల్సి ఉంటుంది ఎందుకంటే... ఈ స్టేషన్లలో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. రూ.100 కోట్లు వెచ్చించి ఒక్కో స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. తొలిదశలో ప్రారంభం అవుతున్న మియాపూర్‌ - నాగోలు మార్గంలో 26 స్టేషన్లను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. స్టేషన్‌ లోపల రిటైల్‌ షాపులు తదితర సౌకర్యాలు కల్పించారు. కానీ... మరుగుదొడ్ల సౌకర్యం మాత్రం దారుణంగా ఉంది. మియాపూర్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లు మినహా మిగతావన్నీ రెండంతస్తులే. తొలి అంతస్తులోని కొద్దిభాగానికి టిక్కెట్‌ లేకుండానే వెళ్లొచ్చు. ఇంకా లోపలికి వెళ్లాలంటే, టిక్కెట్‌ కొనుక్కుని ఆ కాయిన్‌ను అక్కడ ఉండే గేటు దగ్గరి బాక్సులో వేయాలి.
ఒక్కో స్టేషన్‌ను 15 -75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రెండో అంతస్తులో రైళ్లను ఎక్కడానికి ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు.

 ఆరు వేల మంది ప్రయాణికుల అవసరాలు బేఖాతర్

ఆరు వేల మంది ప్రయాణికుల అవసరాలు బేఖాతర్

తొలుత మొదటి అంతస్తులోగానీ, రెండో అంతస్తులోగానీ ఎక్కడా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించలేదు. తీవ్ర విమర్శలొస్తాయన్న ఉద్దేశంతో... మొదటి అంతస్తులోని టిక్కెట్‌ కౌంటర్లకు వెనుక భాగంలో, పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఒక్కో మరుగుదొడ్డిని ఏర్పాటుచేశారు. ఇవి ఎక్కడ ఉన్నాయో తెలిపే మార్గ సూచీలు మాత్రం లేవు. వీటిని చేరుకోవాలంటే తొలి అంతస్తులోని వరండాలో చివరివరకూ వెళ్లి, చిన్న సందులోంచి స్టేషన్‌ వెనుకవైపునకు మలుపు తిరిగితే గానీ మరుగుదొడ్డి సౌకర్యం కనిపించదు. మహిళలకు అంత సురక్షితంగా అనిపించడంలేదు. పురుషుల మూత్రశాలను ఒకేసారి నలుగురికి మించి ఉపయోగించుకునే వెసులుబాటు లేదు. మరుగుదొడ్లు మాత్రం రెండు ఉన్నాయి. ఆరు వేల మంది వరకూ ప్రయాణికుల తాకిడి ఉండే స్టేషన్‌కు ఇవేమాత్రం సరిపోవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రైళ్లలోనూ ఈ సదుపాయం లేదు. చాలా స్టేషన్ల బయట కూడా కనుచూపు మేరలో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం గమనార్హం. అన్ని స్టేషన్ల కింది భాగంలో మెట్రో సంస్థగానీ, జీహెచ్‌ఎంసీగానీ వీటిని ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
Suspense will continued upto 23rd of this month on Hyderabad Metro Rail project inaguration because clarity comes on safety certificate. Once Safety Certificate issued then PMO will clear Hyderabad tour particularly inaguration of Hyderabad Metro.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X