వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు భజన పార్టీ కాదా, పవన్‌ను చూస్తే భయం: డైరెక్టర్ తమ్మారెడ్డి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ పాలసీలను ప్రకటించక ముందే భజన పార్టీగా జనసేనను పోల్చడం ఎంతవరకు సమంజసమని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన సమయంలో భజన పార్టీగా గుర్తుకు రాలేదా అని పరోక్షంగా బిజెపిపై తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. పనిచేసేవారిని చేయనివ్వాలని తమ్మారెడ్డి కోరారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ యాత్ర ప్రారంభమైన కొద్ది సేపటికే రెండు జాతీయ పార్టీల నాయకులు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ పర్యటనపై విమర్శలు గుప్పించడాన్ని తమ్మారెడ్డి భరద్వాజ తప్పు బట్టారు.

లోకేష్‌కు బంపర్ ఆఫర్: 2019లో త్యాగానికి సిద్దమన్న ఇద్దరు మంత్రులెవరు?లోకేష్‌కు బంపర్ ఆఫర్: 2019లో త్యాగానికి సిద్దమన్న ఇద్దరు మంత్రులెవరు?

పవన్ కళ్యాణ్ పర్యటనపై రాజకీయ పార్టీల విమర్శలపై సోషల్ మీడియాలో తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాలను పంచుకొన్నారు. పవన్ కళ్యాణ్ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతారనే ఉద్దేశ్యంతోనే కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారుత.

మద్దతిచ్చినప్పుడు భజన పార్టీగా గుర్తు లేదా

మద్దతిచ్చినప్పుడు భజన పార్టీగా గుర్తు లేదా

2014 ఎన్నికల సమయంలో మీ పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచిన సమయంలో జనసేన భజన పార్టీ అని గుర్తుకు రాలేదా అంటూ ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పరోక్షంగా బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభం కాకముందే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించడాన్ని తమ్మారెడ్డి భరద్వాజ తప్పుబట్టారు. ప్రస్తుతం పవన్ పార్టీ భజన పార్టీగా మారిందా అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు.

 పార్టీ విధానాలు ప్రకటించకుండానే విమర్శలా

పార్టీ విధానాలు ప్రకటించకుండానే విమర్శలా

పవన్ కళ్యాణ్ తన పార్టీ విధానాలను ప్రకటించక ముందే ఈ రకంగా విమర్శలు చేయడం సహేతుకం కాదని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. యాత్ర ప్రారంభిచనున్న కొండగట్టుకు కూడ చేరకముందే రెండు జాతీయ పార్టీలు మీడియాలో పవన్‌పై విమర్శలు చేయడం సరైందేనా అంటూ ప్రశ్నించారు. పవన్ తన పార్టీ విధానాలను ఇంకా ప్రకటించలేనే లేదని , అప్పడే రెండు జాతీయ పార్టీలు పోటీలు పడి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని తమ్మారెడ్డి భరద్వాజ తప్పుబట్టారు.

 పవన్‌ను చూసి భయపడుతున్నారు

పవన్‌ను చూసి భయపడుతున్నారు

జనసేన 2019 ఎన్నికల నాటికి రాజకీయంగా బలపడుతోందని భావించిన పార్టీలు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో కూడ పవన్ కళ్యాణ్ శక్తిగా ఉంటాడని భావించి ఆయన మద్దతును తీసుకొన్నారని చెప్పారు. మరో వైపు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ శక్తి రాజకీయంగా తమకు నష్టం కల్గిస్తోందనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నాయని కాంగ్రెస్, బిజెపిలపై తమ్మారెడ్డి భరద్వాజ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

విమర్శించే ముందు ఆలోచించుకోవాలి

విమర్శించే ముందు ఆలోచించుకోవాలి

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ పరోక్షంగా కాంగ్రెస్, బిజెపి నాయకులకు సూచించారు. తాము ప్రజలకు ఏం చేశామో కూడ చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత కాలం పాటు దేశాన్ని పాలించిన పార్టీలు ఏ మేరకు ప్రజలకు న్యాయం చేశాయో తెలుసునని తమ్మారెడ్డి భరద్వాజ ఎద్దేవా చేశారు.

పవన్ ఏం చేస్తారో చూడాలి

పవన్ ఏం చేస్తారో చూడాలి

పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉందని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. దేశం గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రాజకీయాలను ముందుకు తెస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు , కనీసం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

English summary
Tollywood director Tammareddy Bharadwaja has slammed the Congress in Telangana and BJP in Andhra Pradesh for criticising Jana Sena chief Pawan Kalyan before he could make an announcement regarding party policies and alliances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X