• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఎన్నారై టెక్కీ చేయూత

By Vamsi Krishna
|

అమరావతి/హైదరాబాద్: ఎంత డబ్బుంటేనేం సాయం చేసే గుణం లేకపోతే సర్వం వ్యర్ధం అంటారు. అదే ఒక్క మంచి ప‌ని చేస్తే సమాజమంతా ప్రశంసిస్తుంది. డ‌బ్బు చాలా మంది సంపాదిస్తారు. కానీ సాయం చేసే గుణం మాత్రం కొంద‌రికే ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో ఒకరు తెలంగాణా రాష్ర్టం వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయురాలు "శైలజా తాళ్లూరి" గారు.

పేదరికం బాల్యాన్ని ఎలా చిదిమేస్తుందో చిన్నప్పుడు చూసిన అనుభవాల్ని గుర్తుపెట్టుకుని పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదనే ఉద్ధేశ్యంతో PURE(People for Urban and Rural Education) అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి చదువు మీద ఆసక్తి ఉన్నా ఆర్ధిక స్థోమత లేక చదువు కోలేని ఎందరికో చదువుకునేందుకు మార్గం చూపిస్తున్నారు.

ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాల దత్తతతో మొదలైన ఆమె సేవాగుణం ఇప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభైరెండు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకునే స్థాయికి చేరుకుంది.ఇవే కాక 31స్కూళ్లలో గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు.

వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ ఉపాధ్యాయురాలు అభ్యర్ధినతో మొదలు

వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ ఉపాధ్యాయురాలు అభ్యర్ధినతో మొదలు

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు తమ 300మంది విద్యార్థులకు చదువుకునేందుకు పుస్తకాలు కావాలని అభ్యర్ధించగా.. శైలజ గారు పుస్తకాలతోపాటూ, భోంచేయడానికి ప్లేట్లూ, మంచినీళ్ల సదుపాయం.. సమకూర్చి అలా ఆమె సేవను మొదలుపెట్టారు.

అన్నం ఎలా అయినా తింటాం.. పుస్తకాలు ఇప్పించండి

అన్నం ఎలా అయినా తింటాం.. పుస్తకాలు ఇప్పించండి

వాట్సాప్‌ గ్రూపులో ఉపాధ్యాయురాలుకి ఫోన్ చేసి అడగగానే అవసరమైన పుస్తకాలు లేవనీ వినగానే అయ్యో అనిపించింది. అవి మాత్రమే కాదు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం తినేందుకు అవసరమైన ప్లేట్లు వాళ్లకు లేవనగానే జాలేసింది చివరకు పిల్లల్ని పుస్తకాలు కావాలా? తినడానికి ప్లేట్లు కావాలా అని అడిగితే...‘‘అన్నం ఎలా అయినా సర్దుకుని తింటాం. ఒక ప్లేట్‌లో నలుగురం తింటాం. కానీ పుస్తకాలే లేవు.. అవి ఇప్పించండి చాలు" అన్నారు. వారి ఆలోచనకు కళ్లలో నీళ్లు తిరిగి అప్పటికప్పుడు నేనూ, నా స్నేహితులూ కలిసి ఆ మూడువందల మంది పిల్లలకు ప్లేట్లూ, పుస్తకాలు అందించాం. క్రమంగా మంచినీటి ఆర్వోప్లాంటూ, పాఠశాల భవనానికి మరమ్మతులు కూడా చేయించాం.

ఇంట్లో పనిచేసే పని అమ్మాయే స్ఫూర్తిగా..

ఇంట్లో పనిచేసే పని అమ్మాయే స్ఫూర్తిగా..


శైలజా గారు, తన చిన్నప్పుడు నెల్లూరులో ఉండే సమయంలో వాళ్ల ఇంట్లో పనిచేసే దేవీ అనే అమ్మాయికి చదువు మీద ఆసక్తి ఉన్నా.. ఆర్ధిక స్థోమత లేక ఆ అమ్మాయిని వారి ఇంట్లో పనికి కుదరగా శైలజ గారి తల్లి ఆ అమ్మాయిని పాఠశాలలో చేర్పించి చదివిస్తుండగా అమ్మాయి సవతి తల్లి ఆమెను బలవంతంగా తీసుకెళ్లగా అప్పుడే ఇలాంటి వారికి కుదిరితే సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది.

పెళ్లై అమెరికా వెళ్లిపోయాక..

పెళ్లై అమెరికా వెళ్లిపోయాక..

వరంగల్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయ్యాక మా వారితో పాటు అమెరికా వెళ్లిపోయి అక్కడే ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్‌ లీడ్‌గా పని చేస్తూ ఇక్కడి వాళ్లు ఏదైనా అడిగితే కాదనకుండా చేసేదానినని ఆమె చెప్పింది.

'ప్యూర్‌ ఆన్‌లైన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభం

'ప్యూర్‌ ఆన్‌లైన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభం

తరచూ ఎవరైనా సాయం అంటూ రాగానే కొంతమంది స్నేహితులతో కలిసి అడిగింది చేసేవాళ్లం. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికసాయం అందించడం మొదలుపెట్టాం.అయితే మేం ఫలానా దానికోసం అంటూ ఇచ్చిన డబ్బు కాస్తా నిర్వహణా ఖర్చులకో, మరో దానికో సరిపోవడం చూశాక కాస్త బాధనిపించి అప్పుడు ‘ప్యూర్‌ ఆన్‌లైన్‌' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను.
ప్యూర్‌ సంస్థను రిజిస్టర్‌ చేయించాక అనేక పాఠశాలలలో కనీస వసతులు లేకపోవడం చూశాం.అలా ఉన్న వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నలభై రెండు పాఠశాలల్ని దత్తత తీసుకున్నాం. మేం చేసిన వాటిల్లో వరంగల్‌ జిల్లాలోని మొగిలిచర్ల ఒకటి. అక్కడ ఉన్న విద్యార్థుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న రైతు బిడ్డలే. తల్లి లేదా తండ్రి(సింగిల్‌పేరెంట్‌) సంరక్షణలో పెరుగుతున్నవారే. అక్కడ అవసరమైన బెంచీలూ, కుర్చీలు.. అందించాం. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ఓ సైన్స్‌ల్యాబ్‌నీ ఏర్పాటు చేశాం. మరుగుదొడ్లూ కట్టించాం. పాఠశాలకు వచ్చే దూరప్రాంత విద్యార్థినులకు సైకిళ్లూ ఇచ్చాం.

ఇప్పటివరకు నాలుగువేల మంది చిన్నారులకు సాయం

ఇప్పటివరకు నాలుగువేల మంది చిన్నారులకు సాయం

అవసరాన్ని బట్టి ఫేస్‌బుక్‌ ద్వారానే పేద విద్యార్థుల అవసరాలను తెలుసుకుని దాతల సాయంతో వాళ్లకు ఏం కావాలో ఇస్తాం. ఇలా ఇప్పటివరకూ ఎనభై లక్షల రూపాయల్ని మా సేవాకార్యక్రమాల కోసం ఖర్చుచేశాం. నాలుగువేల మంది చిన్నారులకు సాయం అందించగలిగాం. ఇక్కడ అవసరమైన ఏర్పాట్లలో మా అమ్మతోపాటూ విజయ్‌, శ్రీధర్‌ అనే స్నేహితులు.. సాయం అందిస్తున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొస్తున్నారు.

పొందిన అవార్డులు

పొందిన అవార్డులు

ATA Award for Community Services, TANA Award of Excellence, COTA Pravasi Excellence Award, హరీష్ రావు గారి చేతుల మీద గా India Vikas Award , Telangana govt cultural director sathkaram వంటి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు అతి తక్కువ కాలంలో లభించడం కేవలం "చదువు" వలనే కుదిరింది అని "శైలజా తాళ్లూరి" గారు అంటారు.

English summary
NRI techie Sailaja Talluri helped four thousand students with PURE organisation in telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X