వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో టీఎంసీ రహస్య భేటీలు: రైటర్స్ బిల్డింగ్స్‌లో పాగా లక్ష్యం

మళ్లీ 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా 95 రోజుల పాటు దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన అమిత్ షా కంఠం ‘ఈ బార్ బంగ్లా’ అంటూ ఖంగుమంటూ మోగింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: మళ్లీ 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా 95 రోజుల పాటు దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన అమిత్ షా కంఠం 'ఈ బార్ బంగ్లా' అంటూ ఖంగుమంటూ మోగింది. దేశవ్యాప్త పర్యటనకు గత నెలలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శ్రీకారం చుట్టినప్పుడు అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) కలవరపడింది.

జాతీయ స్థాయిలో ప్రతి వ్యూహ రచనలో నిమగ్నమైంది. జాతీయ స్థాయిలో టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ దానిమీద స్పందించారు. ఈ పరిస్థితుల్లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

సుఖేందు శేఖర్ రాయ్ స్పందన ఎలా ఉన్నా.. పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలోని కొంతమంది సభ్యులు సహా ఇటీవలి కాలంలో పలువురు టీఎంసీ సీనియర్ నాయకులు ప్రతిరోజూ అర్థరాత్రి తర్వాత రహస్యంగా లక్నోకు వెళ్లి వస్తున్నారు. త్రుణమూల్ కాంగ్రెస్ నేతలు ఇలా ఎందుకు చేస్తున్నారన్న విషయం చాలాకాలం పాటు ఎవరికీ అర్థం కాలేదు. చివరకు తేలింది ఏమిటంటే గతంలో పశ్చిమబెంగాల్‌లో చురుగ్గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు ఒకరు ఇటీవలే లక్నోకు వెళ్లిపోయారట.

శారదా స్కీంపై కేంద్రం ఇలా

శారదా స్కీంపై కేంద్రం ఇలా

పశ్చిమ బెంగాల్ లో పార్టీ రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించిన ఆ సీనియర్ బీజేపీ నేత ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన అక్కడకు వెళ్లారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో గత ఏడాది వెలుగు చూసిన నారద స్టింగ్ ఆపరేషన్ కేసును, అంతకు ముందు బయట పడిన శారదా చిట్‌ఫండ్ స్కాం కేసును తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ రెండు కేసులను వదిలేది లేదని స్పష్టం చేస్తోంది.

బెంగాల్‌లో మారిపోతున్న రాజకీయ పరిణామాలు

బెంగాల్‌లో మారిపోతున్న రాజకీయ పరిణామాలు

ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపి ప్రభుత్వం.. శారదా, నారదా కుంభకోణాల సహాయంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో.. కోల్ కతాలోని రైటర్స్ బిల్డింగ్ లోకి అధికార లాంఛనాలతో అడుగు పెట్టాలని కలలు కంటోంది. ఈ నేపథ్యంలో దాంతో ఎలాగోలా లక్నోలో ఉన్న బీజేపీ పెద్దాయనను ప్రసన్నం చేసుకుని ఆ కేసుల నుంచి బయటపడాలన్నది టీఎంసీ నాయకుల ఉద్దేశంలా కనిపిస్తోంది. గత నెల రోజులుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతల మధ్య పరస్పర ఆరోపణల పర్వం, మాటల యుద్ధం సాగుతోంది. అవసరమైతే.. టీఎంసీ నుంచి బయటపడి, బీజేపీలో చేరిపోతామని కూడా వాళ్లు రాయబారాలు నడుపుతున్నారట. కానీ.. బీజేపీ మాత్రం మచ్చపడ్డ నాయకులను తీసుకునేది లేదని తెగేసి చెబుతోంది. 'నో నారదా - శారదా ఇన్ బీజేపీ' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఇప్పటికే స్పష్టం చేశారు.

శారదా, నారదా నిందితులకు డోర్స్ క్లోజ్

శారదా, నారదా నిందితులకు డోర్స్ క్లోజ్

శారదా చిట్ ఫండ్, నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులను సీబీఐ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో సుప్రీంకోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేసేశారు. తద్వారా ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న నేతలు బయట పడకుండా అన్ని వైపులా సీబీఐ తలుపులూ మూసేసినట్లు సమాచారం. ఈ రెండు కేసుల దర్యాప్తు న్యాయస్థానాల ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగానే సాగుతుండటం గమనార్హం.

ఆద్వానీ సారథ్యంలోని కమిటీపైనే టీఎంసీ భవితవ్యం

ఆద్వానీ సారథ్యంలోని కమిటీపైనే టీఎంసీ భవితవ్యం

ఈ స్కాంను బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో ఉన్న పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ అంశం ఏడాది కాలంగా పార్లమెంటరీ స్థాయీ సంఘం వద్ద పెండింగ్ లో ఉన్నది. స్కాంలో పాత్ర ఉందని తెలిస్తే ఎంపీల మీద కూడా గట్టి చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అస్త్రం బీజేపీకి 2019 ఎన్నికల్లో బాగా ఉపయోగపడేలా కనిపిస్తోంది. బెంగాల్‌లో అధికారం చేపట్టేంత పరిస్థితి లేకపోయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే చాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ రెండో స్థానంలో నిలవగా.. వామపక్షాలు, కాంగ్రెస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి.

బెంగాల్ లోనూ ఇదీ బీజేపీ వ్యూహం

బెంగాల్ లోనూ ఇదీ బీజేపీ వ్యూహం


గత మూడేళ్లుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు వల విసిరి.. వ్యూహాత్మక విధానాల అమలు ద్వారా అధికారంలోకి వచ్చిందీ బీజేపీ. కానీ పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి విషమిస్తున్నదని బీజేపీ సీనియర్ నేత తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. దీంతో 2014 ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో గెలిచిన స్థానాల్లో కొన్ని స్థానాల్లో 2019 ఎన్నికల్లో గెలుపొందడం అనుమానంగా మారింది.

టీఎంసీకి ధీటుగా ఎదగాలని బీజేపీ ఆశలు

టీఎంసీకి ధీటుగా ఎదగాలని బీజేపీ ఆశలు

కానీ బెంగాల్ గడ్డపై కొన్ని స్థానాల్లో పాగా వేయాలన్నది కమలనాథుల వ్యూహం. దీనికి తోడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు క్రమంగా పట్టు కోల్పోతున్నాయి. దీంతోనే బీజేపీ 2019 ఎన్నికలకు పూర్తిస్థాయి సంస్థాగత వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2019 లోక్ సభ ఎన్నికలు అధిక స్థానాలు గెలుచుకోవడంతోపాటు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో గెలుపొందకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు కమలనాథులు.

English summary
'Ebar Bangla' roared Amit Shah launching his 95-day countrywide campaign from Kolkata last month. In retaliation, Trinamool Congress (TMC), facing the BJP onslaught, has delved into Delhi's turbulent history to launch a counter offensive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X