వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర కోసం జగన్ కార్యాచరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకున్న వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణకు దిగారు. విభజనకు వ్యతిరేకంగా ఆయన సోదరి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు. ఆయన తల్లి వైయస్ విజయమ్మ నిరాహార దీక్ష చేపట్టారు.

ఆ తర్వాత హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో జగన్ నిరాహార దీక్ష చేపట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన ఇంటి వద్ద దీక్షకు దిగారు. తెలంగాణలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆయన సమైక్యాంధ్ర నినాదం వల్ల తెలంగాణ ప్రాంత నాయకులు పార్టీని వీడారు.

YS Jagan

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి మద్దతును కూడగట్టేందుకు వివిధ రాష్ట్రాలు పర్యటిస్తూ వివిధ పార్టీల నాయకులను కలిశారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీని, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను, వామపక్షాల నేతలను ఆయన కలిశారు.

సమైక్యాంధ్ర కోసం జగన్ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వార్తలు చదవండి..

డిసెంబర్ 10: జగన్ సమైక్యం: పనిగట్టుకుని ఇలా తిరిగారు (పిక్చర్స్)

డిసెంబర్ 4: విభజన: జయలలితతో జగన్, చెన్నైలోనూ ఘనస్వాగతం

నవంబర్ 26: ముంబైలో జగన్‌కు టి సెగ, ఎగబడ్డ మహిళలు(పిక్చర్స్)

నవంబర్ 25: జగన్‌కు శరద్ పవార్ షాకిచ్చారా? పనిలో పనిగా హెలెన్

నవంబర్ 25: జగన్‌కు పట్నాయక్ మద్దతు, 20నిమిషాలు ఇంట్లో భేటీ

నవంబర్ 23: జగన్ భేటీ: తెలంగాణపై తేల్చని శరద్ యాదవ్

నవంబర్ 23: విభజనపై అన్నీ చెప్పా, నమ్మకం: ప్రణబ్‌తో జగన్ భేటీ

నవంబర్ 20: వైయస్ జగన్ కోరాడు, దీదీ సరేనన్నారు (పిక్చర్స్)

నవంబర్ 20: జగన్‌కు టిపై మమత బెనర్జీ హామీ, తమ్ముడన్న దీదీ

నవంబర్ 18: అప్పుడే ఆలోచిస్తా: నేతలకు జగన్ క్లాస్, టిలోను మనం

నవంబర్ 16: టీపై వెనక్కి వెళ్లం: జగన్‌కు తేల్చి చెప్పిన సురవరం

English summary
YSR Congress party president YS Jagan is batting for united Andhra, opposing the bifurcation of Andhra Pradesh and creation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X