వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుడితిలో పడిన ఎలుక చంద్రశేఖరరావు సోన     లోగుట్టు    కుడితిలోపడిన ఎలుక చంద్రశేఖరరావుసోనియాగాంధీపైటిఆర్‌ఎస్‌ అధినేత,

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగుసినిమా ప్రముఖుడు, కేంద్ర బొగ్గు గనులశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డిపై సన్నిహితుల వద్దకారాలు మిరియాలు నూరుతున్నారు. దాసరినిన్న సింగరేణి సమ్మెనుపరిష్కరించడంలో విజయం సాధించారు. ఆఉత్సాహంలో ఆయన జూనియర్‌ డాక్టర్లసమ్మె పరిష్కారంలో వైఎస్‌ ప్రభుత్వంవిఫలమైందని, తానైతే ఒక్కరోజులో దానినిపరిష్కరించి ఉండేవాడినని అతిశయంవెళ్ళగక్కుతున్నారు. దాసరి నారాయణరావుకు అధిష్టానవర్గంవద్ద ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో కాలంగాసేవ చేస్తున్నారని, ఆయన కులానికి చెందిన వారి సంఖ్య రాష్ట్రంలో అత్యధికసంఖ్యలో ఉందని అధిష్టానవర్గం వద్ద నివేదికలు ఉన్నాయి.దాసరికి కూడా ముఖ్యమంత్రి పదవి మీదమోజు ఉంది. సిఎం అయితే కొన్ని పెద్దసమస్యలను సినిమాఫక్కీలో ఒక్కరోజులో పరిష్కరించవచ్చని ఆయనవిశ్వాసం.

కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌కటీఫ్‌ ఖాయమేనా?

టిఆర్‌ఎస్‌అధినేత చంద్రశేఖరరావుకు,ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికిఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఏర్పాటు చేసినసమావేశం ఫలప్రదమయ్యేఅవకాశం లేదు. ఆ విషయం టిఆర్‌ఎస్‌ నాయకులకుఅర్ధమైపోయింది. ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకురెండో ఎస్సార్సీకి చంద్రశేఖరరావుఒప్పుకున్నారని, ఇప్పుడాయన మాటతప్పుతున్నారని వైఎస్‌రాజశేఖరరెడ్డి అన్నారు. చంద్రశేఖరరావు ఎత్తులను చిత్తుచేయడానికి వైఎస్‌ దీనినే తురుపుముక్కలా ఉపయోగించుకోనున్నారు. ఆనాడు చంద్రశేఖరరావు సంతకాలుచేసినపత్రాలు త్వరలో బహిర్గతంకానున్నాయి. 18న టిఆర్‌ఎస్‌ బహిరంగసభకు ముందు రోజు వీటిని బయటపెట్టాలనికాంగ్రెస్‌ నాయకుల వ్యూహం. అదే జరిగితేచంద్రశేఖరరావు, నరేంద్రకేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుంది.

గుభాళిస్తున్నతమిళ పరిమళం

తెలుగు అగ్రహీరోల సినిమాలు ఫ్లాప్‌ కావడం, తమిళహీరోల సినిమాలు ఇక్కడ బాగా ఆడడంతెలుగు హీరోల అభిమానులకు మస్తాపంకలిగిస్తోంది. రజనీకాంత్‌ చంద్రముఖి,విక్రం అపరిచితుడు తెలుగులోవిజయవంతమయ్యాయి. ఈసంవత్సరం సూపర్‌ హిట్‌ అయిననువ్వు వస్తానంటే నేనొద్దంటానా,మాస్‌ సినిమాల దర్శకులుప్రభుదేవా, లారెన్స్‌లు తమిళులే.తమిళులకు ఉన్న భాషాభిమానం తెలుగువారికి లేదు. అక్కడ సినిమాలకు ఇంగ్లీషుటైటిల్స్‌ పెట్టడానికి వ్యతిరేకంగాఉద్యమాలు జరుగుతుంటే, ఇక్కడ మాస్‌,డేంజర్‌, సూపర్‌ వంటి టైటిల్స్‌ వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X