వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మొద్దుశీను- పోలీసులు' అనే హారర్‌ హాస్     లోగుట్టు    'మొద్దుశీను-పోలీసులు' అనే హారర్‌ హాస్యచిత్రంమొద్దుశీను

By Staff
|
Google Oneindia TeluguNews

ఫ్లాష్‌బ్యాక్‌సత్తెన్న అలియాస్‌ ఎంసత్యనారాయణరావు అసంతృప్తిఅలాగే ఉండిపోయింది. కాటికి కాళ్ళు సాచేవయసు వచ్చినా తనకు మంచి శాఖఇవ్వలేదని ఆయనకు వైఎస్‌ మీద కోపం.దేవాదాయ శాఖ ఏ మాత్రం నచ్చని ఎమ్మెస్‌దేవుడి మీద భారం వేసి కొంతకాలం నెట్టుకొచ్చారు. పివినరసింహారావుసమకాలికుడినైన తాను ఎమ్మెల్యేగాపోటీ చేయడం తప్పయి పోయిందనిఆయన అనేక సార్లు బహిరంగంగాబాధపడ్డారు. ఎంపీగా పోటీ చేసి ఉంటేకేంద్ర మంత్రి అయి ఉండేవాడినని ఆయనఅనుకుంటున్నారు. మిగితా మంత్రులతో పోలిస్తేనిజాయితీపరుడైనసత్యనారాయణ రావు అంటేఅధికారులకు భయమే. అధికారులుతనను ఎక్కడ తప్పుదోవ పట్టిస్తారోననిఆయనకు కూడా వారిని చూస్తే భయమే.

తమిళనాడుథియేటర్లలో టెక్‌ విప్లవం!

సినిమాలపైరసీని నిరోధించడానికి తమిళనాడులోఒక ప్రయోగం జరగబోతోంది. ఉపగ్రహం ద్వారాసినిమాలను థియేటర్లలోప్రదర్శించే టెక్నాలజీ అక్కడ రాబోతోంది. దేశంలోనే మొదటిసారిగా అక్టోబర్‌నుంచి తమిళనాడులో ఈ టెక్నాలజీఅందుబాటులోకి రానుందని దర్శకుడు,నటుడు పిరమిడ్‌ నాగరాజన్‌ విలేకరులసమావేశంలో చెప్పారు. శాటిలైట్‌ ద్వారాప్రొజెక్టర్లలోకి సినిమాలువచ్చిపడతాయని, ఈ టెక్నాలజీ అమెరికాలో కూడారానుందని ఆయన తెలిపారు. దీనివల్లసినిమా ప్రింట్ల మీద ఖర్చు చేయాల్సినఅవసరముండదని ఆయన అన్నారు. సినిమాబడ్జెట్‌లో 22 శాతం ఆదా అవుతుందని చెప్పారు.సాయి మీరా థియేటర్‌ అనే తమ సంస్ధతమిళనాడులో 167 థియేటర్లను ఐదేళ్ళ పాటులీజుకు తీసుకుని శాటిలైట్‌ ద్వారా సినిమాలను ప్రదర్శించాలనుకుంటున్నట్టునాగరాజన్‌ వెల్లడించారు.

తెలంగాణఉద్యమం హింసాత్మకం?

అక్టోబర్‌మూడున సంభవించనున్న సూర్యగ్రహణం శాంతికి విఘాతంకలిగిస్తుందని, హింసాకాండ చెలరేగుతుందని జ్యోతిషులుహెచ్చరిస్తున్నారు. 1987 సెప్టెంబర్‌ 23నవచ్చిన సూర్యగ్రహణం వల్ల కాశ్మీరువేర్ఫాటు ఉద్యమం హింసాత్మకంగా మారిందని, ఈసారివచ్చే గ్రహణం వల్లప్రత్యేక తెలంగాణ ఉద్యమంహింసాత్మకంగా మారే ప్రమాదముందని జ్యోతిష్యుడుజె.ఉదయ భాస్కర శాస్త్రి చెప్పారు. తెలంగాణఉద్యమాన్ని టిఆర్‌ఎస్‌ హింసాత్మకంగామార్చకపోవచ్చని, ఉద్యమంలోకి కొన్నిశక్తులు ప్రవేశించి హింసను ప్రేరేపిస్తాయని ఆయన తెలిపారు.తెలంగాణ ప్రాంత గ్రహస్ధితి బాగుండలేదని, ఈ ప్రాంతంలో హింసచెలరేగే అవకాశముందని మరోజ్యోతిషుడు ఎం. రమణారావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X