వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మొద్దుశీను- పోలీసులు' అనే హారర్‌ హాస్     లోగుట్టు    'మొద్దుశీను-పోలీసులు' అనే హారర్‌ హాస్యచిత్రంమొద్దుశీను

By Staff
|
Google Oneindia TeluguNews

జీవితచరిత్ర రాస్తానంటూ వచ్చి ఎన్టీఆర్‌ జీవిత భాగస్వామిగామారిన లక్ష్మీపార్వతి ఇంకా ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పూర్తిచేయలేదు.త్వరలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపుస్తకాన్ని విడుదల చేస్తానని ఆమె చెబుతున్నారు కానీపుస్తకంవిడుదల కాలేదు. జీవిత చరిత్రరాయడానికి పదేళ్ళు పడుతుందాఅన్నది ప్రశ్న. లక్ష్మీపార్వతి ఫక్కీలోఇటీవల ఒక మహిళ ఒక ప్రముఖనిర్మాతను కలుసుకుని ఆయన జీవిత చరిత్ర రాస్తానందట. అయనఎన్టీఆర్‌కుపట్టిన దుస్ధితిని తలుచుకుని, తనజీవిత చరిత్ర రాయాల్సిన అవరం లేదని,ఆమె పంపేసినట్టు తెలిసింది. లక్ష్మీ పార్వతి ఇప్పుడేంచేస్తున్నారు?అపుడప్పుడూ తానూ ఉన్నానంటూ పత్రికాప్రకటనలు జారీ చేస్తోంది.

చంద్రశేఖరరావుఛమత్కారం!

టిఆర్‌ఎస్‌అధినేత, కేంద్రమంత్రి చంద్రశేఖరరావుఉరాజకీయాల్లోకి రాకుండా ఉంటే మంచి మార్కెటింగ్‌నిపుణుడిగా రాణించేవారు.ఆయన కొంత కాలం గల్ఫ్‌ ఉద్యోగాలుఇప్పిస్తానని కరీంనగర్‌ జిల్లాలో జనం నుంచిడబ్బు వసూలు చేసినట్టు అక్కడి ప్రజలు చెబుతుంటారు.కాంగ్రెస్‌ అధిష్టానవర్గాన్ని రకరకాలమార్గాల్లో ఆయన బుట్టలో వేసుకోడానికిప్రయత్నించారు. చాలా సార్లు విజయం సాధించారు.తెలుగుదేశంలో చేరకముందుకెసిఆర్‌ కాంగ్రెస్‌లో చిన్న స్ధాయి నాయకుడిగా ఉండేవారు. అందువల్ల కాంగ్రెస్‌అధిష్టానవర్గమంటే ఆయనకుఎక్కడలేని వినయం పుట్టుకొస్తుంది. తెలంగాణవిషయంలో ఇటీవల ఆయన కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ మీదగట్టి వత్తిడి తేగలిగారు. టిఆర్‌ఎస్‌కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకున్నాఏంకానప్పటికీ దిగ్విజయ్‌ సింగ్‌ ఎందుకు లొంగారోఅర్ధం కాక ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులుతలలు పట్టుకున్నారు. వైఎస్‌ను ఫ్యాక్షనిస్టుగాఅభివర్ణించిన వ్యక్తికి ఆయనతో సమావేశమయ్యే అవకాశంకల్పించడం దారుణమని కొందరు కాంగ్రెస్‌నాయకుల అభిప్రాయం. వేలికేస్తే కాలుకేసే చంద్రశేఖరరావు కాంగ్రెస్‌ అధిష్టానంతోఆడుకుంటున్నారు.

శివాలయంగామారిన సచివాలయం

సాధారణంగాశివాలయాలు జీర్ణ దశలో ఉండి, భక్తులనుఎక్కువగా ఆకర్షించలేవు. అందువల్లపెద్ద యాక్టివిటీ లేని ఇళ్ళనైనా,వ్యాపార సంస్ధలనైనా శివాలయాల తోమన పెద్దలు పోల్చుతుంటారు. ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి విదేశ పర్యటనకువెళ్ళడంతో సచివాలయంలో సెలవు వాతావరణనెలకొంది. మంత్రులను, ముఖ్యమంత్రినికలవడానికి నిత్యం వేలాది మంది విజిటర్లుసచివాలయానికి వస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికిచెందిన అత్యున్నత స్ధాయి యాక్టివిటీసచివాలయంలో ఉంటుంది. ముఖ్యమంత్రిలేకపోవడం, నలుగురు మంత్రులు నేదురుమల్లి రాజ్యలక్ష్మి,నాయని నర్సింహారెడ్డి,పిన్నమనేని వెంకటేశ్వరరావు,కన్నా లక్ష్మీనారాయణ తానా సభలకుఅమెరికా వెళ్ళడంతో సచివాలయం బోసిపోయింది. ఇదికాకనలుగురు టిఆర్‌ఎస్‌ మంత్రులు రాజీనామాచేశారు. వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిముఖ్యమంత్రితో కలిసి విదేశాలకువెళ్ళారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X