వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Array

By Staff
|
Google Oneindia TeluguNews

వోక్స్‌వ్యాగెన్‌కుంభకోణంపై విలేకరుల సమావేశంలోముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసినవ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు పంపాయి.వోక్స్‌వ్యాగెన్‌ ప్రాజెక్టు కోసం వశిష్టవాహన్‌ అనే బోగస్‌ కంపెనీకి రాష్ట్రప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించి నిలువునామునిగింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రిదున్నపోతు మీద వానకురిసినట్టుగావ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది.వోక్స్‌వ్యాగన్‌పై ఎందుకింతహడావుడి? మిన్ను విరిగి మీద పడిందా?అయినా నన్నెందుకు ఇంటరాగేట్‌ చేస్తారు? అని వైఎస్‌వ్యాఖ్యానించారు.సాధారణంగా ఇటువంటి కుంభకోణంజరిగినప్పుడు ముఖ్యమంత్రి అన్ని వివరాలు తెప్పించుకుని,ఆ 11 కోట్లు రాబట్టడానికి మార్గాలు అన్వేషించాలి.ప్రజాధనానికి ట్రస్టీగా ఉండాల్సిన ముఖ్యమంత్రిఈ విధంగా వ్యవహరించడం ప్రజల్లోకి తప్పుడుసందేశాలు పంపింది. ఇది ఒక మంత్రి చేయగలిగే పనికాదని,ముఖ్యమంత్రికి బాగా తెలిసే ఇది జరిగిందన్నఅభిప్రాయం ఉంది. ఫేస్‌సేవింగ్‌ కోసం ముఖ్యమంత్రి, ఆ డబ్బునువేరే మార్గాల ద్వారా సేకరించి, వశిష్టవాహన్‌ నుంచి వసూలు చేసినట్టు చెప్పుకునేఅవకాశముంది.

నాయాబ్రాహ్మణులఆగ్రహం

ఏభాషకైనా సామెతలు, నుడికారాలు గుండెకాయవంటివి. అయితే కులాలను కించపరిచేసామెతలను వాడకుండా చూడాల్సినఅవసరముంది. కొన్ని శతాబాబ్దాల క్రితంజన జీవనంలో భాగంగా మౌఖికంగా పుట్టినసామెతలు మారిన కాల మానపరిస్ధితుల వల్ల నిరర్ధకమై పోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఒక టీవీ ఛానల్‌లో మాట్లాడుతూతెలుగుదేశం నాయకులు పనిలేని మంగలి పిల్లి తలకాయగొరిగినట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.దీనిపై నాయా బ్రాహ్మణ సంఘాలు అగ్గిమీదగుగ్గిలమయ్యాయి. కిరణ్‌ కుమార్‌రెడ్డి బేషరతుగా క్షమాపణచెప్పకపోతే తిరుపతి, శ్రీశైలం,అన్నవరం వంటి పుణ్యక్షేత్రాల్లోతలనీలాలు తీయడం నిలిపివేస్తామని నాయా బ్రాహ్మణులుహెచ్చరించారు.కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇంటి వద్ద ధర్మాచేయడమే గాక ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు.అనంతరం గాంధీ భవన్‌కుఊరేగింపుగా వెళ్ళారు.

టిడిపిప్రచారం ఖర్చు ఇప్పటికీ ఎక్కువే

చింతచచ్చినాపులుపు చావలేదన్నట్టుగా ఉందితెలుగుదేశం పార్టీ వ్యవహారం.పబ్లిసిటీ అంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ఎంత మోజో ప్రత్యేకంగాచెప్పనవసరం లేదు. గత ఏడాదితెలుగుదేశం పార్టీ ప్రచార వ్యయంఅక్షరాలా కోటీ అరవై లక్షలు. అంటే రోజుకిదాదాపు 45 వేల రూపాయలు. దేశంలోనిప్రాంతీయ పార్టీల్లో టిడిపిసంపన్నమైనది. టిడిపి పబ్లిసిటీఖర్చులో అధిక భాగం కార్యకర్తలకుపంపే ప్రింటెడ్‌ మెటీరియల్‌ ముద్రణ,పోస్టేజిలకు పోతోంది. తెలుగుదేశం పార్టీఅధికారంలో ఉన్నప్పుడు పబ్లిసిటీ ఖర్చుసుమారు నాలుగు వందల కోట్లు. కాంగ్రెస్‌పార్టీ పబ్లిసిటీలో ఇప్పటికీ వెనుకబడి ఉంది.అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీపబ్లిసిటీకి నెలకు చేస్తున్న ఖర్చు ఐదువేలే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X