వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Array

By Staff
|
Google Oneindia TeluguNews

సినిమావిడుదలైన రోజే టీవీ9 న్యూస్‌ ఛానల్‌సమీక్షను ప్రసారం చేసి రేటింగ్‌ ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఇటీవలేప్రవేశపెట్టారు. వెబ్‌సైట్ల పోర్టల్స్‌ ఈపద్ధతిని చాలా ఏళ్ళుగా అనుసరిస్తున్నాయి. నెట్‌ రీడర్లు మన రాష్ట్రంలోస్వల్పంకావడంతో వెబ్‌సైట్లు ఎన్నారైలను మాత్రమే ప్రభావితంచేయగలుగుతున్నాయి. నిత్యం లక్షలాదిమంది చూసే న్యూస్‌ ఛానల్‌లో సినిమారివ్యూ ఇవ్వడం వల్ల ప్రేక్షకులు పెద్దసంఖ్యలో ప్రభావితమవుతారు. ఇటీవలవిడుదలైన కాంచనమాల కేబుల్‌టీవీ సమీక్షను టీవీ9 సమీక్షించి బిలో యావరేజి రేటింగ్‌ ఇచ్చింది. తమసినిమాహిట్‌ అయిందని గొప్పగా చెప్పాలనుకున్ననిర్మాతలు టివీ9 దెబ్బకు సొమ్మసిల్లారు.ప్రతి సినిమాపై అతిశయోక్తులు రాస్తూప్రేక్షకులను దినపత్రికలు, సినిమాపత్రికలు తప్పుదోవ పట్టిస్తున్నసమయంలో టీవీ9 నిక్కచ్చిగా సినిమా సమీక్షలు ఇవ్వడం అభినందించదగినవిషయం. ఏ సినిమా ఎలా ఉందో ముందేతెలుసుకుంటే ప్రేక్షకుల విలువైనసమయం, డబ్బు ఆదా అవుతాయి.

టూరిజం శుభదృష్టిలో పుట్టపర్తి

పుట్టపర్తినిప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయించింది. 2006 నవంబర్‌లోసత్యసాయిబాబా 80 వ పుట్టినరోజువేడుకలను జరుపుకోనున్నారు. ఆకార్యక్రమానికి దేశ విదేశాల నుంచిలక్షలాది మంది భక్తులు పుట్టపర్తికితరలి రానున్నారు. అప్పటికల్లాపుట్టపర్తిని ప్రధాన పర్యాటక కేంద్రంగాఅభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జె.గీతారెడ్డి పట్టుదలగా ఉన్నారు.కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడాఆంధ్రప్రదేశ్‌కు చెందినరేణుకాచౌదరే కాబట్టి పనులు చకచకా జరిగే అవకాశముంది. ఇప్పటివరకు సాయిబాబా ట్రస్టే పుట్టపర్తిలో భక్తులకు వసతి సౌకర్యాలుకల్పిస్తోంది.ప్రభుత్వం కూడా ఒక చేయి వేస్తోందికాబట్టి భక్తులకు మరింతసౌకర్యంగా ఉంటుంది.

భీష్మించినఎమ్మెస్‌

ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డికి మింగలేకుండాకక్కలేకుండా ఉంది ఎం. సత్యనారాయణరావు వ్యవహారం. ఆయన నిన్న మళ్ళీరాజీనామా చేయడంతో ఆయనను బుజ్జగించడానికి గాదె వెంకటరెడ్డి,ద్రోణంరాజు సత్యనారాయణ వంటి సీనియర్‌నాయకులను పంపించారు.అయినా ముక్కుసూటిగా వ్యవహరించేసత్యనారాయణ రావు ససేమిరాఅన్నారు. పీవీ నరసింహారావుకున్నంతస్టేచర్‌తనకూ ఉందని ఎమ్మెస్‌ నమ్మకం.అటువంటి తాను అసెంబ్లీకి పోటీ చేయడమే తప్పని ఆయన పశ్చాత్తాపంచెందుతున్నారు. దేవాదాయ శాఖఅధికారుల అవినీతితో విసిగిపోయిన ఎమ్మెస్‌కుపదవులపైనే వైరాగ్యం ఏర్పడింది.సత్యనారాయణ పేరున్నవారందరూ కుంభకోణాల్లోఇరుక్కుంటున్నారని ఒక కొంటె విలేకరిప్రస్తావించగా ఎమ్మెస్‌కు ఉక్రోషంపొంగుకొచ్చింది. బొత్స సత్యనారాయణ తోతనను పోల్చడంపై ఆయనబాధపడ్డారు. తన అసలు పేరు వేరేఉందని, తనను దత్తత తీసుకున్నవారు ఈ పేరు పెట్టారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X