వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్‌ తరఫున ములాయం వకాల్తా అమితాబ     లోగుట్టు    అమితాబ్‌ తరఫునములాయం వకాల్తాఅమితాబ్‌బచ్చన్‌ ఆస్పత్రిలో

By Staff
|
Google Oneindia TeluguNews

పవన్‌కళ్యాణ్‌, రేణూదేశాయ్‌లకు ముద్దులకొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఇష్టపడే పవన్‌కొడుక్కి కుంగ్‌ఫూ మాస్టర్‌ అకి రా పేరుపెట్టుకున్నాడు. సుపుత్రుడు పుట్టాక పవన్‌దూకుడు తగ్గిందని, అతను ఇప్పుడు స్ధిమితంగాఆలోచిస్తున్నాడని, ఎక్కువ సమయం ఇంటి పట్టునే ఉంటున్నాడనికుటుంబసభ్యులుఆనందిస్తున్నారట. ఇక ఎన్నేళ్ళ నుంచోసుపుత్రుడి కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్‌కుఇటీవల పుత్రోదయమైంది. కొడుకుకిఆయన తన ఆరాధ్య దేవుళ్ళ, తనతండ్రి పేర్లు కలిసి వచ్చేలా అర్జున్‌రామ్‌నాథ్‌ అనే పేరు పెట్టాడు వెంకటేష్‌.ఈమధ్య వెంకటేష్‌లో ఆధ్యాత్మిక చింతనపెరిగింది. ఆయన రమణ మహర్షి భక్తుడు.సమయం దొరికినప్పుడల్లా కొడుకుతోఆటలాడుకుంటున్నాడట వెంకటేష్‌.

జయప్రదతోనేపోయిందా?

జయప్రద తెలుగుదేశంపార్టీని విడిచి మరో సైకిల్‌ పార్టీ సమాజ్‌ వాదిపార్టీలో చేరినప్పటి నుంచి చంద్రబాబు నాయుడి సైకిల్‌ వెనక్కినడుస్తోంది.ఆడపిల్ల మన ఇల్లు వదిలిపోయినప్పుడు కొన్నిసార్లు అశుభంజరుగుతుందని,అవతలి వారికి కలిసివస్తుందనిమనవాళ్ళు నమ్ముతారు. జయప్రదసమాజ్‌వాది పార్టీటికెట్‌ మీద సైకిల్‌గుర్తు మీద యుపిలోని రాంపూర్‌ నుంచిలోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు సమాజ్‌వాదిపార్టీ మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర తదితరరాష్ట్రాలకు విస్తరించడంతో దానికి జాతీయపార్టీ హోదా లభించింది. సమాజ్‌వాది, తెలుగుదేశంపార్టీల ఎన్నికల గుర్తు సైకిలే.ఇప్పటివరకు రెండూ ప్రాంతీయ పార్టీలుకాబట్టి ఎన్నికల చిహ్నం విషయంలో పేచీరాలేదు. ఇప్పుడు ములాయం సింగ్‌ నాయకత్వంలోనిసమాజ్‌వాది పార్టీకి జాతీయ హోదా రావడంతో తెలుగుదేశంసైకిల్‌కు ఎసరు వచ్చింది. ములాయం, చంద్రబాబుస్నేహితులు కాబట్టి ఏదో విధంగా సైకిల్‌పోకుండా చూసుకుంటామని తెలుగు తమ్ముళ్ళునమ్మకంతో ఉన్నారు. కానీ ఎంత స్నేహితుడైతేమాత్రం ములాయం పార్టీకిప్రాణప్రదమైన ఎన్నికల చిహ్నాన్ని వదులుకుంటాడా?తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటేకదా!

యమహోరుచి ఎము పక్షి

గ్లోబలైజేషన్‌ఫలితం మిగితా రంగాల్లో లాగానే ఆహారంలోనూకన్పిస్తోంది. అత్యంత రుచికరమైనఎము పక్షి మాంసం వంటకాల స్పెషల్‌రెస్టారెంట్‌ కుకట్‌పల్లి కాలనీలో వెలసింది.ఆస్టేలియా జాతికి చెందిన ఎముపక్షిని గతపదేళ్ళుగా నగర శివారుల్లోని ఫామ్స్‌లోపెంచుతున్నారు. ఇవి ఐదు నుంచి ఆరుఅడుగుల ఎత్తు ఉంటాయి. వీటి మాంసానికివిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.హైదరాబాద్‌లో ఉన్న డిమాండ్‌ కూడా తక్కువేమీకాదు. ఎము మాంసం వంటకాలకు మంచిరేటు పలుకుతోంది. కుకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో పెట్టిన రెస్టారెంట్‌లోఎముబిర్యానీ, ఎము ఫ్రై, ఎము కీమా బాల్స్‌ లభిస్తున్నాయి.ఎము పక్షిని ఆ్రస్టేలియా 1942 లోనే జాతీయ పక్షిగా ప్రకటించడంతో అక్కడఎమును తినడం నిషేధం. ఎము పక్షికొవ్వు నుంచి తీసిన నూనెలో ఔషధగుణాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X