వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

టబుతో నాగార్జున మళ్ళీ వ్యవహారం సాగిస్తున్నారన్న వార్తలు ముంబాయి మీడియా నుంచి ప్రయాణించి హైదరాబాద్‌ చేరుకున్నాయి. నాగార్జునకు టబుకు మధ్య రహస్య సంబంధాలు ఏమీ లేవని తాను గట్టిగా నమ్ముతున్నట్టు నాగ్‌ భార్య అమల ఒక ఆంగ్ల దినపత్రిక ప్రతినిధికి చెప్పారు. ఎన్నో సామాజిక సమస్యలు ఉండగా ముంబాయి పత్రికలు వదంతులను పట్టుకుని వేళ్ళాడడం విచారకరమని ఆమె అన్నారు. టబు హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంట్లోనే నిద్ర చేస్తోందన్నది ముంబాయి పత్రికల కథనాల సారాంశం. తమ ఇల్లు పవిత్రమైన గుడిలాంటిదని, బాలీవుడ్‌ మురికి తమ ఇంటికి తాకే ప్రసక్తి లేదని అమల అంటోంది. కానీ నాగ్‌కు, టబుకు మధ్య సంబంధం కొనసాగుతోందన్న విషయం అమలకు తెలుసని, సంసారాని కంటే సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించే ఆమె ఇటువంటి విషయాలను లైట్‌గా తీసుకుంటోందని టాబ్లాయిడ్‌ జర్నల్స్‌ కథనం. తనకు పన్నెండేళ్ళ కొడుకు ఉన్నాడని, అతని బాధ్యతలు చూడడంతో పాటు బ్లూక్రాస్‌ వ్యవహారాలకు ఆమె సమయం అంతా ఖర్చవుతుంటుంది. నాగార్జునతో పెళ్ళయిన తర్వాత ఆమె నటజీవితానికి గుడ్‌బై చెప్పింది. అందులో త్యాగం ఏమీ లేదని ఏడేళ్ళ పాటు హీరోయిన్‌గా నటించానని, అది చాలని అమల అంటోంది. ఏది ఏమైనా అమల వంటి విశాల హృదయం ఉన్న భార్య తమకు దొరకనందుకు కొందరు సరసులైన తెలుగు హీరోలు బాధపడుతూ ఉండవచ్చు.

కృష్ణ కుమార్తె మంజుల నిర్మాతగా బిజీ
చంద్రబాబుకు లాభించని చికున్‌ గన్యా!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X