హోంపేజి
తెలుగునాట భక్తి రసం తెప్పలుగ పారుతోంది అని గజ్జెల మల్లారెడ్డి కవిత్వం రాశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్న తర్వాత క్షీణ దశలో ఆయన ఈ కవిత్వం రాశారు. మన దేశంలో ఉన్న వారికంటే అమెరికాలో ఉంటున్న భారతీయులకు భక్తి భావాలు అధికంగా ఉంటున్నాయి. అమెరికాలోని 33 రాష్ట్రాల్లో 53 హిందూ దేవాలయాలు ఉన్నట్టు ఇటీవల ప్రచురితమైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. భారత్ రేఖ ఇన్ అమెరికా అనే ఈ పుస్తకాన్ని మాజీ భారతీయ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కె. పంచపకేశన్ రచించారు. అమెరికాలోని హిందూ దేవాలయాల విశిష్టతను ఆయన విడివిడిగా విశ్లేషించారు. సాధారణంగా విష్ణు, శివాలయాలు విడివిడిగా ఉంటాయి. కానీ అమెరికాలోని కొన్ని చోట్ల ఈ ఇద్దరు దేవుళ్ళ విగ్రహాలను ఒకే ప్రాంగణంలో ప్రతిష్టించడం విశేషం. మిచిగాన్‌లో పరాశక్తి ఆలయ నిర్మాణానికి ప్రవాస భారతీయుడు జికె కుమార్ 25 లక్షల డాలర్లు ఖర్చు పెట్టారట. భారతదేశంలోనే అరుదుగా ఉండే బ్రహ్మ దేవుడి ఆలయం లాస్ వేగాస్‌లో ఉంది. 55 దేశాల నుంచి సేకరించిన విరాళాలతో హవాలీలో నిర్మిస్తున్న శివాలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద స్పటిక శివలింగాన్ని ప్రతిష్టించనున్నారు.
పొగరులో కిరణ్ రాథోడ్ సొగసు చూడతరమా?
మావోయిస్టులలోనూ మహిళా వేధింపులు?