వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ ప్లీనరీ: కొన్ని సంగతులు

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్య చికున్‌ గన్యా వచ్చిన వ్యక్తిలా ఢీలా పడిపోయారు. కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి ఇప్పటికి పది సార్లు డెడ్‌లైన్లు పెట్టిన ఆయన ఈసారి ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా పెట్టారు. ఆలోపు తెలంగాణపై యుపిఎ ప్రభుత్వం తేల్చకపోతే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఆయన, ఆయన సహచర బుర్రకథా సహాయకుడు నరేంద్ర అంటున్నారు. తెలంగాణ ప్రజలు వీళ్ళని లైట్‌గా తీసుకుంటున్నట్టు ఇటీవలి స్ధానిక సంస్ధల ఎన్నికలే నిరూపించాయి. చివరికి విజయశాంతికి కూడా వీళ్ళు లోకువై పోయారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్‌ విఫలమైందని, తన తల్లి తెలంగాణ పార్టీ ద్వారా ఆలోటు తీరుస్తానని ఆమె అంటోంది. ఆగస్టు 15లోపు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం విషయంలో తేల్చి చెప్పే అవకాశం ఎటూ లేదు కాబట్టి రాజీనామాలు చేసి కెసిఆర్‌, నరేంద్ర ఏం చేస్తారు? ఇప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని తె లిసిపోయింది కాబట్టి హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఫలితంగా ఆంధ్రా నగరాల్లో భూములకు డిమాండ్‌ తగ్గిపోయి చౌకగా లభిస్తున్నాయి. కెసిఆర్‌ ఇప్పుడు ఆంధ్రాలో భూములు కొనుక్కుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమ్ముకుంటే బాగుంటుందేమో.

కూరగాయల మాదిరిగా బ్లూఫిల్మ్‌ సీడీలు
వెకిలి జర్నలిస్టుకు ముఖ్యమంత్రి గుణపాఠం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X