వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు అసిస్టెంట్‌గా పని చేసిన ఇవివి సత్యనారాయణ వెకిలి హాస్యానికి మారుపేరు. ఆయినా ఆయన సినిమాలు బి,సి సెంటర్లలో బాగా ఆడుతుంటాయి. ఇటీవల ఆయన సినిమా కితకితలు హిట్‌ కావడంతో ఈ ఏడాది ఆయనకు కలిసి వచ్చేలా ఉంది. ఇటీవలే పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న ఇవివి ఆ సందర్భంగా పర్సనల్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించారు. అందులో ఇవివి స్టైల్‌ శృంగారం ఉంటుందని ఆశించిన వారికి ఆశాభంగమే కలుగుతుంది. అందులో ఆయన సినిమాలు, ఆయన కొడుకుల సినిమాల విజయగాధలు మాత్రమే ఉన్నాయి. జంధ్యాల సున్నితమైన హాస్యాన్ని అందిస్తే, ఆయన శిష్యుడు తనదైన మార్గంలోకి వెళ్ళి ముతక హాస్యం, దారుణమైన శృంగారం చూపిస్తున్నారు. ఆమధ్య ఆయన దర్శకత్వం వహించిన ఎవడిగోల వాడిదే సినిమా మితిమీరిన పబ్లిసిటీ కారణంగా బాగా ఆడినా క్లాస్‌ ప్రేక్షకులకు వెగటు కలిగించింది. కొడుకు నరేష్‌ హీరోగా నటించిన కితకితలు కలెక్షన్లు కూడా నిలకడగా ఉండడంతో ఇవివి మరిన్ని బూతు సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి సినిమాలు రాకుండా ఉండాలంటే ప్రేక్షకులే వాటి కి దూరంగా ఉండాలి.

త్వరలో విజయశాంతి ఆత్మకథ
హైదరాబాద్‌లో హైటెక్‌ వ్యభిచారం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X