• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

కోకాకోలాకు దక్షిణ భారతదేశం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి రాధిక వ్యవహరించనుంది. ఆమెకు కోక్‌ కంపెనీ భారీ పారితోషికం ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. కూల్‌డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండడంపై దేశవ్యాప్తంగా వీటి నిషేధం కోసం ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. అయినా రాధిక కోక్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండడానికి అంగీకరించడం సాహసమే.

డబ్బు ఎంతటి పనినైనా చేయిస్తుంది. వివిధ టీవీ కార్యక్రమాల ద్వారా మధ్య తరగతి ప్రజానీకంలో విశ్వసనీయత పొందిన రాధిక చేత కోక్‌ ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆ కంపెనీ భావించింది. రాడాన్‌ మీడియా వర్క్స్‌ చైర్‌పర్సన్‌గా ఇప్పటికే రెండు చేతులా సంపాదిస్తున్న రాధికకు కోక్‌ ఆఫర్‌ ఆకస్మిక ధన లాభాన్ని తెచ్చిపెట్టింది. చిరంజీవి థమ్స్‌ప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు విమర్శలు వచ్చాయి. తదుపరి కాంపెయిన్‌కు తాను అంగీకరించబోనని ఆయన స్పష్టం చేశారు. సామాజిక బాధ్యత గల వారెవరూ కూల్‌డ్రింక్స్‌ ప్రకటనల్లో నటించకూడదని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

శోభన్‌బాబు ఆస్తులు 2000 కోట్లు?
మాడుగుల ఒకప్పుడు జూనియర్‌ ఆర్టిస్టు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X