వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

శింబుతో ప్రేమాయణం దెబ్బతినడంతో నయనతార ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకునేటంత పిరికి వ్యక్తి కాదని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. అనతి కాలంలోనే తమిళ, తెలుగు సినిమా రంగాల్లో అగ్ర స్ధానానికి చేరుకున్న ఈమె త్రిష లాగే ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. చిన్న వయసులోనే బాగా లావెక్కిన ఈ మలయాళీ భామ అసలు పేరు డయానా చెరియన్‌. ఈమె ఒక చేతికి ఆరు వేళ్ళు ఉన్నాయి. అది అదృష్ట సంకేతమని భావించి సర్జరీ చేయించుకోవడం లేదు. కానీ ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన వైద్యాలను వేయించుకోవలసి వస్తోంది. బాస్‌ షూటింగ్‌ సందర్భంగా ఆమె లిపోసక్షన్‌ సర్జరీలు చేయించుకుంది. దానితో మనిషి బాగా నీరసించిపోయి ఒక సారి షూటింగ్‌ స్పాట్‌లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు నయనతార సింగపూర్‌ వెళ్ళి ఖరీదైన చికిత్స చేయించుకోవాలనుకుంటోంది. చర్మాన్ని చిన్న పిల్లల్లా మృదువుగా చేసి, ఛాయను మెరుపరిచే ఈ చికిత్సకు ఒక సిటింగ్‌కు లక్ష రూపాయల చొప్పున నెలకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది. స్టాలిన్‌లో నటించడానికి ముందు త్రిష సింగపూర్‌లో ఈ చికిత్స చేయించుకుంది. తెలుగులో అధిక పారితోషికం తీసుకుంటున్న నయనతార మెల్లగా తెలుగు భాషను నేర్చుకుంటోంది.

డబ్బింగ్‌ సినిమాలపై నిషేధం వెనుక...
మోహన్‌బాబు రాజకీయ సందిగ్ధం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X