హోంపేజి
ఆవేశపరుడైనా, తన మార్గంలో ఒడిదుడుకులను ఎదురొడ్డడం మోహన్‌బాబు ప్రత్యేకత. ఆయన స్నేహాలు బహుముఖాలుగా ఉంటాయి. ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యుడైన ఆయన ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడితో విభేదాలు రావడంతో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండిపోయారు. మోహన్‌బాబు దాసరి నారాయణ రావుకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చి మంచి పదవి ఇప్పించే శక్తి దాసరికి లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మోహన్ బాబు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఆయనకు ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత రాజారెడ్డి తనకు ఆదర్శమని మోహన్‌బాబు ఒక ప్రకటన చేసినా వైఎస్ కరుణా కటాక్షాలు లభించలేదు. ఆయన ఆప్త మిత్రుడు హరికృష్ణ ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయన బాటలోనే మోహన్‌బాబు నడుస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే చంద్రబాబును ఒకనాడు తీవ్రంగా వ్యతిరేకించిన ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్తు ప్రశ్నార్ధకమే. రాజ్యసభ సభ్యుడిగా పవర్‌ను ఎంజాయ్ చేసిన మోహన్‌బాబు ఎలాగైనా మళ్ళీ రాజకీయంగా వెలుగులోకి రావాలనుకుంటున్నారు.
నయనతార
ఖరీదైన
చర్మ
చికిత్స
డబ్బింగ్
సినిమాలపై
నిషేధం
వెనుక...