హోంపేజి
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కోటరీలో ఆయన ఆప్త మిత్రుడు కెవిపి రామచంద్రరావు, సిఎం కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రస్ధానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత స్ధానాల్లో ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి వారు ఉంటారు. ప్రభుత్వంలో పెద్ద పనులు అవ్వాలంటే కెవిపి, జగన్లతోనే సాధ్యం. కానీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న వాస్తవం వీరిద్దరి విషయంలో కూడా నిజమైంది. బెంగుళూరులో తన కుమారుడు వ్యాపారాల ద్వారా ఏటా 40 కోట్లు సంపాదిస్తున్నాడని వైఎస్ ఇటీవల స్వయంగా చెప్పారు. కానీ జగన్ దృష్టి అంతా హైదరాబాద్ మీద, అంకుల్ కెవిపి మీద ఉంది. కెవిపి తన తండ్రిగారికి ఎక్కడ అప్రతిష్ట తెస్తారోనని జగన్ ఆందోళన చెందుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆయన కెవిపికి వ్యతిరేకంగా అధిష్టానవర్గానికి ఆకాశరామన్న ఉత్తరాలు, మెయిల్స్ పంపుతున్నట్టు సమాచారం. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో కెవిపి సంపాదించుకున్న ఆస్తుల మీద జగన్ ఒక కన్నేసి ఉంచారు. అంకుల్ అనికూడా చూడకుండా తన వెనుక గోతులు తవ్వుతున్న జగన్ మీద కెవిపి నిఘా పెట్టారు. ఆయన ఒక ఎంపీని బెంగుళూరుకు పంపించి జగన్ వ్యవహారాల గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఒకరు ఆప్తమిత్రుడు, మరొకరు ఏకైన కుమారుడు. ఇద్దరి మధ్య స్పర్ధలను తొలగించలేక ముఖ్యమంత్రి వైఎస్ సతమతమవుతున్నారట.
త్రిషకు
చిరంజీవి
హితబోధ!
తప్పించుకు
తిరుగుతున్న
జానారెడ్డి