ఆంధ్రప్రదేశ్
పౌరహక్కుల
సంఘం
(ఎపిసియల్సి)
అధ్యక్ష
పాత్రను
పోషించడానికి
కూడా
తాను
సిద్ధమేనని
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(తెరాస)
అధినేత
కె.
చంద్రశేఖరరావు
ప్రకటించారు.
ఎపిసియల్సి
ఏర్పాటు
చేసిన
బహిరంగ
సభలో
ఆయన
ఆదివారంనాడు
ప్రసంగించారు.
వాస్తవానికి
తెలంగాణకు
సంబంధించినంత
వరకు
పౌరహక్కులనేవి
పెద్ద
సమస్యగానే
వున్నాయి.
ఆ
సమస్యను
తీర్చడానికి
పార్లమెంటరీ
పార్టీకి
చెందిన
ఒక
నాయకుడు
ముందుకు
రావడం
విశేషమే.
సామాజిక
అసమానతలు,
అణచివేతలు
కొనసాగితే
తెలంగాణ
ప్రజలు
చూస్తూ
ఊరుకోరని
ఆయన
అన్నారు.
సామాజిక
అసమానతలు,
అణచివేతలు,
అరాచకాలు,
ఆత్మహత్యలు,
ఎన్కౌంటర్లు
లేని
దళిత,
హరిత,
బంగారు
తెలంగాణను
సాధించడమే
తన
లక్ష్యమని
ఆయన
అన్నారు.
భౌగోళిక
తెలంగాణ
ఏర్పడినంత
మాత్రాన
అది
సాధ్యమవుతుందా
అనేది
పెద్ద
ప్రశ్న.
ఏర్పడబోయే
భౌగోళిక
తెలంగాణకు
అనేక
పరిమితులున్నాయనే
విషయం
తెలియంది
కాదు.
ప్రజాస్వామికవాదులు
ప్రభుత్వాలకు
వ్యతిరేకంగా
పోరాడే
పాత్రనూ
అప్పుడూ
స్వీకరించక
తప్పదనేది
ఒక
అవగాహన.
ఏమైనా
ఈ
సమస్యను
చంద్రశేఖరరావుగారు
ఎలా
పరిష్కరిస్తారో
వేచి
చూడాల్సిందే.
పైగా
తెలంగాణ
ఏర్పడితే
అధికారంలోకి
తెరాస
వస్తుందనేది
కూడా
పెద్ద
ప్రశ్ననే.
కాంగ్రెస్
పార్టీయో,
తెలుగుదేశం
పార్టీయో
అధికారంలో
వుంటే
పరిస్థితులు
ఇంతకన్నా
గొప్పగా
ఏమీ
వుండవు.
అయితే
పరిమితుల్లోనైనా
ప్రభుత్వం
చేసే
కొన్ని
పనులు
ప్రజలకు
ఉపయోగపడేవి
చేయక
తప్పదు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం
చేస్తున్న
కొద్దిపాటి
కార్యాల
ఫలితాలు
కూడా
తెలంగాణకు
దక్కడం
లేదనేది
భౌగోళిక
తెలంగాణ
ఆశించడంలో
ఉన్న
ఆంతర్యం.
అయితే
ఆత్మగౌరవం,
స్వయం
నిర్ణయాధికారం
వంటివి
కూడా
ఇందులో
ఇమిడి
వున్న
మాట
వాస్తవమే.
తాను
సాధించదల్చుకున్న
తెలంగాణకు
సంబంధించి
కెసిఆర్
మనసులో
ఉన్న
బ్లూప్రింట్
ఏమిటో
ఎవరికీ
తెలియదు.
అది
తెలిస్తే
గానీ
ఏమీ
మాట్లాడలేం.