• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోదావరి ఉత్సవాలకు చిరంజీవి విశాఖ ఉత్     లోగుట్టు    గోదావరిఉత్సవాలకు చిరంజీవివిశాఖ ఉత్సవాలతరహాలోనే గోదావరి

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగునాట కులాల కురుక్షేత్రం ఇంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలుసు. అధిక సంఖ్యాకులకు కులాల పట్టింపు పెద్దగా ఉండనప్పటికీ కొందరు ఫ్యానటిక్స్‌గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో శూద్రకులాలకు, బ్రాహ్మణులకు మధ్య అన్ని రంగాల్లో హోరాహోరీ పోరు ఉంది. తెలుగులో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రామన్న చౌదరి పేర్లతో తెలుగులో ఫ్యాక్షన్‌ చిత్రాలు వచ్చినట్టే తమిళంలో కూడా శూద్ర గ్రామ పెద్దల మీద సినిమాలు వచ్చాయి. ఇతర కులాల వారికే పౌరుషాలు పంతాలు ఉంటాయా? ఎంతో చరిత్ర కలిగిన బ్రాహ్మణులకు మాత్రం ఉండవా అనుకుని సాయికుమార్‌ పరశురాముడి గెటప్‌లో శ్లోకం సినిమాలో నటించాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఒక వర్గం పెద్దలకు ఆ సినిమా బాగా నచ్చింది. వారు సాయి కుమార్‌ను ఆకాశానికి ఎత్తారు. తమిళంలో ఈ ట్రెండ్‌ ఇప్పుడు ప్రారంభమైంది. బ్రాహ్మణ యువకుడే ఫ్యాక్షనిస్టు హీరోగా తమిళంలో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆచార్య అనే టైటిల్‌తో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది.

వైఎస్‌కు అనుకూలంగా మారిన కెసిఆర్‌

అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు అన్న చందంగా ఉంటుంది టిఆర్‌ఎస్‌ అధినేత, కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు వైఖరి. రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తన మాటల పోటుతో కొంతకాలం వేధించిన ఆయన ఇక ఆయనతో పెట్టుకుంటే లాభం లేదని, ఆయనకు మిత్రుడిగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో సిపిఎం, కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవడం ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కోపం తెప్పించింది. దీనికి వైఎస్సే కారణమని ఆమె చిర్రుబుర్రులాడారు. ఆ సమయంలో సోనియాగాంధీతో ఒక నిముషం మాట్లాడే భాగ్యం కలిగిన చంద్రశేఖరరావు ఇందులో వైఎస్‌ తప్పులేదని చెప్పినట్టు తెలుస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కులపిచ్చితోనే చంద్రబాబుతో చేతులు కలిపినట్టు కెసిఆర్‌ ఆమెకు వివరించినట్టు ఢిల్లీ వర్గాలు తెలియజేశాయి. తాను చేసిన ఈ ఫేవర్‌కు ప్రతిగా కెసిఆర్‌ వైఎస్‌ నుంచి ఎటువంటి వరం పొందుతారో వేచి చూడాలి.

నటి గోపికకు ఎస్‌ఎంఎస్‌ల బాధ

గోపిక ఇంటర్వ్యూలు ఇవ్వడం అరుదు. ఇచ్చినా ప్రశ్నలకు జవాబుగా ఆమె చిరునవ్వునే ప్రయోగిస్తుంది. ఆమె చేతిలో ఎప్పుడూ కన్పించే సెల్‌ ఫోన్‌ ఇప్పుడు అదృశ్యమైంది. సినిమారంగంలో వెకిలి వేషాలు వేసే వాళ్ళు ఎక్కువని గోపిక వాపోతోంది. ఎవరితోనైనా కాస్త చనువుగా మాట్లాడితే వెంటనే వారి నుంచి అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని ఆమె తన బాధను వెల్లడించింది. హీరోలు కూడా ఆమెకు ఓపెన్‌గా ఐ లవ్‌యు అని ఎస్‌ఎంఎస్‌లు పంపించి, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. అందుకే ఆమె ఈ పీడ వదిలించుకునేందుకు తన సెల్‌ఫోన్‌ తండ్రి వద్ద ఉంచుతున్నారు. ఆయన అశ్లీల మెసేజ్‌లను డిలీట్‌ చేసి, మంచి మెసేజ్‌ల సమాచారాన్ని మాత్రమే కూతురుకి చేరవేస్తున్నారట. ఈ విషయంలో నయనతార భిన్నమైనది. ఆమె ఒక్కరే ఇటువంటి ఉపద్రవాలను ఎదుర్కొంటుందట. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరిని నమ్మాలో నయనతారకు బాగా తెలిసినట్టుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X