హోంపేజి
తెలుగుదేశం పార్టీతో రంగప్రవేశం చేసిన నన్నపనేని రాజకుమారి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి అనేక పదవులను అనుభవించారు. ఆమెను అసెంబ్లీ సమావేశాల్లో చూసినప్పుడల్లా ఎన్టీ రామారావుకు ఆరోజుల్లో వళ్ళు మండిపోయేది. తాను రాజకీయాల్లోకి తెచ్చిన మహిళ నీతి లేకుండా కాంగ్రెస్తో జత కట్టిందని ఆయన కోపం. ఇప్పుడు స్వయంగా ఆయన ముద్దుల కూతురే కాంగ్రెస్లో చేరి కేంద్ర మంత్రి కావడం వేరే విషయం. ఇటీవల వరకు అమెరికాలో కొడుకు వద్ద ఉండి వచ్చిన రాజకుమారి స్ధానిక సంస్ధల ఎన్నికలకై ఈటీవీ చర్చా వేదిక నిర్వహిస్తోందని తెలుసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఈనాడు కార్యాలయానికి వెళ్ళి కుర్చీ లాక్కుని చర్చలో పాల్గొన్నారు. అమెరికాలో ఉన్న ఆమెకు ఇక్కడి రాజకీయ పరిణామాలు ఏమి తెలుస్తాయిలే అనుకున్న ఈటీవీ నిర్వాహకులు ఆమె అంతగా అప్డేట్ అయి మాట్లాడడం చూసి నివ్వెరపోయారు. అన్నట్టు రాజకుమారి నన్నపనేని నవరత్నాలు పేరుతో తొమ్మిది పుస్తకాలు రచించారు. అందులో రాజకీయాలు ఉండ వు. కవిత్వమే ఉంటుంది. కొందరి కవిత్వం కంటే రాజకీయాలే మెరుగేమో?
పరుచూరి వారి రంగులు చూడతరమా?
పోలీసుల మాట వినని ఖైరతాబాద్ వినాయకుడు