• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ది అదో స్టైల్‌. చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటున్న అరుణ్‌ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన నాయకుల్లో ఒకరని అందరికీ తెలిసిందే. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో డ్రాఫ్టింగ్‌ విషయంలో ఆయన దిట్ట.

అంతేగాక ఆయన తెలుగుదేశం పార్టీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించే ఒక చిన్న సినిమాను నిర్మించి, కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి చూపించుకుని మెప్పు పొందారు. తనకు సన్నిహితులైన వారిని ముఖ్యమైన పదవుల్లో నియమించేలా ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌కు ఐడియాస్‌ డాట్‌కామ్‌ లా పనిచేస్తూ ఉంటారు. ఇటీవల ఒక తెలుగు దినపత్రికలో ఆయనకు వ్యతిరేకంగా ఒక వార్త వచ్చింది. ప్రస్తుతం ఎఐసిసి కార్యదర్శిగా ఉన్న ఉండవల్లిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఆ వార్త సారాంశం. ఆ వార్తను ఢిల్లీలో చదువుకున్న ఉండవల్లి హుటాహుటిన హైదరాబాద్‌ వచ్చి శాసనసభ లాబీల్లో సంచరించారు. విషయమేమిటంటే ఎఐసిసి కార్యదర్శి పదవితో సంతృప్తి పడని ఉండవల్లి ఉద్దేశపూరితంగా ఆ పత్రికలో ఆ వార్తను రాయించుకున్నట్టు సమాచారం. త్వరలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉన్నందువల్ల మంత్రి పదవి మీద కన్నేసిన ఆయన పార్టీ పదవిని వెంట్రుకలా వదులుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

జ్యోతిక పెళ్ళికి వెళ్ళని నయనతార
రింగ్‌రోడ్డున పడ్డ మురళీమోహన్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X