• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం హయాంలో దర్జాగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసి నాలుగు చేతులా సంపాదించిన సినీనటుడు మురళీ మోహన్‌కు ఈ మధ్య పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జయభేరి సంస్ధ పేరుతో ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్లు చేసి ప్రవాస ఆంధ్రుల నమ్మకాన్ని చవి చూసిన మురళీమోహన్‌ ఇప్పుడు వ్యాపారంలో తగిలిన పెద్ద దెబ్బతో మానసికంగా కుంగిపోయారు.

ఒక ప్రముఖుడిని భాగస్వామిగా చేసుకుని మురళీమోహన్‌ శామీర్‌పేట వద్ద కోట్లాది రూపాయలు వెచ్చించి 20 ఎకరాలను కొనుగోలు చేశారు. ఆ స్ధలం ఔటర్‌రింగ్‌ రోడ్డులో కలిసిపోవడం, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పరపతి లేకపోవడంతో లబోదిబోమనడం మురళీమోహన్‌ వంతయింది. శామీర్‌పేట సమీపంలోని ఒక జంక్షన్‌లో ఉన్న తన పొలాన్ని మురళీమోహన్‌కు అగ్రిమెంట్‌ చేసిన ఆ సోకాల్డ్‌ భాగస్వామి ఇప్పుడు హాయిగా నవ్వుకుంటున్నాడు. మురళీమోహన్‌ ఆ స్ధలాన్ని రిజ్రిస్టేషన్‌ చేయించుకున్న మూడో రోజునే ఆ స్ధలాన్ని ఔటర్‌రింగ్‌ రోడ్‌ పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తెలుగుదేశం హయాంలో ఎన్నో వివాదాస్పద స్ధలాలను రెగ్యులరైజ్‌ చేసుకున్న మురళీమోహన్‌ కాంగ్రెస్‌ హయాంలో దారుణంగా మోసపోయారు. రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఎంతో అనుభవం ఉన్న మురళీమోహన్‌ ఇక్కడ పప్పులో కాలు వేయడం రియల్‌ఎస్టేట్‌ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జ్యోతిక పెళ్ళికి వెళ్ళని నయనతార
కేంద్రమంత్రి పదవిపై ఉండవల్లి కన్ను

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X